Nani Paradise Update: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్త పుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇలాంటి క్రమంలోనే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా బాట పడుతుండడం విశేషం…టైర్ వన్ హీరోలు ఇప్పటికే పాన్ ఇండియాలో పెను సంచలనాన్ని క్రియేట్ చేస్తుంటే యంగ్ హీరోలు వాళ్ళు చేసే సినిమాలతో వందల కోట్లు కొల్లగొట్టడానికి సిద్ధమవుతున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే మీడియం రేంజ్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న నాని సైతం ప్రస్తుతం ప్యారడైజ్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. కానీ ఈనెల 6వ తేదీన ఈ సినిమా నుంచి ఒక టీజర్ రాబోతుంది. ఆ టీజర్ పవర్ఫుల్ ఇంపాక్ట్ ఇవ్వబోతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఈ టీజర్ తో ప్యారడైజ్ సినిమా మీద బజ్ అమాంతం తారా స్థాయికి వెళ్ళిపోతుందా?
లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో నాని వెంటే ఉంటూ ఒక వ్యక్తి అతనికి వెన్నుపోటు పొడుస్తాడట. ఇంతకీ ఆయన ఎవరు అంటే సంపూర్ణేష్ బాబుగా తెలుస్తుంది. బిర్యాని క్యారెక్టర్ లో కనిపించనున్న ఆయన ఈ సినిమాలో చాలా అత్యంత కీలకమైన పాత్రను పోషించాడట.
మొదటి నుంచి తమతో సాన్నిహిత్యంగా ఉండి చివరికి నానికి హ్యాండ్ ఇస్తాడనే వార్తలైతే వస్తున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ కూడా ఈ సినిమాకి చాలా వరకు ప్లస్ అవుతుందట. మొత్తానికైతే శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాతో మరోసారి తన సత్తా ఏంటో చూపించుకోవడానికి సిద్ధమవుతున్నాడు.
దసరా సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది… మొత్తానికైతే ఈ సినిమా 200 కోట్లకు పైన బడ్జెట్ తో తెరకెక్కుతోంది. కాబట్టి ఈ సినిమా 300 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టాలి. లేకపోతే మాత్రం ఈ సినిమా బడ్జెట్ ఫెయిల్యూర్ గా మిగిలే అవకాశాలు ఉన్నాయి…