spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ర‌ఘురామ‌కు ‘లాక్’.. అర‌రే ఎంత‌ప‌నైందీ!

ర‌ఘురామ‌కు ‘లాక్’.. అర‌రే ఎంత‌ప‌నైందీ!

Raghu Rama Krishnam Raju

వైసీపీ ఎంపీ ర‌ఘురామ కృష్ణ‌రాజుకు బెయిల్ వ‌చ్చింది. అయితే.. న్యాయ‌స్థానం ష‌ర‌తులు కూడా విధించింది. మీడియాతోగానీ.. సోష‌ల్ మీడియాలోగానీ ఎలాంటి విష‌యాలూ మాట్లాడొద్ద‌ని ఆదేశించింది. దీంతో.. ఆ ‘రెండు ఛాన‌ళ్లు’ తెగ బాధ‌ప‌డిపోతున్నాయ‌ట‌. అరరే ఎంత‌పైనేందే అని గింజుకుంటున్నాయ‌ట‌. దీంతో.. వారినీవీరినీ చ‌ర్చ‌ల‌కు పిలిచి ‘అలా ఎలా ఆదేశిస్తారు?’ అని చెప్పిస్తున్నాయట.

అయితే.. నిజానికి రాజకీయ నాయకులు అన్న తర్వాత ప్రతీరోజు ఏదో ఒక విష‌యంపై స్పందిస్తుంటారు. వాటిని రిపోర్ట్ చేయ‌డం మీడియా ప‌ని. ఆ త‌ర్వాత ఏవైనా విశ్లేష‌ణ‌లు ఉంటే త‌మ కోణాన్ని జోడించి క‌థ‌నాలు వండుతుంటాయి. ఇది స‌హ‌జం. కానీ.. ర‌ఘురామ ఫీడ్ తోనే ఆ రెండు ఛాన‌ళ్లు న‌డుస్తాయ‌ని, ఆయ‌న ఫీడ్ లేక‌పోతే ముందుకు సాగ‌లేవు అన్న‌ట్టుగా వ్య‌వ‌హ‌రించాయ‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

ఆయ‌న‌కు ప్ర‌త్యేక స్లాట్ కేటాయించి.. ఉద్దేశ‌పూర్వ‌క క‌థ‌నాలు ప్ర‌సారం చేయించాయ‌ని సీఐడీ కేసు న‌మోదు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. దీంతో.. ఎలాంటి ఉద్దేశ‌మూ లేన‌ప్పుడు ఇలా ప్ర‌త్యేక స‌మ‌యం ఇచ్చి మ‌రీ.. ఇంట‌ర్వ్యూలు ఇప్పించాల్సిన అవ‌స‌రం ఏంట‌న్న‌ది వైసీపీ నేత‌లు వాద‌న‌. ఇది దురుద్దేశ చ‌ర్య‌కాక మ‌రేమిటి అని వారు అంటున్నారు. ఈ వాద‌న‌లు కొన‌సాగుతుండ‌గానే ర‌ఘురామ‌కు సుప్రీం బెయిల్ మంజూరు చేసింది.

కానీ.. మీడియాతో మాట్లాడొద్ద‌ని నోటికి తాళం వేయ‌డంతో.. అర‌రరే ఎంత ప‌నైందీ అంటూ ఆ రెండు ఛాన‌ళ్లు మ‌ద‌న‌ప‌డిపోతున్నాయ‌ట‌. సుప్రీం ఆదేశం లేక‌పోతే.. ఒక‌టీ, రెండూ.. అంటూ ఆ రెండు ఛాన‌ళ్లు ఇంట‌ర్వ్యూలు కూడా మొద‌లుపెట్టి ఉండేవ‌ని అంటున్నారు. మీడియా వాస్త‌వాల‌ను చూపించాలి. య‌థార్థాల‌ను ప్ర‌జ‌ల‌కు వివ‌రించాలి. ప్ర‌జాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న మీడియా.. ఒక పార్టీకి, వ‌ర్గానికి కొమ్ముకాయ‌డం ప్ర‌జ‌ల‌కు ఏ మాత్రం మంచిది కాద‌ని అంటున్నారు విశ్లేష‌కులు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper