TVK Party Vijay : తమిళనాడులో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి తమిళ సుప్రసిద్ధ నటుడు తమిళనాడు రాజకీయాలను శాసించే పరిస్థితి కనిపిస్తోంది. ఆయన ఏర్పాటు చేసిన టీవీకే కు అక్కడి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మధురై నుంచి మొదలు పెడితే చెన్నై వరకు ఆయన నిర్వహించిన సభలకు భారీగా జనం వచ్చారు. దీంతో అక్కడ అధికార పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. దీనికి తోడు వారంతా కూడా విజయ్ పార్టీ మీద విమర్శలు చేయడం మొదలుపెట్టారు. ఇది ఇలా ఉండగానే కరూర్ ఘటన జరిగింది. దీంతో విజయ్ మీద అధికార పార్టీ విమర్శలు చేయడం మొదలుపెట్టింది. రాజకీయంగా తొక్కే ప్రయత్నాన్ని విజయవంతంగా చేసింది.
ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది అనే సిద్ధాంతాన్ని నమ్మిన విజయ్.. తనమీద జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్నారు. కరూర్ ఘటనలో తన ప్రమేయం లేకపోయినప్పటికీ ఇబ్బంది పెడుతున్నారని.. పార్టీని అనవసరంగా విమర్శిస్తున్నారని అతడేకంగా సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. దీంతో సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.. కరూర్ ఘటనపై తమిళనాడు ప్రభుత్వంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని తప్పు పట్టింది. ఇదంతా కూడా రాజకీయ కక్షతో చేస్తున్నారని ప్రశ్నించింది. కరూర్ ఘటనపై నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలని కేంద్ర దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ వ్యవహారం మొత్తాన్ని కూడా సిబిఐ మాత్రమే చేయాలని సోమవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో టీవీకే పార్టీ అధినేత విజయ్ కి కాస్త ఉపశమనం లభించింది.
గత నెల 27న కరూర్ ప్రాంతంలో తమిళ వెట్రి కట్చి అధినేత విజయ్ కరూర్ ప్రాంతంలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్ పెట్టారు. ఈ మీటింగ్ కు భారీగా జనం వచ్చారు. ఆ సమయంలో తొక్కిసలాట జరిగింది. ఆ ప్రమాదంలో 41 మంది చనిపోయారు. ఇంతమంది చనిపోయిన నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించింది. తమిళనాడు అధికారులు దర్యాప్తు చేయడం పట్ల విజయ్, ఇతర నేతలు అభ్యంతర వ్యక్తం చేశారు. ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ మహేశ్వరి, జస్టిస్ ఆంజరియా తో కూడిన ధర్మసనం తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పింది. విజయ్ కోరినట్టుగానే సిబిఐతో ఈ కేసును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటివరకు ఈ కేసులో తమిళనాడు రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం సేకరించిన ఆధారాలను సిబిఐ కి అప్పగించాలని పేర్కొంది.. ఈ ఘటనలో నిజాలను వెలికి తీసి.. ప్రజల ముందు ఉంచాలని.. సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సుప్రీంకోర్టు దాకా ఈ కేసును తీసుకువెళ్లడంలో టీ వీ కే కార్యదర్శి బుస్సి ఆనంద్ కీలక పాత్ర పోషించారు. ఆయన విజయ్ కి నమ్మినబంటు లాగా ఉన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతమవుతున్నారు. ఆయన సీనియర్ రాజకీయ నాయకుడు కావడంతో.. రాజకీయ అనుభవాన్ని ఉపయోగించుకుంటూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ఇంతటి కష్టకాలంలో విజయ్ అంతటి ధైర్యంతో ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఆనంద్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. సుప్రీంకోర్టు టీవీ కేకు అనుకూలంగా తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆనంద్ హర్షం వ్యక్తం చేశారు. త్వరలోనే నిజం బయటపడుతుందని.. డీఎంకే పార్టీ చేసిన దారుణం వెలుగులోకి వస్తుందని ఆనంద్ ఆశాభావం వ్యక్తం చేశారు.