Homeక్రైమ్‌Disha Salian: ఓ అమ్మాయి మరణం.. మాజీ ముఖ్యమంత్రి.. తన కొడుకు.. మాజీ మంత్రి.. హోం...

Disha Salian: ఓ అమ్మాయి మరణం.. మాజీ ముఖ్యమంత్రి.. తన కొడుకు.. మాజీ మంత్రి.. హోం మంత్రి నిందితులు.. ఏంటా కథ

Disha Salian: ఓ అమ్మాయి చనిపోయింది. అది కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ కేసులో ఆశ్చర్యకరంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఆయన కొడుకు.. ఓ మాజీ మంత్రి.. మాజీ హోం మంత్రి.. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఏమిటి ఆ కథ.. చాలా డీటెయిల్ గా ఇందులోకి వెళ్దాం.. బాల్ థాకరే కుటుంబం ఎలా అయిపోయింది మహారాష్ట్రలో.. ముంబై పేరు చెప్తే చాలామందికి దేశ ఆర్థిక రాజధాని గుర్తుకొస్తుంది. ముంబై నగరంలో […]

Disha Salian: ఓ అమ్మాయి చనిపోయింది. అది కాస్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆ కేసులో ఆశ్చర్యకరంగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. ఆయన కొడుకు.. ఓ మాజీ మంత్రి.. మాజీ హోం మంత్రి.. ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇంతకీ ఎవరా అమ్మాయి.. ఏమిటి ఆ కథ.. చాలా డీటెయిల్ గా ఇందులోకి వెళ్దాం..

బాల్ థాకరే కుటుంబం ఎలా అయిపోయింది

మహారాష్ట్రలో.. ముంబై పేరు చెప్తే చాలామందికి దేశ ఆర్థిక రాజధాని గుర్తుకొస్తుంది. ముంబై నగరంలో శివసేన పేరు చెబితే హిందువులకు రక్తం మరుగుతుంది.. అలా మరగడానికి కారణమైన ఆ వ్యక్తి పేరు బాల్ థాకరే. మహారాష్ట్ర పులి మాదిరిగా భావిస్తూ ఉంటారు. ఆయన ఇమేజ్ ఒక రేంజ్ లో ఉండేది. ప్యూర్ మాస్ లీడర్.. తన పత్రిక సామ్నాలో రాసే వాక్యాలు నిప్పు కణికలాగా ఉండేవి. ఒక రకంగా బాల్ థాకరే ను నేటి కాలంలో మహారాష్ట్ర ప్రాంతంలో పుట్టిన మరాఠా యోధుడు శివాజీ అని చాలామంది కొనియాడేవారు. దేశ ప్రధానులను.. ముఖ్యమంత్రులను తన నివాసానికి పిలిపించుకున్న ఘనత బాల్ థాకరే ది. అటువంటి బాల్ థాకరే కడుపులో పుట్టిన వ్యక్తి పేరు ఉద్ధవ్ థాకరే. కానీ తండ్రి లాగా ఇతను పులి కాదు. పూర్తిగా పిరికి క్యారెక్టర్. పైగా అసమర్థుడు. మోసం.. ఆశావాదాన్ని నింపుకున్న వ్యక్తి. ఇక ఈయన కుమారుడు ఆదిత్య అయితే మరింత దిగజారుడు వ్యక్తిత్వం ఉన్న వాడు. చివరికి ఒక అమ్మాయి పై జరిగిన దారుణంలో ఇతడు పూర్తిగా కూరుకుపోయాడు. పాపం ఎంతటి బాల్ థాకరే కుటుంబం ఎలా అయిపోయింది..

అనుమానాస్పద స్థితిలో చనిపోయింది

మహారాష్ట్రలో దిశా సాలియన్ అనే ఒక అమ్మాయి అత్యంత అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. ఈమె బాలీవుడ్ లో సినిమా తారలతో కలిసి టాలెంట్ మేనేజర్ గా పని చేసేది. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కు కొద్దిరోజుల పాటు మేనేజర్ గా పనిచేసింది. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం జూన్ 8 నగరంలోని మలాడ్ అనే ప్రాంతంలో ఎత్తైన భవనం నుంచి దూకి చనిపోయింది . ఈమె చనిపోయిన ఆరు రోజులకే జూన్ 14న సుశాంత్ సింగ్ బాంద్రా ప్రాంతంలో తన నివాసంలో కన్నుమూశాడు. బాలీవుడ్ సినిమా రంగానికి చెందిన వీరిద్దరూ కేవలం ఆరు రోజుల వ్యవధిలోనే చనిపోవడం నిజంగా అనేక అనుమానాలకు కారణమైంది. వాస్తవానికి అయితే ఈ మరణాల కథ ఇక్కడితోనే ఆగిపోవాలి. అయితే సరిగ్గా ఆరు సంవత్సరాల తర్వాత ఈ మరణాల మీద అలజడి మొదలైంది. సిబిఐ రంగంలోకి దిగింది. ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.

