Revanth Reddy Diet: సన్నగా ఉంటాడు. యువకుడి లాగా కనిపిస్తాడు. మైదానంలో ఫుట్ బాల్ అద్భుతంగా ఆడతాడు. గట్టిగా మాట్లాడుతాడు. 20 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాడో.. ఇప్పుడు కూడా అలానే ఉన్నాడు.
ఆయనకు భార్య.. ఒక కూతురు. కూతురికి వివాహం జరిగింది.. ఒక కుమారుడు కూడా ఉన్నాడు. తాతయ్య అయినప్పటికీ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకుడి లాగే కనిపిస్తున్నాడు. అతడు ఇలా ఉండడానికి.. 50 సంవత్సరాలు పైబడిన వయసులో కూడా ఎంత ఉత్సాహంగా ఉండడానికి కారణం ఏంటి.. అతను ఏం తింటారు.. ఎలాంటి డైట్ ఫాలో అవుతుంటారు.. ఎలాంటి మెనూ కొనసాగిస్తారు..
ఆమధ్య ఓ మీటింగ్లో జొన్న రొట్టె గురించి.. బుడంకాయ పప్పు గురించి రేవంత్ రెడ్డి చాలా అందంగా చెప్పారు. ఆయన చెబుతుంటే నోట్లో లాలాజలం అలా ఊరిపోయింది.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో జొన్నలు బాగా పండుతాయి. కందులు, బుడంకాయలు కూడా విస్తారంగా లభిస్తాయి. అందువల్లే అక్కడి ప్రజలు ఎక్కువగా పప్పు బుడంకాయ్ తింటుంటారు. అందులోకి జొన్న రొట్టెలు కచ్చితంగా ఉండాలి.
తినే తిండి విషయంలో రేవంత్ చాలా జాగ్రత్తగా ఉంటారు. మటన్ ఎక్కువగా ముట్టుకోరు. నాన్ వెజ్ ప్రియుడు అయినప్పటికీ.. ఎక్కువగా జొన్న రొట్టెలు మాత్రమే తింటారు. అన్నం కూడా కడుపునిండా తింటారు. లెక్కలు వేసుకోరు గాని.. ఎంత ఆకలైతే అంత మాత్రమే తింటారు. అంతకుమించి అడ్డగోలుగా తినరు. రేవంత్ రెడ్డి బుడంకాయ పప్పు తో పాటు.. చికెన్ తింటుంటారు.
తను ప్రతిరోజు ఏం తింటానో.. ఎలాంటి ఆహారం ఇష్టపడతానో.. ఎటువంటి తిండి తింటే తనకు ఇష్టమో రేవంత్ రెడ్డి చెప్పారు. ప్రతిరోజు ఆయన ఖచ్చితంగా చికెన్ తింటారు. చికెన్ లోను నాటుకోడి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఇదే విషయాన్ని ఆయన ప్రకటించారు. వారంలో ఏడు రోజులు.. అందులో 24 గంటలు చికెన్ తినడానికి ఇష్టపడతానని రేవంత్ రెడ్డి చెప్పడంతో ఆ సమావేశానికి హాజరైన అధికారులు మొత్తం నవ్వుకున్నారు.. వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం రెడ్ మీట్ కంటే కూడా చికెన్ చాలా మంచిది. ఎందుకంటే అది తిన్న తర్వాత అరగడానికి కొద్దిగా గంటల సమయం పడుతుంది. కానీ మటన్ అలా కాదు.. అందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది.. అరగడానికి చాలా సమయం పడుతుంది. మటన్ ను మితంగా తీసుకోవాలని వైద్యలు సూచిస్తుంటారు.