Homeక్రీడలుPakistan Cricket Board : భారత్ దెబ్బకు.. పాపం నక్వీ ముఖం మాడిపోయింది.. చివరికి ఎంత...

Pakistan Cricket Board : భారత్ దెబ్బకు.. పాపం నక్వీ ముఖం మాడిపోయింది.. చివరికి ఎంత గతి పట్టిందంటే?

Pakistan Cricket Board : అడవిలో సింహం మాత్రమే గర్జన చేయాలి. అలా కాకుండా వీధి కుక్క సింహం లాగా మారిపోవాలని.. బీభత్సంగా గర్జన చేయాలి అనుకుంటే కుదరదు.. క్రికెట్లో టీమిండియా సింహం లాంటిది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నే ఒప్పుకున్నాయి. కాని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే ఇది అర్థం కావడం లేదు. అనేక సందర్భాలలో అర్థమయ్యేలా టీమిండియా చెప్పినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దల తలకు ఎక్కడం లేదు. ఇటీవల టీమిండియా ఆసియా కప్ […]

Pakistan Cricket Board : అడవిలో సింహం మాత్రమే గర్జన చేయాలి. అలా కాకుండా వీధి కుక్క సింహం లాగా మారిపోవాలని.. బీభత్సంగా గర్జన చేయాలి అనుకుంటే కుదరదు..

క్రికెట్లో టీమిండియా సింహం లాంటిది. ఈ విషయాన్ని ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా నే ఒప్పుకున్నాయి. కాని పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకే ఇది అర్థం కావడం లేదు. అనేక సందర్భాలలో అర్థమయ్యేలా టీమిండియా చెప్పినప్పటికీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు పెద్దల తలకు ఎక్కడం లేదు.

ఇటీవల టీమిండియా ఆసియా కప్ గెలిచింది. ఆ సమయంలో ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధినేతగా ఉన్న నక్వి చేతుల మీదుగా టీమిండియా ప్లేయర్లు ట్రోఫీ అందుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో నక్వి అలానే చూస్తూ ఉండిపోయాడు. చివరికి వెనక్కి వెళ్ళిపోయాడు.

ట్రోఫీ గెలిచినప్పటికీ.. నక్వి చేతుల మీదుగా దానిని తీసుకోవడానికి టీమిండియా ప్లేయర్లు ఇష్టపడలేదంటే.. వారికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అంటే ఎంత చులకనో.. పాకిస్తాన్ క్రికెట్ అధిపతి అంటే ఎంతటి హేయమైన భావమో అర్థం చేసుకోవచ్చు. ట్రోఫీని తీసుకోవడానికే ఇష్టపడని టీమ్ ఇండియా ప్లేయర్లు.. పాకిస్తాన్ తో ఓడిపోవాలని ఎందుకు అనుకుంటారు..

కొలంబోలో పాకిస్తాన్ జట్టు జరిగిన మ్యాచ్లో టీమిండియా ప్లేయర్లు దుమ్మురేపారు. బ్యాటింగ్లో సత్తా చూపించారు. బౌలింగ్ లో పాకిస్తాన్ జట్టుకు చుక్కలు చూపించారు. ఏ మాత్రం వెనకడుగు వేయకుండా దూకుడు కొనసాగించారు. ఆడుతోంది కొలంబో మైదానం అయినప్పటికీ.. స్వదేశంలో అన్నట్టుగా టీమిండియా ప్లేయర్లు క్వాలిటీ క్రికెట్ ఆడారు. ఫలితంగా పాకిస్తాన్ జట్టు ఓడిపోయింది.

పాకిస్తాన్ జట్టు దారుణంగా ఓడిపోతున్న తీరును చూసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధినేత నక్వి చిన్నబుచ్చుకున్నాడు. భారత బౌలర్ల దూకుడు ముందు పాకిస్తాన్ ప్లేయర్లు తలవంచుతుంటే తట్టుకోలేకపోయాడు. మ్యాచ్ పూర్తికాకముందే పాకిస్తాన్ ఓటమిని ఖరారు చేసుకుని.. దొడ్డి దారిన కారులో వెళ్లిపోయాడు. మీడియా ప్రతినిధులు వెంబడిస్తుంటే తట్టుకోలేక.. కారు వేగాన్ని పెంచి కొలంబోలో తన కేటాయించిన హోటల్ గదిలోకి వెళ్లిపోయాడు..

నక్వి ఇటీవల అనేక డ్రామాలు ఆడాడు. తమ పాకిస్తాన్ జట్టు భారత జట్టుతో ఆడబోదని పేర్కొన్నాడు.. ఇంకా రకరకాల నాటకాలు ఆడాడు. చివరికి ఐసీసీ ఒత్తిడి తీసుకురావడంతో అన్ని మూసుకున్నాడు. అయితే భారత్ పర్ఫెక్ట్ గేమ్ ప్లాన్ తో పాకిస్తాన్ జట్టును ఓడించింది. సరికొత్త రికార్డు సృష్టించి.. అదరగొట్టింది. ఈ కథనం ప్రారంభంలో చెప్పాను కదా సింహం చేసే గర్జన ఆడవిలో ప్రకంపనలు సృష్టిస్తే.. కుక్క అరిచే అరుపుకు చెట్టు మీద ఉన్న పిట్టలు కూడా లేవవు. ఇప్పటికైనా ఈ విషయాన్ని నక్వి గుర్తు పెట్టుకుంటే మంచిదని టీమిండియా అభిమానులు పేర్కొంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper