Homeటాప్ స్టోరీస్Lava Bolt N4 lite: బడ్జెట్ పద్మనాభాలకు సరిపోయే ఫోన్.. ధర.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్...

Lava Bolt N4 lite: బడ్జెట్ పద్మనాభాలకు సరిపోయే ఫోన్.. ధర.. ఫీచర్లు.. ఫుల్ డీటెయిల్స్ మీకోసం

Lava Bolt N4 lite: ఇప్పుడంటే చైనా ఫోన్లు మన దేశాన్ని ఏలుతున్నాయి. మన దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఒకప్పుడు ఇండియన్ కంపెనీలు ఈ మార్కెట్లో నెంబర్ వన్ గా ఉండేవి. అటువంటి కంపెనీలలో లావా ఒకటి. స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. తన స్థానాన్ని.. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్లో మరింత బలోపేతం చేసుకోవడానికి లావా కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సిరీస్ లను మార్కెట్లోకి […]

Lava Bolt N4 lite: ఇప్పుడంటే చైనా ఫోన్లు మన దేశాన్ని ఏలుతున్నాయి. మన దేశ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఒకప్పుడు ఇండియన్ కంపెనీలు ఈ మార్కెట్లో నెంబర్ వన్ గా ఉండేవి. అటువంటి కంపెనీలలో లావా ఒకటి.

స్మార్ట్ ఫోన్ మార్కెట్లో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో.. తన స్థానాన్ని.. ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్లో మరింత బలోపేతం చేసుకోవడానికి లావా కంపెనీ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే కొత్త సిరీస్ లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. స్మార్ట్ఫోన్ ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. లావా కంపెనీ మాత్రం తక్కువ ధరలో ఫోన్లు ఉండేలా చూసుకుంది. ముఖ్యంగా బడ్జెట్ పద్మనాభాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఫోన్ లను రూపొందించింది.

ఇది గోస్ట్ సిల్వర్, ఎంపైర్ గోల్డ్ రంగుల్లో ఉంటుంది. ఇందులో 3GB RAM, 32 GB స్టోరేజ్ తో వస్తుంది. ఎస్ డీ కార్డు ద్వారా మెమొరీని మరింత విస్తరించుకోవచ్చు. 6.56 అంగుళాల ఎల్ సీ డీ డిస్ ప్లే ను కలిగి ఉంటుంది. వెనుక 8 మెగాపిక్సల్ పరిమాణంలో ఏఐ కెమెరా ఉంటుంది.. సెల్ఫీల కోసం 5 మెగాపిక్సల్ కెమెరా ఉంది. కెమెరాలలో ఎల్ఈడి ఫ్లాష్ ఉంటుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 గో ఎడిషన్ వెర్షన్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. బ్యాటరీకి 5,000 mAh సామర్థ్యం ఉంటుంది. 10 W ప్రామాణిక చార్జింగ్ తో ఈ ఫోన్ వస్తుంది..

ఈ ఫోన్లో ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. కిందపడిన సరే నిర్మాణం పరంగా మరింత కోసం MIL STD 810 H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికెట్ ఉంటుంది.

ఇందులో యూఎస్ బీ టైప్ సీ పోర్ట్, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్, డ్యూయల్ సిమ్ సామర్థ్యం, వైఫై, బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవచ్చు.

ఈ ఫోన్ గోస్ట్ సిల్వర్, ఎంపైర్ గోల్డ్ అనే రంగులలో లభిస్తుంది. 7,999 ప్రారంభ ధరతో మార్కెట్లోకి ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ కంపెనీ ఇదే ధరకు విక్రయిస్తోంది. 8,099 నుంచి 8399 వరకు రిటైల్ ధర ఉండే అవకాశం ఉంది.. లావా కంపెనీ ఈ ఫోన్ తో పాటు తమ ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అనే పాలసీని అందిస్తోంది. దీని ద్వారా దేశం మొత్తం మీద ఇంటి వద్దకే టెక్నికల్, పర్చేజ్ సపోర్టు అందిస్తోంది. అంతేకాకుండా దీనికి రెండు సంవత్సరాలు పాటు సెక్యూరిటీ ప్యాచ్ లు కూడా అందిస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper