Bigg Boss Telugu 10: సోషల్ మీడియా లో ‘బిగ్ బాస్ 10’ అప్డేట్స్ సందడి మొదలైంది. ఎక్కడ చూసినా ఈ రియాలిటీ షో కి సంబంధించిన వార్తలే కనిపిస్తున్నాయి. బిగ్ బాస్ టీం ఒక పక్క ‘అగ్నిపరీక్ష 2’ షో ద్వారా సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలు పెట్టగా, మరోపక్క సెలబ్రిటీ కంటెస్టెంట్స్ ని ఎంపిక చేసే ప్రక్రియ లో ఫుల్ బిజీ గా గడుపుతోంది. ఇప్పటికే సెలబ్రిటీల క్యాటగిరీలో ఆటో రామ్ ప్రసాద్ , ఆదిత్య మీనన్ , జబర్దస్త్ పొట్టి నరేష్ ఖరారు అయినట్టు మనమంతా విన్నాము. ఇప్పుడు తాజా కొంతమంది క్రేజీ బుల్లితెర హీరోయిన్స్ ని బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు తెలుస్తోంది. ఆ హీరోయిన్స్ జాబితా ని ఇప్పుడు మనం చూడబోతున్నాము.
పల్లవి గౌడ :
ఈమె బుల్లితెర లో అనేక సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించింది. ఈమెకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. రీసెంట్ గానే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో లో కుక్ గా ఈమెని మనమంతా చూశాము. టాప్ 6 కంటెస్టెంట్ గా నిల్చింది. ఈమెని బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఆమెకు కూడా ఈ షో లో పాల్గొనేందుకు ఆసక్తికాగానే ఉందట. ఈమె హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు 99 శాతం వరకు ఉన్నాయి.
ఆషికా పడుకొనే:
కథలో రాజకుమారి , త్రినయని వంటి సెన్సేషనల్ సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన ఆషికా కి కూడా మంచి క్రేజ్ ఉంది. ఈమె కూడా ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ లో కుక్ గా వ్యవహరించి టాప్ 4 స్థానం లో నిల్చింది. ఈమెని కూడా బిగ్ బాస్ టీం సంప్రదించారట. ఈమె కూడా 99 శాతం బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టే అవకాశాలు ఉన్నాయి , త్వరలోనే అగ్రిమెంట్ మీద కూడా సంతకం చేయబోతుంది అట.
రక్షా గౌడ :
‘గుప్పెడంత మనసు’, ‘చిన్ని ‘ వంటి సూపర్ హిట్ సీరియల్స్ తో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న రక్షా గౌడ కూడా బిగ్ బాస్ 10 లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఈమెని కూడా మేకర్స్ సంప్రదించారని , రెమ్యూనరేషన్ విషయం లో ప్రస్తుతం చర్చలు నడుస్తోందని అంటున్నారు.
కావ్య :
ఎన్నో సూపర్ హిట్ సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన కావ్య కి ఎలాంటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ‘బిగ్ బాస్ 8’ టైటిల్ విన్నర్ నిఖిల్ కి ఈమె మాజీ ప్రేయసి. సోషల్ మీడియా లో కూడా మంచి క్రేజ్ ఉంది. ఈమెని కూడా గత రెండు మూడు సీజన్స్ నుండి బిగ్ బాస్ టీం వాళ్ళు అడుగుతున్నారు కానీ , ఈ సీజన్ లో మాత్రం ఆమె కంటెస్టెంట్ గా పాల్గొనేందుకు సుముఖత చూపిస్తున్నట్టు తెలుస్తోంది. ఆమె అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా టీమ్ రెడీ గా ఉందట.
సంధ్య :
అనే టీవీ సీరియల్స్ లో హీరోయిన్ గా , రియాలిటీ షోస్ లో కంటెస్టెంట్ గా ఈమె సుపరిచితమే. రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో ప్రసారమైన ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అథర్’ షో లో కూడా ఈమె పాల్గొన్నది. ఈమె హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశాలు 90 శాతం వరకు ఉన్నాయట.
యాంకర్ వర్షిణి :
ఈమెని సీజన్ 5 నుండి అడుగుతూనే ఉన్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె రిజెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ సీజన్ కి కూడా ఆమెని సంప్రదించారట. ఆమె కాదు అనలేని రెమ్యూనరేషన్ ఆఫర్ ని ఇచ్చారట. ఆమె కూడా ఓకే చెప్పిందని , అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసిందని టాక్. టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోని అందంతో ఉండే వర్షిణి కి మంచి క్రేజ్ ఉంది.