
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇతర మధ్యాదాయ దేశాలకు హెచ్చరిక వంటిదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ఐఎంఎఫ్ ఒక నివేదికలో తెలిపింది. చీఫ్ ఎకనమిస్ట్ గీతా గోపీనాథ్, ఎకనమిస్ట్ రుచిర్ అగర్వాల్ ఈ నివేదికను సంయుక్తంగా రూపొందించారు. 2021 చివరినాటికి ఇండియాలో 35 శాతం జనాభాకు మాత్రమే టీకాలు అందుతాయని నివేదిక తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో దారుణమైన పరిస్థితులు తలెత్తుతాయని అనిపిస్తున్నట్లు పేర్కొన్నది. ఆఫ్రికాతో పాటు ముప్పును తప్పించుకోగలిగిన అల్పదాయ, మధ్యాదాయ దేశాలకు భారత్ పరిస్థితి ఓ హచ్చరిక లాంటిదని ఐఎంఎఫ్ నివేదిక తెలిపింది.