AC Tips : ఎండాకాలం వేడి నుండి తప్పించుకోవడానికి ప్రజలు ఏసీని అయితే ఆన్ చేస్తారు.. అదే సమయంలో కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. దాని వల్ల ఏసీ పాడైపోయే ప్రమాదం ఉంది. కొందరు అయితే గంటా రెండు గంటలు బయటకు వెళ్లినా ఏసీని ఆపరు. ఎందుకంటే తిరిగి వచ్చేసరికి గది చల్లగా ఉంటుందని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు కావచ్చు. అసలు ఏసీని ఎంత సేపు నడిపిన తర్వాత ఆపేయాలో తెలుసా. ఏసీని అనవసరంగా గంటల తరబడి నడిపించడం ప్రమాదకరం కావచ్చు. ఏదైనా పరికరాన్ని ఎక్కువసేపు ఉపయోగిస్తే అది వేడెక్కుతుంది. ఏసీ విషయంలో కూడా అంతే.
Also Read : వేసవిలో మీ ఏసీని కొత్తగా ఉంచే సీక్రెట్ ఇదే!
ఏసీని ఎంత సేపు నడపాలి?
క్రోమా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. ఏసీని ఎంత సేపు నడపాలనేది మీ గది సైజ్, మీ ఏసీ ఎన్ని టన్నులదనే దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు చిన్న గదిలో 1 టన్ను ఏసీని పెడితే, 8 నుండి 10 గంటల వరకు హాయిగా నడపవచ్చు. అదే మీ గది పెద్దగా ఉండి, 1.5 లేదా 2 టన్నుల ఏసీని పెడితే, మీరు 12 గంటల వరకు కూడా ఏసీని నడపవచ్చు. కానీ ఆ తర్వాత మీరు మీ ఏసీని ఆపేయాలి.
గంటల తరబడి నడుస్తున్న ఏసీ వేడెక్కడం మొదలవుతుంది. అందువల్ల ఎయిర్ కండీషనర్‌కు కూడా విశ్రాంతి, చల్లబడటానికి సమయం ఇవ్వాలి. మీరు ఏసీని చల్లబరచడానికి సమయం ఇవ్వకపోతే, అది వేడెక్కడం మొదలవుతుంది. తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలుసు కదా? వేడెక్కడం వల్ల కంప్రెసర్‌లో మంటలు వచ్చే ప్రమాదం ఉంది. దీని వల్ల ఎయిర్ కండీషనర్‌కు మాత్రమే కాదు, మీకు కూడా గాయాలు కావచ్చు.
Also Read : తక్కువ ధరలో.. ఎక్కువ ఫీచర్లతో దుమ్ములేపనున్న ఇన్ఫినిక్స్ నయా ఫోన్!