ఇంతకీ దిశ ఎవరు

చనిపోయిన సమయం నాటికి దిశా వయసు 28 సంవత్సరాలు. బాలీవుడ్ లో టాలెంట్ మేనేజర్ గా పని చేస్తున్న ఈమెకు సినిమా పరిశ్రమలో విస్తృతంగా పరిచయాలు ఉన్నాయి. సుశాంత్ తో కూడా ఈమె కలిసి పనిచేయడం విశేషం. దిశా చనిపోయినప్పుడు పోలీసులు దీనిని ప్రమాదకరమైన మరణంగా కేసు నమోదు చేశారు. ఆ తర్వాత దర్యాప్తు మొదలైంది. దిశా ఆత్మహత్య చేసుకుందాన్ని పోలీసులు ఒక క్లారిటీ కి వచ్చారు. అయితే తన కూతురు చనిపోయేంత పిరికిది కాదని దిశ తండ్రి సతీష్ సాలియన్ అభిప్రాయం. పైగా తన కూతురు ఆత్మహత్యను ఆయన అసలు ఒప్పుకోలేదు..” నా కూతురు పెరిగేది కాదు. ఆమెలో ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. పైగా తను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యంగా నిలబడింది. ఇప్పుడు బాలీవుడ్లో మేనేజర్ గా పని చేస్తోంది. అటువంటి ఆమెకు చనిపోవాల్సిన అవసరం లేదు. తనమీద ఎవరో అత్యాచారం చేశారు. ఆ తర్వాత ఆమెను చంపేశారు” పోలీసులతో చెప్పాడు. ఆయన చెప్పిన వివరాలు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు ఆ తర్వాత కేసు మరో రూపు దాల్చింది. మహారాష్ట్రలో వ్యవస్థ మొత్తం ఒక్క తాటి మీదికి వచ్చి.. కదిలింది.

రాజకీయాలలో పేలుడు పదార్ధంగా

ఇక ఈ కేసులో ఆదిత్య ఠాక్రే.. డీనో మోరియా.. సూరజ్ పంచోలి.. రియా చక్రవర్తి.. ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్.. సచిన్ వాజే వంటి వారి పేర్లు ఇందులో నమోదయ్యాయి. ఆ తర్వాత ఈ కేసు క్రమేపి పొలిటికల్ రంగు పూసుకుంది.. ఆదిత్య ఠాక్రే మామూలు వ్యక్తి కాదు. ఈయన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వద్ద కుమారుడు. అయితే తాజాగా పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో వీరిద్దరి పేర్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసును పోలీసులు మరింత లోతుగా తవ్వితే ఉద్ధవ్ పాత్ర బయటపడుతుంది. కాకపోతే ఇప్పటికే ఈ కేసు మహారాష్ట్రలో కీలకంగా మారింది.. ఒకరకంగా అక్కడి రాజకీయాలలో పేలుడు పదార్ధంగా రూపొందిన చెందింది.

ఆ విషయాలు దిశకు తెలుసా

ముంబై మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆదిత్య కు సంబంధించిన కొన్ని విషయాలు దిశకు తెలుసని సమాచారం. వాటి సంబంధించిన ఆధారాలను ఆమె సుశాంత్ కు ఇచ్చిందని తెలుస్తోంది. మన వైపు ఇదే విషయాన్ని దిశా తండ్రి తరఫున న్యాయవాదిగా వాదిస్తున్న నీలేష్ చెబుతున్నారు . ..” దిశ దగ్గర ఉన్న సమాచారం కొంతమందికి చేరిందని ఆదిత్యకు తెలిసింది. ఆ తర్వాత దిశ చనిపోయింది. సరిగ్గా ఆరు రోజుల తర్వాత సుశాంత్ కూడా కన్నుమూశాడు. ఈ వ్యవహారంలో దిశకు ఏం తెలుసు.. ఆదిత్య ఏమైనా చీకటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడా.. అతని ఆధారాలు దిశ వద్ద ఏమున్నాయి.. ఒకవేళ దిశ ఆ ఆధారాలను సుశాంత్ అందించిందా.. సుశాంత్ దగ్గర ఆ సమాచారం ఉంటే తనకు ఇబ్బంది అని ఆదిత్య భావించాడా.. అందువల్లే దిశ చనిపోయిందా..” అనే విషయాలను తేల్చాల్సి ఉందని నీలేష్ చెబుతున్నాడు.

