Instagram Memorialized Account: నేటి కాలంలో సోషల్ మీడియా అకౌంట్లు లేని వాళ్లను చేతివేళ్ల మీద లెక్కపెట్టవచ్చు. ముఖ్యంగా ఈ తరానికి కనెక్ట్ అయ్యే ఇన్ స్టా గ్రామ్ ను దాదాపు అందరూ వాడుతుంటారు. అందులో ఫోటోలు.. వీడియోలు.. రీల్స్.. ఇంకా అదనపు ఫీచర్లు ఉంటాయి. అందువల్ల చాలా మందికి ఆ యాప్ అంటే విపరీతమైన ఇష్టం.
మొదట్లో ఫేస్బుక్ చుట్టు ప్రపంచం జరిగింది. ఇప్పుడు క్రమేపి ఆ స్థానాన్ని ఇన్ స్టా ఆక్రమిస్తున్నది. ఇన్ స్టా లో కంటెంట్ క్రియేటర్లకు డబ్బులే డబ్బులు. ఫాలోవర్ల ఆధారంగా డబ్బులు లభిస్తుంటాయి. ఒకవేళ వీడియోలు.. ఇతర కంటెంట్ కనుక సృష్టించగలిగితే తిరుగు ఉండదు. అందువల్లే ఈ జనరేషన్ మాత్రమే కాదు.. ఓల్డ్ జనరేషన్ కూడా ఇన్ స్టా గ్రామ్ ను విపరీతంగా ఇష్టపడుతున్నారు.
ఇన్ స్టా గ్రామ్ ను వాడుతున్నంతసేపు బాగానే ఉంటుంది. అందులో ఉన్న ఫీచర్లను అనుకూలంగా మార్చుకొని కంటెంట్ సృష్టిస్తుంటే కొత్తగా అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ యూసర్ ఆకస్మాత్తుగా చనిపోతే అప్పుడు ఇన్ స్టా అకౌంట్ ఏమవుతుంది.. ఆటోమెటిగ్గా డిలీట్ అవుతుందా.. లేదా దానిని వాడుకోవచ్చా.. దీనిపై టెక్నాలజీ నిపుణులు క్లారిటీ ఇచ్చారు.
మన సామాజిక మాధ్యమ ఖాతాలు ఎప్పటికీ అలానే ఉండవు అనుకుంటే పొరపాటే. ఒకవేళ మన చనిపోతే ఇన్ స్టా గ్రామ్ ఖాతాను కుటుంబ సభ్యులు లేదా స్నేహితులు నిర్వహించుకోవచ్చు. ఇందులో మెమోరియలైజేషన్ అనే ఫీచర్ ఉంది అయితే ఈ విషయం చాలామందికి తెలియదు. మరణ ధ్రువీకరణ పత్రం సమర్పిస్తే.. కచ్చితంగా ఆ ప్రొఫైల్ శాశ్వతంగా తొలగించవచ్చు. ఒకవేళ ఖాతాను జ్ఞాపకంలాగా భద్రపరచుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ లో మెమో రియలైజేషన్ ఆప్షన్ లో లెగసి అనే కాంటాక్ట్ కచ్చితంగా సెలెక్ట్ చేయాలి.. అప్పుడే చనిపోయిన తర్వాత కూడా ఖాతాను కొనసాగించవచ్చు.. లేదా జ్ఞాపకంలాగా ఉంచుకోవచ్చు.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత చాలామంది తమ వృత్తి గత.. వ్యక్తిగత.. ఇతర విషయాలను అందులో పోస్ట్ చేస్తున్నారు. తద్వారా మరణించినప్పటికీ వాటిని అయినవాళ్లు.. దగ్గరి బంధువులు.. స్నేహితులు చూస్తున్నారు. వారి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో ఫోటోలు.. వీడియోలు గతించిన వారిని సజీవంగా నిలుపుతున్నాయి. ఒకప్పుడు ఇటువంటి సదుపాయాలు అందుబాటులో లేవు కాబట్టి.. చాలామంది మరణించిన వారిని తలచుకుంటూ ఏడ్చేవారు. ఇప్పుడు సోషల్ మీడియా మనుషులు లేని లోటును కొంతలో కొంత భర్తీ చేస్తోంది.