Homeబిజినెస్Hero Glamour X 125లో ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్.. ధర రూ.1.01 లక్షలు

Hero Glamour X 125లో ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్.. ధర రూ.1.01 లక్షలు

Hero Glamour X 125 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన గ్లామర్ X 125 మోడల్‌లో కొత్త భద్రతా ఫీచర్‌ను తీసుకొచ్చింది. సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)ను కలిపిన కొత్త గ్లామర్ X 125ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ ధర రూ.1.01 లక్షలుగా నిర్ణయించింది. 125సీసీ విభాగంలో తొలిసారిగా.. హీరో మోటోకార్ప్‌ ప్రకారం.. 125సీసీ విభాగంలో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో […]

Hero Glamour X 125 : ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్‌ తన గ్లామర్ X 125 మోడల్‌లో కొత్త భద్రతా ఫీచర్‌ను తీసుకొచ్చింది. సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్ (IBS)ను కలిపిన కొత్త గ్లామర్ X 125ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కొత్త వేరియంట్‌ ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ ధర రూ.1.01 లక్షలుగా నిర్ణయించింది.

125సీసీ విభాగంలో తొలిసారిగా..

హీరో మోటోకార్ప్‌ ప్రకారం.. 125సీసీ విభాగంలో సింగిల్-ఛానల్ ఏబీఎస్‌తో ఇంటిగ్రేటెడ్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కలిపిన తొలి మోటార్‌సైకిల్ ఇదే. అత్యవసర సమయంలో ముందు చక్రం లాక్‌ కాకుండా ఏబీఎస్‌ పనిచేస్తుంది. అదే సమయంలో ముందు, వెనుక బ్రేక్‌లను అనుసంధానించడం ద్వారా ఐబీఎస్‌ మెరుగైన బ్రేకింగ్ పనితీరును అందిస్తుంది. ఇప్పటికే గ్లామర్ X 125లో అందిస్తున్న పానిక్ బ్రేక్ అలర్ట్, హజార్డ్ ల్యాంప్స్ వంటి భద్రతా ఫీచర్లు కొత్త ఏబీఎస్‌ వేరియంట్‌లోనూ కొనసాగుతాయి.

124.7సీసీ ఇంజిన్..

హీరో గ్లామర్ X 125లో 124.7సీసీ, సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది గరిష్ఠంగా 11.4 బీహెచ్‌పీ పవర్‌ను 8,250 ఆర్‌పీఎం వద్ద, 10.5 ఎన్ఎం టార్క్‌ను 6,500 ఆర్‌పీఎం వద్ద ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్‌లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. వీటిని బట్టి థ్రాటిల్ స్పందనలో మార్పులు ఉంటాయి. అంతేకాకుండా 125సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో ప్రత్యేకంగా నిలిచేలా క్రూయిజ్ కంట్రోల్ను కూడా ఇందులో అందించారు.

ఫీచర్లకు కొదవ లేదు..

గ్లామర్ X 125లో ఆధునిక ఫీచర్లకు ప్రాధాన్యం ఇచ్చారు. ఇందులో కలర్ TFT ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉంటుంది. బ్లూటూత్ కనెక్టివిటీ ద్వారా స్మార్ట్‌ఫోన్‌ను బైక్‌కు అనుసంధానించుకోవచ్చు. అలాగే టర్న్-బై-టర్న్ నావిగేషన్, కాల్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ వంటి సదుపాయాలు ఉన్నాయి.ఇక పూర్తి ఎల్ఈడీ లైటింగ్, యూఎస్‌బీ టైప్-C ఛార్జింగ్ పోర్ట్, సీటు కింద రెండు మొబైల్ ఫోన్లను ఉంచుకునే స్టోరేజ్‌ కూడా అందించారు.

నాలుగు రంగుల్లో..

కొత్త హీరో గ్లామర్ X 125 ఏబీఎస్‌ వేరియంట్‌ను నాలుగు రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. అవి  గన్ మెటల్ గ్రే, మ్యాట్ యాక్సిస్ గ్రే, బ్లాక్ పెర్ల్ రెడ్, బ్లాక్ టీల్ బ్లూ, భద్రతకు మరింత ప్రాధాన్యం.. ఈ సందర్భంగా హీరో మోటోకార్ప్‌ ఇండియా బిజినెస్ యూనిట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ ఆశుతోష్ వర్మ మాట్లాడుతూ.. 125సీసీ విభాగంలో వినియోగదారుల అంచనాలు వేగంగా మారుతున్నాయని తెలిపారు. ఆధునిక డిజైన్, సాంకేతికతతో పాటు భద్రతకు కూడా వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు.

గ్లామర్ X ఇప్పటికే రైడ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్ వంటి విభాగంలో తొలిసారిగా అందించిన ఫీచర్లతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుందని, ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఏబీఎస్‌ను తీసుకురావడం ద్వారా 125సీసీ విభాగంలో భద్రతా ప్రమాణాలను మరింత పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు.

మొత్తంగా  రూ.1.01 లక్షల ధరతో వచ్చిన హీరో గ్లామర్ X 125 ఏబీఎస్‌.. ఆధునిక ఫీచర్లు, రైడింగ్ మోడ్‌లు, క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అదనపు బ్రేకింగ్ భద్రతను కోరుకునే వినియోగదారులను ఆకట్టుకునేలా ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper