spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ఏపీలో గ్రామ సచివాలయాలు గోవిందా?

ఏపీలో గ్రామ సచివాలయాలు గోవిందా?

HC suspended G.O no 2ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం విచిత్రమైన జీవోలు జారీ చేస్తోంది. అధికారులను వేధింపులకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తోంది. గ్రామ సర్పంచ్, కార్యదర్శుల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.2ను హైకోర్టు సస్పెండ్ చేసింది. రాజ్యాంగబద్దంగా సర్పంచులు, కార్యదర్శులకు ఉన్న అధికారాలను వీఆర్వోలకు అప్పగించడం ఏమిటని హైకోర్టు ప్రశ్నించింది.

గుంటూరు జిల్లా తోకలవారిపాలం సర్పంచ్ తమ అధికారాలు లాగేసుకుంటున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు జీవోను సస్పెండ్ చేసింది. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పాలనా సంస్కరణలు పెద్ద ఎత్తున మార్పులు చేపట్టింది. గ్రామాల్లో సచివాలయాలు ఏర్పాటు చేసింది.

గ్రామపంచాయతీ కార్యాలయాలు, సర్పంచుల వ్యవస్థ పని చేస్తున్నప్పటికి గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేసింది. వీరి అధికారాలను వీఆర్వోలకు బదిలీ చేస్తూ ఈ ఏడాది మార్చి 25న జీవో 2ను జారీ చేసింది. దీంతో సర్పంచ్ కంటే వీఆర్వోకే ఎక్కువ అధికారాలుంటాయి. రాజ్యాంగంలోని 73వ సవరణకు ఏపీ పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా ఉందన్న విశ్లేషణలు మొదటి నుంచి వస్తోంది. దీంతో గ్రామసచివాలయాలు ఉండవనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేందుకే గ్రామసచివాలయాలు వీఆర్వో వ్యవస్థ తీసుకొచ్చారు. సర్పంచ్, కార్యదర్శుల అధికారాలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదించినా ప్రయోజనం లేకుండా పోతోంది. వీఆర్వోలకు అధికారాలు అప్పగించడంపై అందరిలో వ్యతిరేకత వస్తోంది. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల అధికారాలు లాగేసుకోవడమేమిటని హైకోర్టు అభిప్రాయపడింది.

స్టేట్ కు ముఖ్యమంత్రి ఎలాగో పంచాయతీలకు సర్పంచ్ కూడా అదే విధంగా అదిపతి అని హైకోర్టు పేర్కొంది. హైకోర్టు నిర్ణయంతో గ్రామ సచివాలయాల వ్యవస్థపై ప్రభావం పడే సూననలు కనిపిస్తున్నాయి. పంచాయతీలకే అన్ని అధికారాలు ఉన్నా వీఆర్వోలకు అప్పగించడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని సూచిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తీసుకుంటున్ననిర్ణయాలు ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ఉంటున్నాయి. అధికారులను సైతం ఇబ్బందులకు గురి చేసేలా జీవోలు తీసుకురావడం వెనుక ఆంతర్యమేమిటో అర్తం కావడం లేదని ఉద్యోగులు చెబుతున్నారు. సర్పంచ్ అధికారాలను తొక్కి పట్టడం అంటే గ్రామ వ్యవస్థ అతలాకుతలం అయ్యే వీలుంటుంది. దీనిపై ప్రభుత్వం సమగ్రంగా ఆలోచించి జీవో నెం.2ను మార్చాలని సూచిస్తున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Related News

Most Popular

SIR Voter List

special intensive revision : రేపే లాస్ట్.. నిర్లక్ష్యం చేస్తే లైఫ్ లాంగ్ సఫర్ అవుతారు..

special intensive revision : ఓటర్ల జాబితా సక్రమంగా చేసేందుకు నిర్వహించే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం ఆంధ్రప్రదేశ్లో చివరి దశకు వచ్చింది. గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న ఈ ప్రక్రియ...
Demolished The Nagalamma Temple

temple pradakshina : దేవాలయాల్లో ప్రదక్షిణలు ఎందుకు.. ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేయాలి..

temple pradakshina : చాలామంది దేవాలయాల్లోకి వెళ్లిన తర్వాత కొందరు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. వీరిలో మూడు, 5, 9 సార్లు ప్రదక్షిణలు చేసేవారు ఉంటారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి...
Vaibhav Suryavanshi 94 Runs

Vaibhav Suryavanshi : రికార్డు లెవెల్ లో 50 కొట్టినా.. బుడ్డోడిని ఏడిపించారు.. ఇదేం న్యాయం..

Vaibhav Suryavanshi : వరుసగా ఆరు ఓటముల తర్వాత టీమ్ ఇండియా మళ్లీ విక్టరీ ట్రాక్ ఎక్కింది.. జింబాబ్వే జట్టుతో జరుగుతున్న మూడు టి20 మ్యాచ్ సిరీస్ లో.. తొలి మ్యాచ్లో విజయం...
Men's Mental Health

men’s health : మగవాళ్లు చెప్పుకోలేని ఐదు సమస్యలున్నాయి.. అవేంటో తెలుసా..

men's health : ‘నువ్వు మగాడివి బాస్.. ధైర్యంగా ఉండాలి.. కుటుంబానికి అండగా ఉండాలి..’అని చాలా మంది చెబుతూ ఉంటారు. ఒక కుటుంబంలో ఎవరికి సమస్య వచ్చినా వాటి పరిష్కారానికి తీవ్ర కృషి...

body fat : కొవ్వుతో మెదడుపై ప్రభావం.. ఎలాగో తెలిస్తే షాక్ అవుతారు..

body fat : ప్రస్తుత కాలంలో చాలామంది రకరకాల ఆహారాన్ని తింటూ ఉన్నారు. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉండే ఫుడ్ తో పాటు ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల శరీరంలో అదనపు...
Oktelugu Epaper