Sunflower Seeds: మనిషి శరీరంలో గుండె అత్యంత కీలకమైన అవయవం. గుండె ద్వారానే దేహం మొత్తం రక్తప్రసరణ జరుగుతుంది. గుండె ఒక్క క్షణం పనిచేయడం ఆగిపోతే దేహం కుప్ప కూలిపోతుంది. అందువల్లే గుండెను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.
ఇటీవల కాలంలో గుండెపోటు మరణాలు విపరీతంగా చోటుచేసుకుంటున్నాయి. వయసు సంబంధం లేకుండా గుండెపోట్లు వస్తున్నాయి. ఆహార శైలి.. జీవన విధానం.. కాలుష్యం.. మానసిక ఒత్తిడి.. ఇతర సమస్యలు గుండె పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత గుండెపోటు మరణాలు విపరీతంగా పెరిగిపోయాయి. అప్పట్లో కరోనా సమయంలో చాలామంది ఇంజక్షన్లు వేసుకున్నారు. వాటి వల్ల గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయని జనాలలో అపోహ ఉంది. అయితే అది నిజం కాదని వైద్యులు చెబుతున్నారు.
మన గుండె ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. గుండెను సంపూర్ణంగా ఉంచుకోవాలి అంటే మన ఆహార శైలి.. మన జీవనశైలి మెరుగ్గా ఉండాలి. అది జరగాలంటే కచ్చితంగా ఆహారాన్ని తీసుకోవాలి. గుండెకు మేలు చేసే గింజలలో వద్దు తిరుగుడు గింజలు ముందు వరుసలో ఉంటాయి. వీటిని ప్రతిరోజు గుప్పెడు తీసుకోవాలి. కాకపోతే తీసుకునే ముందు రాత్రి వీటిని నాన పెట్టాలి. అలా అయితేనే జీర్ణం అవుతాయి. ఇందులో గుడ్ ఫ్యాట్.. మెగ్నీషియం వంటివి గుండె ఆరోగ్యానికి అత్యంత మేలు చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు.. ఫ్రీ రాడికల్స్ దాడి నుంచి రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉన్న జింక్ తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి ఉపయోగపడుతుంది. శరీరంలో అంతర్గత వాపులు.. కీళ్ల నొప్పులను పొద్దుతిరుగు గింజలు తగిస్తాయి.
వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఫైబర్ పెరుగుతూ ఉంటుంది. అది జీర్ణక్రియను మెరుగు పరుస్తూ ఉంటుంది. తద్వారా జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు. అంత కాదు ఇందులో శరీరానికి మేలు చేసే కొవ్వులు ఉండడంవల్ల.. జీర్ణ క్రియ రేటు బాగుంటుంది. శరీరంలో హైడెన్సిటీ లైపో ప్రోటీన్ మెరుగ్గా ఉంటుంది. తద్వారా గుండెపోట్ల వంటివి రాకుండా ఉండడానికి ఇది తోడ్పడుతూ ఉంటుంది. అదే కాదు లో డెన్సిటీ లైపో ప్రోటీన్ ను నియంత్రణలో ఉంచుతుంది. తద్వారా గుండె పనితీరు మెరుగ్గా ఉంటుంది.
ఈ కథనం వివిధ వేదికల ద్వారా లభించిన సమాచారం ఆధారంగా రూపొందించారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో వైద్యుల చికిత్సకు ప్రత్యామ్యాయం కాదు అని పాఠకులు గుర్తించాలి. మీకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే ముందుగా వైద్యులను సంప్రదించాలి. వారు సూచించిన మందులను.. ఆహారపు అలవాట్లను పాటించాలని విన్నవిస్తున్నాం.