రాంగోపాల్ వర్మ.. వివాదాలను కెలికి మరీ దాన్ని రచ్చరచ్చ చేసే వర్మ ఈ మధ్య చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. అయితే ఆ సైలెన్స్ మరోసారి బద్దలైంది. ఈసారి చంద్రబాబు తనయుడు లోకేష్ పై పడ్డాడు.
సంచలన దర్శకుడు వివాదాల రాంగోపాల్ వర్మ తాజాగా సోషల్ మీడియా వేదికగా వివాదానికి తెరలేపారు. ఎప్పుడు ఏదో ఒక అంశంపై వివాదాస్పద ట్వీట్లు చేయడం.. దానితో ట్రెండింగ్ లో ఉండడం వర్మకు అలవాటు. ఈసారి కూడా వర్మ ఏపీ పాలిటిక్స్ పై మరో అస్త్రాన్ని సంధించాడు.
తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుందని.. అది ప్రాణాంతక వ్యాధి అని వర్మ సంచలన కామెంట్స్ చేశారు. ఈ వైరస్ కారణంగా పనిచేసే ఏకైక టీకా ఉందని.. దానిపేరే ‘తారక్ 9999’ అని జూనియర్ ఎన్టీఆర్ ను ట్యాగ్ చేసి ఈ వివాదాన్ని కెలికాడు.
టీడీపీ కార్యకర్తలకు తన సలహా విని.. త్వరపడి.. తెలుగుదేశం పార్టీకి టీకా వేయండి అని వర్మ ఉచిత సలహా ఇచ్చాడు. లేదా మీరందరూ ఆ వైరస్ బారినపడి చచ్చిపోతారని వర్మ హెచ్చరించాడు.
తెలుగుదేశం భావి వారసడు నారాలోకేష్ పై ఇటీవల అచ్చెన్నాయుడు మాట్లాడిన వీడియో బయటకు రావడం.. అందులో లోకేష్ వల్ల పార్టీ నాశనం అవుతుందన్నట్టు ఉండడంతో ఆ సందర్భాన్ని పురస్కరించుకొని రాంగోపాల్ వర్మ ఈ ట్వీట్ చేసినట్టు అర్థమవుతోంది.
Telugu Desham party is fatally infected with the dangerous micro organism called @naralokesh virus, and one and only vaccine avilable for its cure is @tarak9999 ..My advise to all TDP cadres ..Get smart and Get vaccinated super fast with @tarak9999 or U WILL DIE
— Ram Gopal Varma (@RGVzoomin) April 20, 2021
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Tdp got a virus called nara lokesh rgv
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com