Homeజాతీయ వార్తలుDelhi Protests: ప్రధాన్ కాదట.. ప్రధానీని దించేస్తారట..

Delhi Protests: ప్రధాన్ కాదట.. ప్రధానీని దించేస్తారట..

Delhi Protests: ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనలలో కేవలం నీట్ విద్యార్థులు మాత్రమే కాకుండా.. సంఘ విద్రోహ శక్తులు కూడా పాల్గొన్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది.. విద్యార్థుల మినహా.. ఈ దేశానికి నష్టం కలిగించే వ్యక్తుల మీద ఉపేక్షపూరితమైన వ్యవహార శైలి వద్దని సూచించింది. అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి.. సంఘ విద్రోహ శక్తులను గుర్తించింది ఢిల్లీ పోలీస్ శాఖ. అంతేకాదు వారిని పట్టుకోడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వీరిలో చాలామంది […]

Delhi Protests: ఇటీవల ఢిల్లీలో జరిగిన నిరసనలలో కేవలం నీట్ విద్యార్థులు మాత్రమే కాకుండా.. సంఘ విద్రోహ శక్తులు కూడా పాల్గొన్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది.. విద్యార్థుల మినహా.. ఈ దేశానికి నష్టం కలిగించే వ్యక్తుల మీద ఉపేక్షపూరితమైన వ్యవహార శైలి వద్దని సూచించింది.

అత్యాధునిక కెమెరాలను ఉపయోగించి.. సంఘ విద్రోహ శక్తులను గుర్తించింది ఢిల్లీ పోలీస్ శాఖ. అంతేకాదు వారిని పట్టుకోడానికి కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. వీరిలో చాలామంది మీద కేసులు ఉన్నాయి. వారంతా కూడా తీవ్రమైన నేరాలకు పాల్పడ్డారు. అటువంటివారు ఈ ఆందోళనలో పాల్గొని.. హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు. అంతేకాదు.. వారిని పట్టుకుని.. ఈ ఆందోళనలకు ఎవరు ఫండింగ్ చేశారు.. ఎవరు వీరిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు అనే కోణాలలో దర్యాప్తు మొదలుపెట్టారు.

ఎప్పుడైతే ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి తవ్వడం మొదలుపెట్టారో.. అప్పుడే బొద్దింకల అసలు రూపం బయటపడుతోంది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ మాత్రమే కాదని.. ఇప్పుడు తమ టార్గెట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని బొద్దింకలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ అల్లర్లలో పాలుపంచుకున్న వారి మీద కేసులు పెట్టకూడదట. పోలీసులు వారిని ఇంటరాగేషన్ చేయకూడదట. పైగా పోలీసులు ఆత్మ రక్షణ అర్థం లాఠీ చార్జ్ చేస్తే.. బాష్ప వాయు గోళాలు ప్రయోగిస్తే.. వారి మీద చర్యలు తీసుకోవాలట.నీట్ ఆందోళనలలో పాల్గొన్నది కేవలం విద్యార్థులు మాత్రమే నట. అందులోకి సంఘవిద్రోహ శక్తులు రాలేదట.. పైగా ఢిల్లీ పోలీసులు ఇదేవిధంగా కేసులు పెట్టి.. విచారణ సాగిస్తే మళ్లీ ఉద్యమం చేస్తారట..

ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత పోలీసులు ఎందుకు ఊరుకుంటారు.. పైగా నీట్ ఆందోళనల ముసుగులో జరిగిన దారుణాలను కేంద్రం అంత ఈజీగా మర్చిపోదు. పైగా సంఘ విద్రోహశక్తులను చెక్కేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. కేంద్రం వేస్తున్న అడుగులు.. బొద్దింకలకు ఊపిరి సలపకుండా చేస్తున్నాయి. అందువల్లే ఇంతటి యాగీ చేస్తున్నాయి. ఇప్పటికే బొద్దింకల మీద ప్రముఖ బాలీవుడ్ నటి.. బిజెపి ఎంపీ కంగనా రనౌట్ తీవ్రస్థాయిలో మండిపడింది. అయితే ఆమెను బొద్దింకలు విమర్శించడానికి వెనుకాడ లేదు. ఒక దశలో హృతిక్ రోషన్ పేరు కూడా తీసుకొచ్చారు. దీనిని బట్టి బొద్దింకల మెచ్యూరిటీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ఈ బొద్దింకలను ప్రారంభంలో నలిపేయాలని.. లేకపోతే దేశానికి ప్రమాదకరమని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper