Homeఎంటర్టైన్మెంట్The Paradise Pre Release Event : హీరో నానిని తొక్కేస్తున్నది ఎవరు? ‘ప్యారడైజ్’ ప్రీ...

The Paradise Pre Release Event : హీరో నానిని తొక్కేస్తున్నది ఎవరు? ‘ప్యారడైజ్’ ప్రీ రిలీజ్ లో నాని ఎవరి గురించి మాట్లాడారు?

The Paradise Pre Release Event : నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన హీరో. అయితే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక టాలీవుడ్‌లో కొందరు కుట్రలు పన్నుతున్నారా? నానిని ఎదగనీయకుండా తొక్కేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారా? ఇటీవల తన రాబోయే చిత్రం ‘ది ప్యారడైజ్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై, తన ఓటమిని కోరుకునే […]

The Paradise Pre Release Event : నేచురల్ స్టార్ నాని టాలీవుడ్‌లో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా స్వశక్తితో ఎదిగిన హీరో. అయితే ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేక టాలీవుడ్‌లో కొందరు కుట్రలు పన్నుతున్నారా? నానిని ఎదగనీయకుండా తొక్కేసేందుకు ప్లాన్స్ వేస్తున్నారా?

ఇటీవల తన రాబోయే చిత్రం ‘ది ప్యారడైజ్’ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. తనపై జరుగుతున్న నెగెటివ్ ప్రచారంపై, తన ఓటమిని కోరుకునే వారిపై నాని ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. కయాదు లోహర్ హీరోయిన్‌గా, మంచు మోహన్ బాబు విలన్‌గా నటించిన ఈ చిత్రం సెప్టెంబర్ 24న గ్రాండ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో నాని మాట్లాడిన మాటలు ఒక్కసారిగా అందరి దృష్టినీ ఆకర్షించాయి.

ఈ వేదికపై నాని మాట్లాడుతూ “మనం ఎదుగుతుంటే మన చుట్టూ పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా పెరుగుతుంది. నెగెటివ్‌ని మనం పట్టించుకోకూడదు, పాజిటివ్‌ని పట్టుకొని ముందుకు వెళ్లాలి. మనం గెలవాలని కోరుకునే వాళ్లు పెరిగినట్టే.. మనం ఓడిపోతే చూద్దాం అనుకునే వాళ్లు కూడా పెరుగుతారు. నన్ను ఓడించాలనుకునే వారిని ఓడించడానికి నేను ప్రయత్నించడం లేదు, కానీ నేను గెలుస్తానని నమ్మే వాళ్లని గెలిపించడానికి ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటా” అంతేకాకుండా “మీరు నాకు 100 ఏళ్లకు సరిపడా ప్రేమను ఇచ్చారు. మనల్ని ఎవరూ ఆపలేరు!” అంటూ నాని చాలా కాన్ఫిడెంట్‌గా సవాల్ విసిరారు.

నాని చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు కోణం ఏమిటి? గతంలో పవన్ కళ్యాణ్ సినిమాల విడుదల సమయంలో టికెట్ రేట్ల వివాదంపై నాని ధైర్యంగా గళం విప్పారు. ఆ సమయంలో నాటి వైసీపీ ప్రభుత్వం నాని సినిమాల విడుదల వేళ ఇబ్బందులు పెట్టిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఇండస్ట్రీకి చెందిన కొందరు వైసీపీ సానుభూతిపరులైన బడా నిర్మాతలు, పెద్దలు నానిని టార్గెట్ చేశారనే వార్తలు వచ్చాయి.

ఇప్పుడు మళ్లీ ‘ది ప్యారడైజ్’ సినిమా సీక్వెల్స్, భారీ ప్రాజెక్టులతో నాని పాన్-ఇండియా స్థాయిలో దూసుకుపోతుంటే.. ఆయనను ఎదగనీయకుండా నెగెటివ్ ప్రచారాలు చేయిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. వీటన్నింటికీ సమాధానంగానే నాని ఈ వేదికగా బరెస్ట్ అయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు.

స్వయంకృషితో ఎదిగిన నేచురల్ స్టార్ నానిని ఆపడం ఎవరి తరమూ కాదని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి నాని చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏమిటి? టాలీవుడ్‌లో జరుగుతున్న ఈ రాజకీయాలపై మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి.

 

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper