Prabhas Fauji: ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమాకి సంబంధించిన ఏ ఒక్క టీజర్ ని రిలీజ్ చెయ్యలేదు. డిసెంబర్ మూడోవ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందంటూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేసి సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి డిఫరెంట్ గా కనిపిస్తాడు అంటూ మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు. హను రాఘవపూడి లాంటి దర్శకుడు సైతం ఇంతకుముందు ‘సీతారామం’ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. కాబట్టి ఆయన నుంచి వస్తున్న సినిమా కావడం వల్ల ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఆయన ఈ సినిమాని పర్ఫెక్ట్ గా స్క్రీన్ మీద ప్రజెంట్ చేశాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ గాని, పోస్ట్ ప్రొడక్షన్ గాని లేట్ అవ్వడానికి గల కారణం ఏంటి? ఈ సినిమా మీద అనుకున్న బడ్జెట్ కంటే ఎక్కువ బడ్జెట్ పెట్టారా? లేదంటే కొన్ని సన్నివేశాలు పెర్ఫెక్ట్ గా రాకపోవడంతో రీ షూట్స్ ఏమైనా చేస్తున్నారా అనే ధోరణిలో కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
నిజానికి ప్రభాస్ ఈ సినిమా మీద చాలా వరకు డేట్స్ అయితే కేటాయించాడు. స్పిరిట్ సినిమాను పక్కనపెట్టి మరి ఫౌజీ సినిమాకి డేట్స్ ఇచ్చాడు అంటే ఈ సినిమా మీద తను ఎంత ఇంట్రెస్ట్ చూపించాడో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి క్రమంలోనే డైరెక్టర్ ఎందుకని ప్రభాస్ ఇచ్చిన డేట్స్ ని పూర్తిగా వాడుకోలేదు.
తద్వారా మరోసారి కొన్ని సీన్స్ ను రీషూట్ చేశారా అనేది పెర్ఫెక్ట్ గా తెలియదు. మొత్తానికైతే సినిమా బాగా వచ్చిందని చెబుతున్నప్పటికి సినిమా నుంచి టీజర్ రిలీజ్ అయితే గాని సినిమా బ్యాక్ డ్రాప్ ఏంటి ఎలాంటి కంటెంట్ తెరకెక్కుతుంది. ప్రభాస్ ఏ రేంజ్ లో కనిపించబోతున్నాడు అనే దాని మీద ఒక క్లారిటీ అయితే రాదు…