Miryalaguda Maruthi Rao Case : మిర్యాలగూడలో కొన్ని సంవత్సరాల క్రితం మారుతీ రావు కుమార్తె అమృత కేసు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొద్దిరోజుల పాటు ప్రధాన మీడియాలో ఈ వార్త మాత్రమే ప్రధాన శీర్షిక అయింది. ఈ సంఘటన చోటు చేసుకున్నప్పుడు నాడు ఉమ్మడి నల్గొండ జిల్లాకు ఎస్పీగా ప్రస్తుత హైడ్రా అధిపతి రంగనాథ్ ఉన్నారు.
నాడు ఈ కేసును ఏకంగా ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా పర్యవేక్షించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో కులం.. పరువు.. ప్రేమ.. హత్య.. ఇంకా అనేక రకాల కారణాలు ఉన్నాయి. మిర్యాలగూడ చెందిన మారుతీ రావు పేరు పొందిన వ్యాపారి. ఈయన ఒక వేరే సామాజిక వర్గానికి చెందినవారు. ఈయన తన కుమార్తె అమృత వర్షిణి ని అత్యంత ప్రేమగా పెంచుకున్నారు. అల్లారుముద్దుగా చూసుకున్నారు. ఆమెకు కావలసినవని క్షణాల్లో కొనిచ్చారు.
అమృత చిన్ననాటి స్నేహితుడు ప్రణయ్ అనే యువకుడిని ప్రేమించింది. వీరిద్దరూ పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఇది మారుతీరావుకు అసలు నచ్చలేదు. దీంతో ఒక కిరాయి వ్యక్తులను మాట్లాడి ప్రణయ్ ని అంతం చేయించాడు. ఈ కేసు కాస్త రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది. అప్పుడు ఎస్పీగా రంగనాథ్ నల్గొండ జిల్లాలో పనిచేస్తున్నారు ఈ కేసు గురించి ఆయన అత్యంత లోతుగా పరిశీలించారు. ఆ తర్వాత ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. మారుతి రావు.. అతడి సోదరుడు.. ప్రణయ్ ని హత్య చేసిన వ్యక్తులను అరెస్టు చేయించారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారుతీరావును రంగనాథ్ విచారించారు. ” మారుతి రావు తన కుమార్తె అమృత మీద విపరీతంగా ప్రేమ పెంచుకున్నాడు. ఆమె ఇంట్లో నుంచి పారిపోయి పెళ్లి చేసుకోవడానికి అసలు తట్టుకోలేకపోయాడు. అతడిని పిలిచి.. మీ కులంలో రిక్షా తొక్కుకునేవాడికి మీ అమ్మాయిని ఇస్తావా అంటే లేదని చెప్పాడు. చక్కగా సెటిల్ అయినా ఎస్సీ అబ్బాయికి ఇస్తావా అంటే ఇస్తాను అని చెప్పాడు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మారుతీ రావు చేసిన ఘోరం అందరికీ తెలిసిపోయింది. కుమార్తె కూడా దూరం కావడంతో అతనిలో అపరాధ భావం పెరిగిపోయింది. చివరికి బలవంతంగా చనిపోయాడు. ఈ కేసు నుంచి నేను చాలా నేర్చుకున్నానని” రంగనాథ్ వివరించాడు.
ఈ కేసును డీల్ చేసేటప్పుడు రంగనాథ్ మీడియాకు ఏమాత్రం లీకులు ఇవ్వలేదు.. చాలా జాగ్రత్తగా విచారణ సాగించారు. ఈ కేసు విచారణను అత్యంత గోప్యంగా చేయడమే కాకుండా.. ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా రంగనాథ్ వ్యవహరించారు.
వీడియో కోసం క్లిక్ చేయండి