spot_img
Homeఎన్నికలుఇటు కేసీఆర్‌‌.. అటు మోడీ.. ఏం జరుగనుంది?

ఇటు కేసీఆర్‌‌.. అటు మోడీ.. ఏం జరుగనుంది?

CM KCR PM Modi
గ్రేటర్‌‌ ఫైట్‌ క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. రేపటితో ప్రచారం ముగియనుంది. దీంతో ఈ రెండు రోజుల్లో ప్రచారం మరింత ఊపులో సాగనుంది. ఇప్పటికే ప్రచార రంగంలోకి అగ్రనేతలు సైతం దూకిపోయారు. నేడు ఎల్బీ స్టేడియం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ బహిరంగ సభ నిర్వహిస్తుండగా.. ఇందుకోసం టీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదల రోజు కేసీఆర్‌‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే.. అప్పటికి ఇప్పటికీ పరిస్థితులు భారీగా మార్పు వచ్చింది. ఈ తరుణంలో కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతోందన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది.

Also Read: గ్రేటర్లో హామీల అమలు సాధ్యమయ్యే పనేనా..?

మరోవైపు.. ఈ రోజే దేశ ప్రధాని నరేంద్ర మోడీ సైతం హైదరాబాద్‌ వస్తున్నారు. అయితే.. ఓ స్థానిక సంస్థ ప్రచానికి ప్రధాని స్థాయి నేత రావడం అరుదు. దానికి తగ్గట్లుగానే మోడీ పర్యటన గ్రేటర్ ప్రచారం కోసం కాకున్నా ఆయన పర్యటన ఖచ్చితంగా గ్రేటర్ ఓటర్లపై ప్రభావం చూపుతుంది. మధ్యాహ్నం ప్రధాని మోడీ భారత్ బయోటెక్ ను సందర్శిస్తారు. వ్యాక్సిన్ పురోగతిని పరిశీలిస్తారు. మీడియాతో మాట్లాడుతారో లేదో స్పష్టత లేదు. కానీ.. ఆయన పర్యటన గంట మాత్రమే ఉండనుంది.

ఇకపోతే.. ఈ ఎన్నికలను బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా మేయర్‌‌ పీఠం కైవసం చేసుకోవాలని తహతహలాడుతూనే ఉంది. అందుకే.. అగ్రనేతలను రంగంలోకి దింపింది. రోజుకో అగ్రనేత ప్రచారానికి వస్తున్నారు. ప్రచారానికి ఆఖరి రోజు వరకూ ఎవరో ఒకరు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. నేడు అమిత్ షా కూడా రాబోతున్నారు. మరోవైపు కేసీఆర్ ప్రచారసభతో టీఆర్ఎస్.. ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లినట్లుగా అవుతుంది. అగ్రనేతల ప్రచారంతో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తరపున ప్రచారంలో జాతీయ స్థాయి నేతలెవరూ పాల్గొనడం లేదు. కేసీఆర్ పొలిటికల్ సభ.. మోడీ అపొలిటికల్ టూర్ గ్రేటర్ ప్రచారాన్ని పీక్స్‌లోకి తీసుకెళ్తున్నాయి.

Also Read: తెలంగాణవాదాన్ని కేసీఆర్ అందుకే పక్కన పెట్టారా..?

మొత్తంగా చూస్తే.. ఈ ఎన్నికల్లో గెలుపొందేందుకు అటు అధికార పార్టీ.. ఇటు బీజేపీ పోటాపోటీగా తలపడుతున్నాయి. ఈ చివరి రెండు రోజుల్లో ప్రచారంతో ప్రజలను ప్రసన్నం చేసుకోవాలని ఉవ్విల్లూరుతున్నాయి. మరోవైపు..ఈ గ్రేటర్ ఎన్నికల్లో ఓటరు నాడి కూడా ఎటూ అర్థం కాకుండా ఉంది. చివరకు అధికార పార్టీ నేతలే ఆ మాట చెప్పుకొస్తున్నారంటే ఎన్నికల్లో ఎంత టఫ్‌ ఫైట్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Kethireddy Venkatarami Reddy

Kethireddy Venkatarami Reddy: జగన్ ను ఇచ్చి పడేసిన కేతిరెడ్డి.. ఏంటి కథ?!

Kethireddy Venkatarami Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేతల స్వరం మారుతోంది. ఆ పార్టీలో కొందరు నేతలు దూకుడుగా ఉంటారు. దూకుడు వ్యాఖ్యలు చేస్తుంటారు. మరికొందరు ఆలోచనతో మాట్లాడతారు. ఆపై పవర్ఫుల్ గానూ...
Vijaya Sai Reddy

Vijayasai Reddy: విజయసాయిరెడ్డి అవసరం జగన్ కు అనివార్యం!

Vijayasai Reddy: గత కొద్ది నెలలుగా జగన్మోహన్ రెడ్డి కేంద్ర పెద్దలను కలిసేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొలిక్కి రావడం లేదు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్లు లభించడం...
Sidiri Appalaraju Arrest

Sidiri Appalaraju Arrest: అరెస్టు చేసే దాకా తెచ్చుకున్న ఆ మాజీ మంత్రి!

Sidiri Appalaraju Arrest: ఎట్టకేలకు మాజీమంత్రి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సీదిరి అప్పలరాజు అరెస్టయ్యారు. అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ నడిపిన బైక్ ఢీకొని దానయ్య అనే గొర్రెల కాపరి...
Healthy Dinner

Healthy Dinner: రాత్రి సమయంలో ఈ ఆహారం తింటున్నారా…

Healthy Dinner: ప్రస్తుత కాలంలో చాలామంది నిద్ర సమస్యను ఎదుర్కొంటున్నారు. అయితే కొందరు ఉద్యోగాలు ఇతర కారణాలతో ఒత్తిడిని ఎదుర్కొని సరైన నిద్ర పోవడం లేదు. మరికొందరు రాత్రి సమయంలో జీర్ణం...
RRB JE Recruitment 2026

RRB JE Recruitment 2026: రైల్వేలో యువతకు బంపర్‌ ఆఫర్.. ఈ ఛాన్స్‌ మిస్‌ చేసుకోకండి!

RRB JE Recruitment 2026: భారతీయ రైల్వేలు దేశంలోని అతిపెద్ద పబ్లిక్‌ సెక్టార్‌ సంస్థల్లో ఒకటి. ఇప్పుడు ఆ సంస్థలోని ముఖ్యమైన టెక్నికల్‌ పోస్టులను భర్తీ చేయడానికి రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డులు (ఆర్‌ఆర్‌బీ)...
Oktelugu Epaper