Homeవింతలు-విశేషాలుInstagram Viral News: మీరు డబ్బులు ఇస్తే మేము విప్పి చూపిస్తాం.. ఇన్ స్టాలో ఇదో...

Instagram Viral News: మీరు డబ్బులు ఇస్తే మేము విప్పి చూపిస్తాం.. ఇన్ స్టాలో ఇదో దారుణమైన యవారం!

Instagram Viral News: ఏ మనిషి అయినా సరే దుస్తులు ధరిస్తేనే బాగుంటారు. రోడ్డుమీద తిరిగే మతిస్థిమితం లేని వారు కూడా తమ దేహాన్ని రక్షించుకోవడానికి దుస్తులు ధరిస్తుంటారు… అదేం పోయే కాలం అర్థం కావడం లేదు కానీ.. చాలామంది నేటి కాలంలో ఫ్యాషన్ పేరుతో దారుణమైన దుస్తులు ధరిస్తున్నారు. ధరించడం మాత్రమే కాదు.. వాటిని విప్పి కూడా చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ తరహా ధోరణి పెరిగిపోయింది. అలా విప్పి చూపించడానికి చాలామంది […]

Instagram Viral News: ఏ మనిషి అయినా సరే దుస్తులు ధరిస్తేనే బాగుంటారు. రోడ్డుమీద తిరిగే మతిస్థిమితం లేని వారు కూడా తమ దేహాన్ని రక్షించుకోవడానికి దుస్తులు ధరిస్తుంటారు…

అదేం పోయే కాలం అర్థం కావడం లేదు కానీ.. చాలామంది నేటి కాలంలో ఫ్యాషన్ పేరుతో దారుణమైన దుస్తులు ధరిస్తున్నారు. ధరించడం మాత్రమే కాదు.. వాటిని విప్పి కూడా చూపిస్తున్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఈ తరహా ధోరణి పెరిగిపోయింది.

అలా విప్పి చూపించడానికి చాలామంది డబ్బులు వసూలు చేస్తున్నారు. పైగా వారంతా కూడా సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూయన్సర్ లు గా వ్యవహరిస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రభావశీలమైన వ్యక్తులు సమాజ ఉద్ధరణకు పాల్పడాలి. మంచి మంచి విషయాలు చెప్పాలి. అలా కాకుండా ఇలా బరితెగించడం పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.

సామాజిక మాధ్యమాలలో ప్రసిద్ధమైన అప్లికేషన్ గా ఇన్ స్టా గ్రామ్ పేరుపొందింది. ఇందులో ప్రభావశీలమైన వ్యక్తుల పేరుతో కొంతమంది అమ్మాయిలు దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. లైకుల కోసం.. ఫాలోయింగ్ కోసం చివరికి తమ దుస్తులు మార్చుకునే వీడియోలను కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు..

రెచ్చగొట్టే దుస్తులు ధరించి.. వాటిని ఒక్కొక్కటిగా విప్పేస్తూ.. ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అంతేకాదు ఇలా తమ అంతర్గత అవయవాల ప్రదర్శన చూడాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాలని సబ్సిక్రిప్షన్ అనే అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు…

వాస్తవానికి మహిళలకు సంబంధించిన దుస్తుల మార్పు అనేది అంతర్గత విషయం. కాని దానిని కొంతమంది అమ్మాయిలు ఇలా సోషల్ మీడియాలో పెట్టడం ఆందోళన కలిగిస్తోంది. ఇటువంటి వీడియోలకు అడ్డుకట్ట వేయాలని.. ఆ తరహా అమ్మాయిలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

ఇలాంటి వీడియోలు కనిపించడం వల్ల చాలామంది ఇన్ స్టా గ్రామ్ వాడాలంటేనే ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు పరిస్థితి ఇలా ఉండేది కాదు. పైగా అనేక రకాల నిబంధనలు ఉండేవి. అయితే ఇటీవల కాలంలో ఆదాయం కోసం మెటా కంపెనీ నిబంధనలు మొత్తం సడలించిందని తెలుస్తోంది. బ్లూ టిక్ తీసుకుంటే చాలు ఏమైనా చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోందని నెటిజన్లు అంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper