UV Creations: ఇండస్ట్రీ లో పెద్ద నిర్మాణ సంస్థల లిస్ట్ తీస్తే మనకు ప్రధానంగా వినిపించే నాలుగు పేర్లలో ఒకటి ‘యూవీ క్రియేషన్స్’. ప్రభాస్ అన్నయ్య ప్రభోద్ తో పాటు , ప్రభాస్ స్నేహితులు కలిసి ఈ సంస్థ ని ప్రారంభించారు. ‘మిర్చి’ సినిమాతో వీళ్ళ ప్రొడక్షన్ మొదలైంది. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అనేది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమా తర్వాత వీళ్ళు నిర్మించిన భలే భలే మొగాడివోయ్ , భాగమతి, ఎక్స్ ప్రెస్ రాజా , రన్ రాజా రన్, మహానుభావుడు వంటి చిత్రాలు కమర్షియల్ గా పెద్ద హిట్స్ గా నిలిచాయి , భారీ లాభాలను తెచ్చిపెట్టాయి. కానీ తర్వాతే మొదలయ్యాయి అసలు సిసలు కష్టాలు. భారీ బడ్జెట్ తో ప్రభాస్ తో ‘సాహూ ‘, ‘రాధే శ్యామ్’ వంటి చిత్రాలు నిర్మించారు.
ఈ రెండు సినిమాలు కమర్షియల్ గా ఎంత పెద్ద డిజాస్టర్స్ గా నిలిచాయో అందరికీ తెలిసిందే. వీటితో పాటు ‘ఆదిపురుష్’ చిత్రాన్ని తెలుగు వెర్షన్ కొనుగోలు చేసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇది కూడా పెద్ద ఫ్లాప్ అయ్యింది. దీంతో యూవీ క్రియేషన్స్ సంస్థ పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. బయ్యర్స్ కి కొన్ని కోట్ల రూపాయిల అప్పు ని మిగిలించారు. రీసెంట్ గా ఈ సంస్థ నుండి నాలుగు సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అవి ఓం భీం బుష్, కపుల్ ఫ్రెండ్లీ , బైకర్, కొరియన్ కనకరాజు. రీసెంట్ గా విడుదలైన ‘కొరియన్ కనకరాజు’ చిత్రం అయితే కేవలం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ మార్కుని సంపాదించి క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచినప్పటికీ ఈ సంస్థ కి ఒక్క పైసా లాభం కూడా రాలేదట.
వచ్చిన డబ్బులు మొత్తం బయ్యర్స్ పాత బకాయిల్లో జమ చేసుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. ఇంకా భారీ స్థాయిలో అప్పులు ఉన్నాయట. వీళ్ళు నిర్మించిన ‘విశ్వంభర’ కమర్షియల్ గా పెద్ద బ్లాక్ బస్టర్ అయితేనే యూవీ క్రియేషన్స్ కష్టాలు తీరుతాయి. భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం VFX వర్క్ కోసం ఇన్ని రోజులు విడుదలని ఆపారు. మొదట్లో ఈ సినిమా పై అంచనాలు భారీ రేంజ్ లోనే ఉండేవి, కానీ విడుదల బాగా ఆలస్యం అవ్వడం తో ఇప్పుడు బాగా తగ్గాయి. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదల తేదీని మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22 న ప్రకటిస్తారట. అక్టోబర్ 16 న ఈ చిత్రాన్ని విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు సమాచారం.