Homeజాతీయ వార్తలుVijay CM Oath Ceremony: విజయ్ రేంజ్ అర్థమైంది.. ఎన్డీటీవీ నుంచి టీవీ9 వరకు.. రికార్డు...

Vijay CM Oath Ceremony: విజయ్ రేంజ్ అర్థమైంది.. ఎన్డీటీవీ నుంచి టీవీ9 వరకు.. రికార్డు స్థాయి వ్యూస్

Vijay CM Oath Ceremony: నేషనల్ మీడియా సౌత్ వార్తలకు అంతగా స్కోప్ ఇవ్వదు. ఏవైనా సంచలన వార్తలు ఉంటే తప్పా.. మిగతా విషయాలను అంతగా పట్టించుకోదు. దక్షిణ భారతదేశం మీద జాతీయ మీడియాకు మొదటి నుంచి కూడా చిన్న చూపే. నేషనల్ మీడియా సౌత్ ఇండియాకి సంబంధించిన వార్తలకు అంతగా ప్రయారిటీ ఇవ్వదు. కానీ తమిళనాడు రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత నేషనల్ మీడియా మనసు మార్చుకుంది. కొద్దిరోజులుగా తమిళ రాజకీయాలకు నేషనల్ మీడియా విపరీతమైన […]

Vijay CM Oath Ceremony: నేషనల్ మీడియా సౌత్ వార్తలకు అంతగా స్కోప్ ఇవ్వదు. ఏవైనా సంచలన వార్తలు ఉంటే తప్పా.. మిగతా విషయాలను అంతగా పట్టించుకోదు. దక్షిణ భారతదేశం మీద జాతీయ మీడియాకు మొదటి నుంచి కూడా చిన్న చూపే. నేషనల్ మీడియా సౌత్ ఇండియాకి సంబంధించిన వార్తలకు అంతగా ప్రయారిటీ ఇవ్వదు. కానీ తమిళనాడు రాజకీయాలలో చోటుచేసుకున్న పరిణామాల తర్వాత నేషనల్ మీడియా మనసు మార్చుకుంది.

కొద్దిరోజులుగా తమిళ రాజకీయాలకు నేషనల్ మీడియా విపరీతమైన ప్రయారిటీ ఇస్తోంది. ఆద్యంతం తమిళ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపించాయి. విజయ్ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాలేదు. మిగతా పార్టీలు సపోర్ట్ ఇస్తామని చెప్పి లైట్ తీసుకున్నాయి. ఆ తర్వాత అనేక సందర్భాలలో ప్రభుత్వం ఏర్పడుతుందని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత మద్దతు లేకపోవడంతో విజయ్ వెనుకడుగు వేయాల్సి వచ్చింది. రెండుసార్లు గవర్నర్ ను కలవాల్సి వచ్చింది. అయినప్పటికీ గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఒప్పుకోలేదు. మద్దతు లేఖలు ఇస్తేనే ప్రభుత్వ ఏర్పాటుకు ఒప్పుకుంటామని గవర్నర్ పేర్కొన్నారు.

శనివారం అనేక నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత విజయ్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు గవర్నర్ ఒప్పుకున్నారు. ఆదివారం విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడానికి నేషనల్ మీడియా నుంచి మొదలుపెడితే స్థానిక మీడియా వరకు ఆసక్తిని చూపించింది. ఫలితంగా రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. ఎన్డి టీవీ నుంచి మొదలు పెడితే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరకు చానల్స్ లైవ్ స్ట్రీమింగ్ ఇచ్చాయి. ప్రతి ఛానల్ లో కూడా విపరీతమైన వ్యూయర్షిప్ నమోదయింది
. విజయ్ మాట్లాడుతున్నంత సేపు వ్యూస్ అమౌంట్ అని పెరిగిపోయాయి. దీంతో విజయ్ కేవలం తమిళనాడు రాష్ట్రానికి మాత్రమే కాకుండా.. దేశ నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

విజయ్ తొలి ప్రసంగంలోని ఆకట్టుకున్నారు. కీలకమైన మూడు నిర్ణయాల మీద తొలి సంతకం పెట్టారు. తమిళనాడు భవిష్యత్ కోసం తన వద్ద అద్భుతమైన ప్రణాళిక ఉందని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశం కృషి చేస్తానని విజయ్ వెల్లడించారు. అంతేకాదు, తాను రాజకీయాలకు వచ్చింది ప్రజల సేవ చేయడానికి.. డబ్బు సంపాదించుకోవడానికి కాదని విజయ్ స్పష్టం చేశారు. తనను ఒక ముఖ్యమంత్రి కాకుండా.. కుటుంబ సభ్యుడిగా చూడాలని విజయ్ ప్రజలకు సూచించారు. తద్వారా తాను చీఫ్ మినిస్టర్ రూపంలో ఉన్న కామన్ మ్యాన్ అని నిరూపించుకున్నారు విజయ్. ఇదే తీరు పరిపాలనలో సాగితే తమిళనాడులో కొత్త రాజకీయాలు చూస్తారని విశ్లేషకులు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper