Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్‌తో పాక్‌పై విరుచుకుపడింది. బుధవారం అర్థరాత్రి సమయంలో పాకిస్థాన్, పాక్ అక్రమిత కాశ్మీర్‌లోని మొత్తం తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో మొత్తం 90 మంది ఉగ్రవాదులు చనిపోయినట్లు తెలుస్తోంది. భారత త్రివిధ దళాలు వైమానిక దాడులను చేపట్టిన 25 నిమిషాల్లోనే పూర్తి చేశాయి. ప్రతీకారంగా అర్థరాత్రి సమయంలో దేశం నిద్రపోతున్న సమయంలో పాక్‌పై భారత్ విరుచుకుపడింది. దీనికి ప్రతీకారంగా దాయాది దేశం సరిహద్దు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలపై దాడి మిసైల్లు, డ్రోన్లు, ఫైటర్ జెట్లతో విరుచుకుపడింది. వీటిని కూడా భారత్ తిప్పికొట్టింది. రావల్పిండిలో భారత్ డ్రోన్లుతో పాక్‌పై విరుచుకుపడుతోంది. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. రావల్పిండిని పూర్తిగా భారత్ నాశనం చేసింది. దీంతో మళ్లీ బ్లాక్ డే అవుతుంది ఏమోనని పాక్ ప్రజలు భయపడుతున్నారు. సరిగ్గా ఇదే రోజున రెండేళ్ల కిందట పాక్‌కు బ్లాక్ డే ఏర్పడింది. దీనివల్ల పాక్ తీవ్రంగా నష్టపోయింది. మళ్లీ నేడు కూడా బ్లాక్ డేగా మారుతుంది ఏమోనని పాక్ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. అసలు గతంలో ఎప్పుడు బ్లాక్ డే అయ్యింది? ఎందుకు? పూర్తి వివరాలు కూడా ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Also Read: దాయాది క్షిపణులు ఔట్.. S-400 సిస్టమ్ ప్రత్యేకతలేంటి?
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రెండేళ్ల కిందట అరెస్ట్ అయ్యారు. దీంతో 2023 మే 9న పాక్‌లో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పాక్‌లో ఏర్పడిన హింస వల్ల కోట్ల రూపాయల నష్టం ఏర్పడింది. సైనిక భవనాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలు నేలమట్టం అయ్యాయి. ఇస్లామాబాద్, కరాచీ, రావల్పిండి వంటి ప్రధాన నగరాల్లో భారీగా నష్టం జరిగింది. రావల్పిండిలోని ఆర్మీ కార్ప్స్ కమాండర్ నివాసం, జనరల్ హెడ్ క్వార్టర్స్, పాకిస్తాన్ వైమానిక దళాలపై లక్ష్యంగా దాడులు జరిగాయి. దీనివల్ల పాకిస్థాన్‌కు దాదాపుగా రెండు బిలియన్ల పాకిస్తానీ రూపాయల నష్టం ఏర్పడింది. ఇప్పుడు భారత్ పాక్‌పై విరుచుకుపడటంతో మళ్లీ ఇదే సీన్ రిపీట్ అవుతుందని పాక్ ప్రజలతో పాటు అధికారులు కూడా వణికిపోతున్నారు. మే 9వ తేదీ మరో బ్లాక్ డేగా మారబోతుందని భయపడుతున్నారు. పాక్ కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధానికి సై అన్నట్లుగా ప్రవర్తిస్తోంది. శాంతితో కాకుండా యుద్ధానికి పాల్పడుతోంది.
ఆపరేషన్ సిందూర్‌కి ప్రతీకారంగా పాక్ మళ్లీ భారత్‌పై దాడికి పాల్పడింది. గురువారం జమ్మూకశ్మీర్ ఎయిర్‌పోర్టుపై దాడులు చేసింది. అలాగే సరిహద్దు ప్రాంతాల్లో కూడా పాక్ దాడులకు పాల్పడింది. వీటిన్నింటిని కూడా భారత సైన్యం తిప్పికొట్టింది. భారత దేశంపై డ్రోన్లతో విరుచుకుపడటంతో ఇండియన్ ఆర్మీ వాటిని కుప్ప కూల్చింది. ఈ క్రమంలో పాక్ మరో బ్లాక్ డే అవుతుందని భయంతో ఉంటోంది.