Homeఅంతర్జాతీయంChristopher Columbus: ఇండియా అనుకొని అమెరికాను కనిపెట్టాడు.. చరిత్రలో ‘కొలంబస్’ చేసిన అతిపెద్ద తప్పు ఇదే

Christopher Columbus: ఇండియా అనుకొని అమెరికాను కనిపెట్టాడు.. చరిత్రలో ‘కొలంబస్’ చేసిన అతిపెద్ద తప్పు ఇదే

Christopher Columbus: ప్రపంచ భౌగోళిక చరిత్రలో.. అత్యంత ప్రసిద్ధమైన సముద్ర యాత్రికులలో క్రిస్టఫర్ కొలంబస్ ఒకరు. ఈయన అమెరికాను కనిపెట్టారు. చిన్నప్పటినుంచే కొలంబస్ కు భౌగోళిక అంశాల మీద పట్టు అధికంగా ఉండేది. పైగా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. అందువల్ల ఆయన ప్రపంచం మొత్తం తిరిగేవారు. ఈ నేపథ్యంలోనే 1492లో ఆయన సముద్ర ప్రయాణాన్ని చేపట్టారు. అది కాస్త ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చేసింది. కొలంబస్ ప్రయాణం వెనుక అసలు లక్ష్యం […]

Christopher Columbus: ప్రపంచ భౌగోళిక చరిత్రలో.. అత్యంత ప్రసిద్ధమైన సముద్ర యాత్రికులలో క్రిస్టఫర్ కొలంబస్ ఒకరు. ఈయన అమెరికాను కనిపెట్టారు. చిన్నప్పటినుంచే కొలంబస్ కు భౌగోళిక అంశాల మీద పట్టు అధికంగా ఉండేది. పైగా కొత్త అంశాలను నేర్చుకోవడానికి ఆయన ఎక్కువగా ఆసక్తిని చూపించేవారు. అందువల్ల ఆయన ప్రపంచం మొత్తం తిరిగేవారు. ఈ నేపథ్యంలోనే 1492లో ఆయన సముద్ర ప్రయాణాన్ని చేపట్టారు. అది కాస్త ప్రపంచ చరిత్రను పూర్తిగా మార్చేసింది.

కొలంబస్ ప్రయాణం వెనుక అసలు లక్ష్యం అదే

కొలంబస్ కు ఒక నమ్మకం ఉండేది. యూరప్ నుంచి పశ్చిమ దిశగా సముద్ర మార్గంలోకి ప్రయాణించడం ద్వారా ఆసియాకు ముఖ్యంగా ఇండియాకు చేరుకోవడానికి అవకాశం ఉంటుందని ఆయన భావించారు. అలాంటి ఆలోచనతోనే ఆయన 1492లో మూడు నౌకల ద్వారా సముద్ర ప్రయాణాన్ని మొదలుపెట్టారు. సుదీర్ఘంగా సముద్రంలో ప్రయాణించిన తర్వాత.. ఆయనకు భూమి జాడ కనిపించింది.. కనిపించిన ఆ భూమి జాడనే కరేబియన్ ప్రాంతంలోని దీవులు. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది.

కొలంబస్ నాటి రోజుల్లో భావించలేదు

కొలంబస్ తాను కొత్త ఖండాన్ని చేరుకున్నానని నాటి రోజుల్లో భావించలేదు. పైగా తాను చేరుకున్న ప్రాంతాన్ని ఆసియా సమీపంలోని ఒక ప్రాంతం అని భావించాడు. అక్కడ ఆయనకు కనిపించిన ప్రజలను ఆసియా వాసులుగానే భావించాడు. అందుకే వారిని స్పానిష్ లో ఇండీయోస్ అని పిలిచాడు. దానికి అర్థం ఇండియన్స్ లేదా భారతీయులు అని అనుకున్నాడు. వాస్తవానికి నాడు కోలంబస్ చేరుకున్నది ఇండియాకు కాదు.. అమెరికా ఖండానికి చెందిన ఓ ప్రాంతానికి.. ఎంతో జ్ఞాని అయిన కొలంబస్కు ఈ విషయం ఎందుకు తెలియదు? నాటి కాలంలో ప్రపంచ భౌగోళిక పరిజ్ఞానం నేటి స్థాయిలో లేదు.

అప్పటి అంచనాలు భిన్నంగా ఉండేవి

భూమి పరిమాణం.. ఆసియా – యూరప్ మధ్య దూరం గురించి కూడా అప్పట్లో అంచనాలు చాలా భిన్నంగా ఉండేవి. అందుకే పశ్చిమ దిశగా ప్రయాణం సాగిస్తే ఆసియాకి చేరుకోవచ్చని కోలంబస్ నాటి రోజుల్లో విశ్వసించాడు.. ఆ తర్వాత కొలంబస్ తన జీవితకాలంలో ప్రయాణించిన ప్రాంతాలు కొత్త ఖండానికి చెందినవని అంగీకరించలేదు. చాలా కాలం పాటు ఆశయాలు అవి భాగమని నమ్మాడు. ఆ తర్వాత అమెరికా వెస్పూచి వంటి అన్వేషకుల ప్రయాణాలు.. పరిశీలనతో ఈ ప్రాంతాలు ఆసియాకు చెందినవి కావని.. యూరోపియన్లకు తెలియని ఒక కొత్త భూభాగమని తర్వాత తేలింది. ఆ తర్వాత ఆ కొత్త భూభాగానికి అమెరికా అనే పేరు వాడుకులోకి వచ్చింది.ఈ ప్రకారం కొలంబస్ కొత్త భూభాగానికి చేరుకున్నాడు. కానీ తాను ఎక్కడికి చేరుకున్నాడో మాత్రం మొదట్లో గుర్తించలేకపోయాడు. ఏమైంది అందుకే చరిత్రలో కోలంబ సాగించిన ప్రయాణం ఒక అన్వేషణ మాత్రమే కాకుండా.. భౌగోళిక అన్వేషణలో జరిగిన ఒక ఆసక్తికరమైన అంశంగా గుర్తుండిపోయింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper