Homeజాతీయ వార్తలుAyodhya: అయోధ్యలో వార్షికోత్సవ సంబురం.. ముందే ఎందుకంటే..!

Ayodhya: అయోధ్యలో వార్షికోత్సవ సంబురం.. ముందే ఎందుకంటే..!

Ayodhya: అయోధ్యలో రామయ్య కొలువుదీరి ఏడాది గడిచింది. భారతీయుల 500 ఏళ్ల కలను ప్రధాని నరేంద్రమోదీ సాకారం చేశారు. ఏళ్లుగా కోర్టులోనే నానుతున్న కేసును పరిష్కరించడమే కాకుండా.. ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2024, జనవరి 22న ఆలయంలో రామల్‌ లల్లా(Ram lalla)కు ప్రాణప్రతిష్ట చేశారు. అప్పుడే ఏడాది గడిచింది. ఈ సందర్భంగా అయోధ్య వార్షికోత్సవానికి ముస్తాబైంది. మూడు రోజులపాటు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi)ఎక్స్‌లో దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మికతకు గొప్ప వారసత్వంగా ఆలయం నిలుస్తుందని పేర్కొన్నారు. శతాబ్ధాల త్యాగాలు, పోరాటాల ద్వారా ఆలయాన్ని నిర్మించినట్లు పేర్కొన్నారు. ఈ దివ్య, భవ్య అయోధ్య రామాలయం దేశ ప్రజలకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు.

ముందే ఎందుకంటే..
హిందూ క్యాలెండర్‌ ప్రకారం గతేడాది అంటే 2024లో పుష్యమాస శుక్ల పక్ష ద్వాదశి జనవరి 22న వచ్చింది. ఆరోజే రామ్‌లల్లాకు ప్రాణప్రతిష్ట చేశారు. అదే ముహూర్తం ఈ ఏడాది జనవరి 11న వచ్చింది. ఈ కారణంగా హిందూ క్యాలెండర్‌ను అనుసరించి అయోధ్యలో నూతన రామాలయ మొదటి వార్షికోత్సవాలు(Annivarsary)ప్రారంభించారు. మందిర ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈవేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు 110 మందికిపైగా వీఐపీలు హాజరు కానున్నారు. తొలిరోజు(శనివారం)యూపీ సీఎం యోగీ ఆదిత్య నాథ్‌ రామ్‌లల్లాకు స్వయంగా అభిషేకం చేయనున్నారు. అనంతరం ఆయన భక్తులను ఉద్దేశించి మాట్లాడతారు.

భారీగా ఏర్పాట్లు..
ఆలయ వార్షికోత్సవం సందర్భంగా రామ మందిరం ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అంగద్‌ తిలా స్థలంలో ఒక భారీ టెంట్‌ ఏర్పాటు చేశారు. దీనిలో 5 వేల మందిఇకపైగా భక్తులు కూర్చునే అవకాశం ఉంది. అలాగే పెవిలియన్‌తోపాటు యాగశాలలో శాస్త్రీలయ, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. రామకథ గానం కూడా నిర్వహిస్తున్నారు. గతేడాది ప్రారంభోత్సవానికి రాలేకపోయిన వారికి ఈసారి ట్రస్టు ప్రత్యేక ఆహ్వానాలు పంపింది. 110 మంది వీఐపీలతోపాటు పలువురు అతిథులకు ఆహ్వానం పంపినట్లు ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్‌(Champath Rai) తెలిపారు. జనవరి 11, 12, 13 తేదీల్లో ఉత్సవాలు జరుగుతాయని ట్రస్టు వెల్లడించింది. ఈ కార్యక్రమాలకు మండలం, యాగశాల ప్రధాన వేదికగా నిలిచాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular