spot_img
Homeఆంధ్రప్రదేశ్‌సొంత బలాన్ని వీడి పరులపై ఆధారపడుతున్న టీడీపీ

సొంత బలాన్ని వీడి పరులపై ఆధారపడుతున్న టీడీపీ

TDPతెలుగుదేశం పార్టీ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కొంటోంది. ఎంతో చరిత్ర కలిగిన పార్టీ ప్రస్తుతం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అధికారం కోసం అడ్డదారులు తొక్కుతోంది. పార్టీకి చిత్తశుద్ధితో పనిచేసే కార్యకర్తలు ఉన్నారు. సీనియర్ నాయకులు ఉన్నారు. కానీ ఇటీవల పార్టీ అధినాయకత్వం కొత్త పోకడలు పోతోంది. పార్టీలోని వారికంటే ఇతరులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.

మత్తు డాక్టర్ సుధాకర్, ఎంపీ రఘురామ కృష్ణం రాజు విషయంలో టీడీపీ చేస్తున్న రాజకీయ విన్యాసాలతో సొంత పార్టీలో విమర్శలు వస్తున్నాయి. టీడీపీ అంటే ప్రాణమిచ్చే కార్యకర్తలు ఎందరో ఉన్నారు. ఈ మధ్య కరోనా కాటుకు చాలామంది బలైపోయారు. టీడీపీ కార్పొరేటర్ వానపల్లి రవికుమార్ కూడా కరోనాతో చనిపోయారు.

ఇటీవల నారా లోకేష్ విశాఖ పర్యటనలో భాగంగా మత్తు డాక్టర్ సుధాకర్ కుటుంబాన్ని పరామర్శించి వెళ్లిపోయారు. కార్యకర్తల కుటుంబాలను కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో టీడీపీ నాయకులు గుర్రుగా ఉన్నారు. కార్యకర్తలను కాదని బయటి వ్యక్తులను పరామర్శించడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఇక వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో చంద్రబాబు అతి చేస్తున్నారు. ఆయన పక్షాన నిలిచి కేంద్ర హోం శాఖకు లేఖలు రాస్తున్నారు. అనుకూల మీడియా ద్వాా అండగా నిలిచారు.

జగన్ ను ఎలా ఇబ్బంది పెట్టాలన్న దాని మీదే దృష్టి పెట్టి బయట వారికే టీడీపీ శక్తియుక్తుల్ని ధారపోస్తున్నారు. దీంతో టీడీపీ కార్యకర్తల్లో మనోనిబ్బరం పోతోంది. కేడర్ లో ఆత్మస్థైర్యం పెంపొందించేలా చర్యలు తీసుకోకపోతే టీడీపీ పని అయిపోతుందని భావిస్తున్నారు. సొంత పార్టీ వారిని కాదని బయట వారికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడంతో కార్యకర్తలు కినుక వహిస్తున్నారు. టీడీపీ నాయకులను ఆదుకోవడానికి ముందుకు రావాల్సిన అవసరాన్ని గుర్తించాలని సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

Wrong Mobile Recharge : తప్పుడు నెంబర్కు రీఛార్జ్ చేశారా.. ఇలా చేస్తే మనీ రిఫండ్..

Wrong Mobile Recharge : మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఎవరికి వారే రీఛార్జ్ చేసుకుంటూ ఉంటున్నారు. అయితే ఈ క్రమంలో ఒక్కోసారి తప్పుడు నెంబర్ పై రీఛార్జ్ అయ్యే అవకాశం...

IBPS PO 2026 : బ్యాంకు ఉద్యోగార్థులకు గుడ్‌ న్యూస్‌.. 7,460 ఉద్యోగాలకు మరో ఛాన్స్‌!

IBPS PO 2026 : ఐబీపీఎస్‌(ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌) పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్‌(పీవో), స్పెషలిస్ట్‌ ఆఫీసర్‌(ఎస్‌వో) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దరఖాస్తు ý డువు...
The Odyssey 3 Day Collections

The Odyssey Box Office : ‘ది ఒడిస్సీ’ 6 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. తెలుగు రాష్ట్రాల...

The Odyssey Box Office : క్రిస్టోఫర్ నోలన్ దర్శకత్వం లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం 'ది ఒడిస్సీ' బాక్స్ ఆఫీస్ వసూళ్ల సునామీ జోరు ఏమాత్రం తగ్గలేదు. సినిమా విడుదలై 6...
Lenin 10 Days Collection

Lenin Movie : ‘లెనిన్’ 13 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు.. కొత్త సినిమాలు వచ్చినా జోరు తగ్గలేదు..

Lenin Movie : అఖిల్ 'లెనిన్' చిత్రం బాక్స్ ఆఫీస్ జోరు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సినిమా విడుదలై 13 రోజులైనప్పటికీ కూడా, కొన్ని సెంటర్స్ లో నేటికీ కూడా భారీ...
Vijay Deverakonda

Vijay Deverakonda : ఆగిపోయిన విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. కోట్ల రూపాయిల నష్టం..

Vijay Deverakonda : యూత్ ఆడియన్స్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరోల్లో ఒకరు విజయ్ దేవరకొండ. చేసిన సినిమాలు తక్కువే, అందులో డిజాస్టర్స్ ఎక్కువ , అయినప్పటికీ ఈ...
Oktelugu Epaper