Homeటాప్ స్టోరీస్Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక...

Cinema industry: ప్రేక్షకుల జేబులకు చిల్లులు.. సినీ పెద్దల పన్నుల ఎగవేత? ఐటీ రైడ్స్ వెనుక కారణమిదే?

Cinema industry: సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఒక సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నిర్మాత.. దర్శకుడు.. హీరో, హీరోయిన్లు.. టెక్నీషియన్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అనేక రకాల వ్యక్తుల సమూహం ఉంటుంది. ఒక సినిమా కనుక విజయం సాధించితే ఈ వ్యవస్థ మొత్తానికి భారీగా డబ్బు వస్తుంటుంది. విజయాల శాతం చాలా తక్కువ సినిమా పరిశ్రమలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అధికంగా పారితోషకాలు ఉంటాయి. సహజంగా వీటిని […]

Cinema industry: సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. ఒక సినిమా వెనుక ఎంతోమంది శ్రమ ఉంటుంది. నిర్మాత.. దర్శకుడు.. హీరో, హీరోయిన్లు.. టెక్నీషియన్లు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్లు.. ఇలా అనేక రకాల వ్యక్తుల సమూహం ఉంటుంది. ఒక సినిమా కనుక విజయం సాధించితే ఈ వ్యవస్థ మొత్తానికి భారీగా డబ్బు వస్తుంటుంది.

విజయాల శాతం చాలా తక్కువ

సినిమా పరిశ్రమలో విజయాల శాతం చాలా తక్కువగా ఉంటుంది. సినిమా పరిశ్రమలో అధికంగా పారితోషకాలు ఉంటాయి. సహజంగా వీటిని భర్తీ చేసుకోవడానికి నిర్మాతలు రకరకాల మార్గాల ద్వారా ఆదాయాలు సంపాదించుకుంటారు. ఇటీవల కాలంలో భారీ చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాతలు టికెట్ రేట్లను పెంచుకునే వెసలు బాటును పొందుతున్నారు. దీనిపై రక రకాల ఆరోపణలు వస్తున్నప్పటికీ.. నిర్మాతలు తమకున్న మార్గాల ద్వారా టికెట్ రేట్లను పెంచుకుంటున్నారు. సినిమా టికెట్ ధరలు పెంచడం.. సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తుల ఆదాయం.. పన్నుల లెక్కపై వివాదాలు రావడం.. వంటిది ప్రేక్షకుల్లో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఎవరైనా సరే ఆదాయపు పన్ను కట్టలేదు అని నిర్ధారించాలి అంటే కచ్చితంగా అధికారిక దర్యాప్తు.. ఆధారాలు.. సంబంధిత అధికారుల నిర్ణయం కచ్చితంగా ఉండాలి. కేవలం సోదాలు జరిగినంత మాత్రాన.. ఒక వ్యక్తి ఐటి కట్టలేదు అని చెప్పడం నిజమైనది కాదు.

ఐటి దాడులు కొత్త కాదు

సినిమా రంగంలో పనిచేస్తున్న వారి మీద ఐటి దాడులు కొత్త కాదు. సరిగా సోమవారం కూడా ఒక ప్రముఖ కథానాయక ఇంట్లో.. ఆమె మామ ఇంట్లో కూడా తనిఖీలు జరిగాయి. ఏకకాలంలో 12 ప్రాంతాలలో అధికారులు సోదాలు జరిపారు. దీంతో మరోసారి సినిమా ఇండస్ట్రీ గురించి మరోసారి చర్చ మొదలైంది.. ఈ నేపథ్యంలోనే సినిమా రంగంలో నల్ల డబ్బు అధికంగా ఉంటుందని.. పన్నులు చెల్లించకుండా ఉంటారని.. రకరకాల అక్రమాలకు పాల్పడతారని అభిమానులు చర్చించుకుంటున్నారు.

ఆధారాలు ఉంటేనే దాడులు

ఆదాయపు పన్ను శాఖ అధికారులు స్పష్టమైన ఆధారాలు ఉంటేనే దాడులు చేస్తారు. సోదాలు చేపడతారు. ఆదాయపు లెక్కల్లో.. చెల్లించే పన్నుల వ్యవహారంలో తేడా ఉంటేనే ఐటీ అధికారులు రంగంలోకి దిగుతారు. ఇందులో రాజకీయాలకు అవకాశం ఉండదు. వ్యక్తిగత లక్ష్యాలకు ఆస్కారం ఉండదు. ఇటీవల కాలంలో టికెట్ ధరల పెంపు అనేది సర్వ సాధారణంగా మారిపోయింది. ఈ ధరల పెంపు వల్ల వచ్చే ఆదాయం ఎవరి జేబులోకి వెళ్తోంది అనేది చిదంబర రహస్యం లాగా మారిపోయింది. ప్రభుత్వాలు సహకరించడంతో నిర్మాతలు.. ఇతర సినీ రంగ వ్యక్తులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ప్రేక్షకులను దేవుళ్ళు అని చెబుతూనే.. వారి జేబులకు చిల్లులు పెడుతున్నారు.

జవాబుదారీ ఉండాలి

ఒక సినిమా ద్వారా నిర్మాత సంపాదించిన ఆదాయం.. ఇతర వ్యక్తులు సంపాదించిన సొమ్ముకు కచ్చితంగా జవాబుదారీ ఉండాలి. ఎందుకంటే ప్రేక్షకులు జేబులో నుంచి డబ్బులు తీస్తేనే వీరందరికీ డబ్బులు వస్తాయి. ప్రేక్షకులకు డబ్బులు ఉచితంగా రావు కదా. టికెట్ ధర పెంచినప్పటికీ ప్రేక్షకులు చూస్తున్నారంటే అది సినిమా మీద ఉన్న అభిమానం.. సినిమాలో నటించిన వ్యక్తుల మీద ఉన్న అభిమానం. కానీ ఈ అభిమానాన్ని ఇలా క్యాష్ చేసుకోవడం.. వారి జేబులకు ఇలా చిల్లు పెట్టడం భావ్యం కాదని విశ్లేషకులు అంటున్నారు.. ఇష్టానుసారంగా టికెట్ ధరలు పెంచుకోవడం.. ప్రేక్షకులను ఇబ్బంది పెట్టడం పరిపాటిగా మారిందని.. అందువల్లే థియేటర్లకు ప్రేక్షకులు రావడం తగ్గించారని విశ్లేషకులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper