Vivo V50 Launch
Vivo V50 Launch : ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో.. తాజాగా తన కొత్త మోడల్ వివో వీ50ని భారతదేశంలో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ప్రత్యేకమైన ఫీచర్లు, మోడరన్ డిజైన్‌తో స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో అమ్మకాల్లో సరికొత్త రికార్డు నమోదు చేస్తుందని భావిస్తున్నారు. వివో వీ50 భారతదేశంలో మూడు మెమొరీ వేరియంట్లలో లాంచ్ అయింది. వాటి ధరలకు సంబంధించిన వివరాలను చూస్తే.. 8GB RAM + 128GB Storage వేరియంట్ ధర రూ.34,999, 8GB RAM + 256GB Storage వేరియంట్ ధర రూ.36,999, 12GB RAM + 512GB Storage వేరియంట్ ధర రూ.40,999లుగా కంపెనీ నిర్వహించింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 25, 2025 నుంచి ఇది కస్టమర్లకు అందుబాటులో ఉంటుందని కంపెనీ పేర్కొంది.
కలర్ ఆప్షన్స్
ఈ ఫోన్ రోజ్ రెడ్, టైటానియం గ్రే, స్టార్రీ నైట్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే, ఈ ఫోన్ కొనుగోలుకు జీరో డౌన్ పేమెంట్, ఎక్స్ఛేంజ్ బోనస్ వంటి ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ఆప్టికల్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సేఫ్టీని అందజేస్తుంది.
ఫీచర్లు, స్పెసిఫికేషన్స్
డిస్‌ప్లే: 6.77 అంగుళాల స్లిమ్ క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, 2392×1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 4500 నిట్ పీక్ బ్రైట్‌నెస్.
బ్యాటరీ: 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్.
కెమెరా: ఫోటోగ్రఫీ ఇష్టపడే వారికోసం బ్యాక్ 50MP OIS కెమెరా, 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా,సెల్ఫీల కోసం 50MP AF సెన్సార్ ను అందజేస్తుంది.
సోఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఫన్ టచ్ OS 15, 3 ఏళ్ల ఆండ్రాయిడ్ అప్డేట్‌లు, 4 ఏళ్ల సెక్యూరిటీ అప్డేట్‌లు.
ప్రాసెసర్: క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3.
ఏఐ ఫీచర్లు:
సర్కిల్ టు సెర్చ్, వివో లైవ్ కాల్ ట్రాన్స్లేషన్, ఏఐ ట్రాన్స్క్రిప్ట్ వంటి ఆధునిక ఏఐ ఫీచర్లను సపోర్ట్ చేస్తుంది. ఈ కొత్త వివో వీ50 ఫోన్, పవర్ ఫుల్ కెమెరా, డ్యూరబుల్ బ్యాటరీ, స్లిమ్ డిజైన్, ఆధునిక టెక్నాలజీతో మార్కెట్లో మంచి స్థానం సంపాదించుకుంటుందనడంలో సందేహం లేదు. స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో దీని పర్ఫామెన్స్ కూడా అద్భుతంగా ఉంటుంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Vivo v50 launch vivo has launched a new phone
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com