Homeబిజినెస్phones under 25,000: 25,000 లలో బెస్ట్ ఫోన్స్ ఇవి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

phones under 25,000: 25,000 లలో బెస్ట్ ఫోన్స్ ఇవి.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

phones under 25,000: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ల మీద భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తాయని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఈ అమ్మకాలు మొదలవుతాయని తెలుస్తోంది. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సీజన్ అక్టోబర్ 8 నుంచి మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ బిగ్ బిలియన్ డేస్ మొదలుపెట్టింది. ఈ రెండు సంస్థలలో 25 వేల లోపు ఫోన్ల ధరల మీద డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి మోడల్స్ […]

phones under 25,000: ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్ స్మార్ట్ ఫోన్ల మీద భారీగా డిస్కౌంట్ ప్రకటిస్తాయని వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల నుంచి ఈ అమ్మకాలు మొదలవుతాయని తెలుస్తోంది. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 సీజన్ అక్టోబర్ 8 నుంచి మొదలవుతుంది. ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ బిగ్ బిలియన్ డేస్ మొదలుపెట్టింది.

ఈ రెండు సంస్థలలో 25 వేల లోపు ఫోన్ల ధరల మీద డిస్కౌంట్లు లభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి మోడల్స్ ఇందులో ఉన్నాయి.. వాటి ఫీచర్లు.. ఇతర అంశాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

25వేల లోపు బడ్జెట్లలో లభించే ఫోన్లలో ఉత్తమమైన కనెక్టివిటీ.. పెద్ద బ్యాటరీలు.. AMOLED display, ఉత్తమమైన ప్రాసెసర్లు.. ఓ ఐ ఎస్ కెమెరా వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి ఈనెల 28 నాటి మార్కెట్ లిస్టింగ్ లో అమెజాన్.. ఫ్లిప్కార్ట్ ధరలను కూడా లెక్కలోకి తీసుకుంటే.. పలు మోడల్స్ ను ఈ సెగ్మెంట్లో చూడొచ్చు

Oneplus nord CE 5 5G

ఇందులో Diamensity 8350 Apex చిప్ సెట్ ఉంది. 120 హెచ్ జెడ్ అమోలెడ్ డిస్ ప్లే, 7100 ఎం ఏ హెచ్ బ్యాటరీ వంటి స్పెసిఫికేషన్లో ఇందులో ఉన్నాయి. సెప్టెంబర్ 28 నాటి లిస్టింగ్ ధరను పరిశీలిస్తే 21,999 రూపాయలుగా ఉంది.

Real me P4 5G

25 వేల లోక్ బడ్జెట్ లో ఫోన్ తీసుకోవాలి అనుకునే వారికి ఇది కూడా ఒక ఉత్తమమైన ఎంపిక. పెర్ఫామెన్స్ అద్భుతంగా ఉంటుంది. రోజువారి వినియోగానికి సరిపోతుంది. బ్యాటరీ, ఫోన్, చిప్ సెట్, ప్రాసెసర్.. ఇలా అన్ని విభాగాల్లో ఈ ఫోన్ అద్భుతమైనది. సెప్టెంబర్ 28 నాటి లిస్టింగ్ ధర చూస్తే 20,999 గా ఉంది.

Poco M8 power

ఇందులో బాహుబలి లాంటి బ్యాటరీ ఉంటుంది.. దీని పరిమాణం ఏకంగా 8000 ఎం ఎ హెచ్. 6.9 అంగుళాల అమో లెడ్ డిస్ ప్లే ఇందులో ఉంది. భారీ బ్యాటరీ వల్ల ఫోన్ బరువు అధికంగా ఉన్నప్పటికీ.. గేమింగ్ పనితీరులో కొంత పరిధి వరకే బాగుంటుందని అనేక సమీక్షలలో వెళ్లడైంది. కాబట్టి ఈ ఫోన్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాలని విశ్లేషకులు చెబుతున్నారు.

Motorola g57 power 5G

మోటరోలా g57 పవర్ 5జి కూడా 25వేల లోపు వస్తూ ఉంటుంది. తాజా లిస్టింగ్ లో దీని ధర సుమారు 21,200 నుంచి 22,000 మధ్యలో ఉంది. Snapdragon 6s Gen 4, 7000 mah battery, 8GB RAM వంటి స్పెసిఫికేషన్లు ఇందులో ఉన్నాయి.

Redmi note 15 SE 5G

Redmi note 15 SE 5G మోడల్ కూడా 25వేల లోపు ధరలో వస్తుంది. తాజా మార్కెట్ లిస్టింగ్ ప్రకారం దీని ధర 23,999 గా నమోదయింది.

Amazon great India festival 2026 early deals లో భాగంగా Redmi 17 5G 23,999 ధరకు లభిస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 4 జెన్ 5 ప్రాసెసర్, 6.9 అంగుళాల 120 హెచ్ జడ్ డిస్ ప్లే, 7900 ఎంఎహెచ్ బ్యాటరీ, 45 డబ్ల్యు చార్జింగ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఈ ధరలో ఫోన్ కొనుకునే వారికి ఇది ఒక ఉత్తమమైన ఎంపిక.

25వేల బడ్జెట్లో ఫోన్ కొనుక్కోవాలి అనుకునేవారు కేవలం ఎంఆర్పి మాత్రమే చూడొద్దు. బ్యాంక్ ఆఫర్.. ఎక్స్చేంజి బోనస్.. కూపన్ డిస్కౌంట్ కూడా పరిశీలించాలి. ముఖ్యంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026 అక్టోబర్ 8 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో.. అప్పటివరకు ఉన్న ధరలను.. ఆఫర్లను ఒకసారి పరిశీలించడం అత్యంత ఉత్తమం.

సేల్ ధరలు.. స్టాక్.. బ్యాంక్ ఆఫర్లు మారుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేస్తున్న సమయంలో ఆమెజాన్ లేదా ఫ్లిప్కార్ట్ లో చూపించే తుది ధరను మాత్రమే నిర్ధారించుకోవాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper