Agni Pariksha 2 Telugu: రీసెంట్ గానే స్టార్ మా , జియో హాట్ స్టార్ లలో మొదలైన ‘అగ్ని పరీక్ష 2’ కి ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో మన కళ్లారా చూస్తూనే ఉన్నాము. అత్యధిక శాతం కాంట్రవర్సీలతో సాగుతున్న ఈ షోకి సంబంధించిన లేటెస్ట్ ఎపిసోడ్ జియో హాట్ స్టార్ లోకి అందుబాటులో వచ్చింది. ఈ ఎపిసోడ్ లో కూడా కంటెస్టెంట్స్ పట్ల జడ్జీలు వ్యవహరించిన తీరుపై మండిపడుతున్నారు నెటిజెన్స్. మిస్ అపూర్వ అనే మోడలింగ్ అమ్మాయి ఎపిసోడ్ ఆరంభం లో వస్తుంది. మంచి ఎనర్జీ తో ఈమె ఆడిషన్ ని మొదలు పెడుతుంది కానీ , ఆ తర్వాత జడ్జీలు ఈమెని ఇరకాటం లోకి నెట్టేశారు. అభిజిత్ గేమ్ అంటే నాకు ఇష్టం లేదు అన్నప్పటి నుండి ఈమెకు కష్టాలు మొదలు అయ్యాయి. అభిజిత్ హర్ట్ అవ్వడం తో ఆయన ఆమెకు రెడ్ ఫ్లాగ్ ఇచ్చాడు అన్నట్టుగా చెప్తున్నారు నెటిజెన్స్.
ఆమె కేవలం తన అభిప్రాయం మాత్రమే చెప్పాను , అది నిజం అవ్వకపోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా అభిజిత్ , బిందు మాధవి లు రెడ్ ఫ్లాగ్స్ ఇవ్వడం పై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత రోహిత్ నాయుడు అనే కంటెస్టెంట్ వచ్చాడు. ఇతను చూసేందుకు చాలా కూల్ గా , స్వీట్ గా కనిపించాడు. బిందు మాధవి అతన్ని దగ్గరకు పిలిచి స్వీట్ తినిపించి , ముఖం పై నీళ్లు కొడుతుంది. దీనికి కూడా రోహిత్ పెద్దగా రియాక్ట్ అవ్వడు . అప్పుడు బిందు మాధవి నీ తప్పు లేకపోయినా నీ ముఖం మీద నీళ్లు కొట్టాను , అయినప్పటికీ నువ్వు రెస్పాన్స్ ఇవ్వడం లేదు అందుకే నీకు రెడ్ ఫ్లాగ్ ఇస్తున్నాను అని అంటుంది. మీరు కావాలని నన్ను ట్రిగర్ చేయడానికే అలా చేశారని అర్థం అవుతోంది , అందుకే నేను రియాక్ట్ అవ్వలేదు అని చెప్పినప్పటికీ కూడా బిందు మాధవి వినలేదు.
ఇక నవదీప్ అయితే నువ్వెంతో మాకు తెలియడం లేదు , మాస్క్ ఏసుకొని ఉన్నావ్ అని చెప్పి , ఆయన కూడా రెడ్ ఫ్లాగ్ ఇచ్చేస్తాడు. ఇక చివరికి అభిజిత్ మాత్రం గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చి , ఇలాంటి యాటిట్యూడ్ ఒక మనిషిలో ఉండాలి అని అంటాడు. దీంతో రోహిత్ తదుపరి రౌండ్స్ కి ఫార్వర్డ్ అయ్యాడు. ఆశ్చర్యానికి గురి చేసే విషయం ఏమిటంటే, కేవలం ఒకే ఒక్క గ్రీన్ ఫ్లాగ్ తో , రోహిత్ ప్రయాణం ‘అగ్నిపరీక్ష 2’ లో చివరి వరకు సాగింది. ఓటు అప్పీల్ కూడా చేసుకున్నాడు. అంటే ఇతను దాదాపుగా ‘బిగ్ బాస్ 10’ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్టే అనుకోవాలి. అదే విధంగా చాలామంది కంటెస్టెంట్స్ కి జడ్జీలు ఒకటి, రెండు గ్రీన్ ఫ్లాగ్స్ ఇచ్చారు , కానీ వీళ్ళ క్లిప్స్ మొత్తం కలిపి నిమిషం కూడా వెయ్యలేదు. అందులో ఒక కంటెస్టెంట్ అర్జున్ రెడ్డి యాటిట్యూడ్ తో ఎంట్రీ ఇచ్చి , నవదీప్ కాలర్ ని పట్టుకుంటాడు. ఆ తర్వాత ఇతనికి కూడా గ్రీన్ ఫ్లాగ్ ఇచ్చారు. నేడు ఈ ఎపిసోడ్ ని మీరు రాత్రి 10 గంటలకు స్టార్ మా ఛానల్ లో చూడొచ్చు.