Homeజాతీయ వార్తలుAyodhya Ram Temple: అయోధ్య రామాలయంపై అనుమానాస్పద డ్రోన్‌.. కూల్చివేత.. పోలీసుల అదుపులో నిందితుడు!

Ayodhya Ram Temple: అయోధ్య రామాలయంపై అనుమానాస్పద డ్రోన్‌.. కూల్చివేత.. పోలీసుల అదుపులో నిందితుడు!

Ayodhya Ram Temple: భారత దేశానికే ఒక ఐకానిక్‌గా అయోధ్య రామాలయం నిలిచింది. హిందువుల 500 ఏళ్ల(%00 Years) కలను నెరవేరుస్తూ.. గతేడాది అయోధ్య రామమందిరం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో రామాలయం నిర్మాణం పూర్తి చేసి 2024, జనవరి 22న బాలరాముడికి ప్రాణప్రతిష్ట చేశారు. అయోధ్య రాముడిని దేశం నలు మూలల నుంచి భక్తులు దర్శించుకుంటున్నారు. జనవరి 13 నుంచి మహాకుంభమేళా(Maha kumbhamela) జరుగుతోంది. దీంతో కుంభమేళాకు వెళ్లిన భక్తులంతా అయోధ్యకు వెళ్తున్నారు. దీంతో రామాలయం నెలరోజులుగా కిటకిటలాడుతోంది. ఇదిలా ఉంటే.. అయోధ్య రామాలయం ప్రాంగణంలోకి సోమవారం(ఫిబ్రవరి 17న) ఒక డ్రోన్‌(Drone) వచ్చింది. దీనిని గుర్తించిన భద్రతా అధికారులు అలారం మోగించారు. అనంతరం దానిని కూల్చివేశారు. అకస్మాత్తుగా జరిగిన ఈ ఘటనలో భక్తులు భయాందోళనకు గురయ్యారు. డ్రోన్‌ను యాంటీ డ్రోన్‌ వ్యవస్థ కూల్చేసిందని ఓ అధికారి తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని వెల్లడించారు.

గేట్‌ నంబర్‌ 3 వద్ద ఘటన..
ఏరియా అధికారి అశుతోష్‌ తివారి(Ashitosh thiwari) తెలిపిన వివరాల ప్రకారం.. అయోధ్య రామాలయం మూడో నంబర్‌ గేట్‌ సమీపంలోకి సోమవారం డ్రోన్‌ వచ్చింది. రామ్‌లల్లా దర్శనం తర్వాత భక్తులు ఈ గేటు నుంచే బయటకు వస్తారు. సాయంత్రం సమయంలో డ్రోన్‌ రావడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. వెంటనే భద్రతా అలారం మోగించారు. అనంతరం డ్రోన్‌ను కూల్చివేశారు.

పోలీసుల అదుపులో నిందితుడు..
ఈ ఘటనపై రామజన్మభూమి పోలీస్‌ స్టేషన్‌ ఎస్సై సునీల్‌కుమార్‌(Sunil Kumar)కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనుమానిత వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీరామ జన్మభూమి ప్రాంగణంలోకి డ్యూటీ పాయింట్‌ బ్యాచింగ్‌ ప్లాంట్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి ఉద్దేశపూర్వకంగానే డ్రోన్‌ ఎగరవేసినట్లు గుర్తించారు. అయితే కుంభమేళా భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆ దృశ్యాలను చిత్రీకరించేందకు డ్రోన్‌ కెమెరా వదిలినిట్లు తెలుస్తోంది.

యాంటీ డ్రోన్‌ వ్యవస్థ..
ఇదిలా ఉంటే.. అయోధ్య రామమందిరం ఉపరి తలాన్ని నో ఫ్లై జోన్‌(No Fly zone)గా ప్రకటించారు. ఆలయం పైనుంచి అనుమతి లేకుండా ఎలాంటి వాటిని అనుమతించరు. చివరకు విమానాలు, హెలిక్యాప్టర్లు కూడా ఎగిరేందుకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే అక్కడ యాంటీ డ్రోన్‌(Anti Drone)వ్యవస్థను కూడా భద్రతా సిబ్బంది ఏర్పాటు చేశారు. ఇది రెండున్నర కిలోమీటర్ల పరిదిలో ఎగురుతున్న డ్రోన్లపైనా నిఘా ఉంచుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Karakatta Kamal Haasan : ఆ కరకట్ట కమల్ హాసన్ ఏం చేస్తున్నారో తెలుసా..

Karakatta Kamal Haasan : 2014లో ఏపీ రాష్ట్రంలో టిడిపి అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రజా వేదికను నిర్మించారు. ఆ నిర్మాణం అక్రమం అంటూ...
OG 2 Animation Video

OG 2 Animation Video: ‘ఓజీ 2’ నుండి యానిమేషన్ వీడియో.. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కి ఊహించని...

OG 2 Animation Video: ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో మంచి హైప్ ని క్రియేట్ చేసుకున్న సీక్వెల్స్ లో ఒకటి 'ఓజీ 2'. పవన్ కళ్యాణ్ , సుజిత్ కాంబినేషన్...
KCR And Revanth Reddy

Revanth Reddy And Kcr: వాసాలమర్రి.. కెసిఆర్ వీక్నెస్ తో ఆడుకుంటున్న రేవంత్..

Revanth Reddy And Kcr: భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు.. కెసిఆర్ ఉన్నట్టుండి యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించారు. ఆ జిల్లా పరిధిలో ఉన్న వాసాల మర్రి గ్రామంలో ఒకరోజు మొత్తం...
Siddharth Emotional

Siddharth Emotional: స్టేజి పై వెక్కిళ్లు పెట్టి ఏడ్చేసిన హీరో సిద్దార్థ్..వీడియో వైరల్..అసలు ఏమైందంటే!

Siddharth Emotional: ఒకప్పుడు యూత్ ఆడియన్స్ లో హీరో సిద్దార్థ్ కి ఎలాంటి క్రేజ్ ఉండేదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆరోజుల్లో బాయ్స్, నువ్వొస్తానంటే నేనొద్దంటానా , బొమ్మరిల్లు , కొంచెం ఇష్టం...
Google Employees Protest

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...
Oktelugu Epaper