ఆరు రోజుల వ్యవధిలో..

జూన్ 8న దిశ చనిపోయింది. సుశాంత్ జూన్ 14న కన్నుమూశాడు. ఆరు రోజుల వ్యవధిలో ఇద్దరు బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు సంబంధించిన వారు చనిపోవడం నిజంగానే సంచలనంగా మారింది. అయితే మొదట్లో ముంబై పోలీసులు ఈ రెండు మరణాల మధ్య ఏమి లేదని ప్రకటించారు. ఆ తర్వాత సుశాంత్ కేసులో సిబిఐ ఎంట్రీ అయింది. దర్యాప్తు మొదలుపెట్టింది. 2025 మార్చి వరకు ఈ కేసులో ఎటువంటి అనుమానించే విషయం లేదని సిబిఐ న్యాయస్థానానికి క్లోజ్ రిపోర్ట్ చేసింది. అంతేకాదు సుశాంత్ మరణాన్ని ఆత్మహత్యగా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ దిశ కేసులో సుశాంత్ పేరు వినిపించడం విధంగా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందువల్లే సరిగా ఆరు సంవత్సరాల గ్యాప్ తర్వాత కూడా ఈ కేసు తెరపైకి వచ్చింది. మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఏదైనా కుట్ర జరిగిందా..

ఈ కేసులో తన కుమారుడిని కాపాడడానికి.. మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఏమైనా కుట్ర చేశారా.. ఆధారాలను మాయం చేశారా.. దర్యాప్తును ప్రభావితం చేశారా.. అనే అంశాలపై సిబిఐ విచారణ నిర్వహించే అవకాశం ఉంది.. అయితే బాంబే కోర్టు ఈ విషయంలో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక యువతి చనిపోవడాన్ని పక్కన పెడితే.. ఆమె మరణం తర్వాత ఎందుకిలా జరిగింది.. అనే ప్రశ్న వ్యక్తం అవుతుంది.. ఆరు సంవత్సరాల తర్వాత కూడా ఇప్పటివరకు ఒక ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం కలవరపరుస్తూ ఉందని వ్యాఖ్యానించింది.. గతంలో ముంబై పోలీసులు.. సిబిఐ అధికారులు దిశా మరణం పై సమాచారాలపాటు దర్యాప్తు చేశారు. అయితే అనుమానాస్పద ఆధారాలను సంపాదించడంలో పోలీసులు ఎందుకు ఎఫైర్ నమోదు చేయలేదు.. అనే దానిపై కోర్టు ప్రశ్నలు వ్యక్తం చేసింది. అందుకే ఈ కేసును మళ్ళీ సిబిఐ కి అప్పగిస్తూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పుడేం జరుగుతుంది..

సాధారణంగా ముంబైలో బాలీవుడ్ అంటేనే రకరకాల శక్తులు ఉంటాయి. మాఫియాలు.. ఇతర అసాంఘిక శక్తులు.. నేరసామ్రాజ్యం.. రాజకీయ నాయకులు.. వారంతా కలిసిపోయి ఒక రకమైన సమాంతర వ్యవస్థను కొనసాగిస్తుంటారు. ఇటువంటి పంకిలంలోకి ఏకంగా ఒక మాజీ సీఎం.. ఆయన కుమారుడు.. మాజీ హోంమంత్రి.. పోలీస్ కమిషనర్ పేర్లు రావడం.. నిజంగానే దేశవ్యాప్తంగా సంచలనం కలిగిస్తోంది. అయితే సిబిఐ ఈ స్టోరీకి జస్టిఫికేషన్ ఇస్తుందా.. అనేది చూడాలి. కానీ ముంబై కోర్ట్ ఈ విషయాన్ని అంత సులువుగా వదిలిపెట్టేలాగా కనిపించలేదు. ఈ మొత్తం స్టోరీలో అసలైన దారుణం ఏంటంటే.. తాను బతికి ఉన్నప్పుడు ముంబైలో మాఫియా మీద ఉక్కు పాదం మోపి తిరుగులేని మరాఠయోధుడు లాగా పేరు తెచ్చుకున్నాడు బాల్ థాకరే. కానీ ఆయన మనవడు ఇప్పుడు అదే మాఫియా తో అంట కాగిన కేసులో ఇరుక్కున్నాడు. ఇంతకంటే దారుణం.. ఘోరం శివసేనకు మరొకటి ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper