Aadarsa Kutumbam: విక్టరీ వెంకటేష్ , త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం కోసం అటు అభిమానులు , ఇటు ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మల్లీశ్వరి , నువ్వు నాకు నచ్చావ్ వంటి కల్ట్ క్లాసిక్ చిత్రాల తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఇది. అంచనాలు ఉండడం సహజమే. ఆ అంచనాలకు తగ్గట్టుగా టీజర్ , రీసెంట్ గా విడుదల చేసిన నారాయనమ్మ సాంగ్ అదిరిపోవడం తో, ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే నమ్మకం బయ్యర్స్ లో కూడా ఏర్పడింది. అందుకే ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ కూడా మంచి ఫ్యాన్సీ రేట్ కి అమ్ముడుపోయింది.
కానీ ఇప్పుడు సోషల్ మీడియా లో వినిపిస్తున్న ఒక లేటెస్ట్ వార్త, అభిమానుల్లో తీవ్రమైన అసహనాన్ని రేపుతోంది. ఇలా అయితే ముందు ఒప్పుకున్న డబ్బులను ఇవ్వమని అంటున్నారు బయ్యర్స్. అసలు విషయం లోకి వెళ్తే అక్టోబర్ 2 న విడుదల అవ్వాల్సిన ఈ సినిమాని అక్టోబర్ 9 కి వాయిదా వేశారు. ఇప్పుడు అక్టోబర్ 9 న కూడా రావడం లేదట. అక్టోబర్ 30 న విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మూడు రోజుల క్రితమే ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ , ఎట్టి పరిస్థితిలోనూ అక్టోబర్ 9 న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము అంటూ ఒక ట్వీట్ వేశాడు. కానీ ఇంతలోపే వాయిదా పడింది అనే న్యూస్ రావడం తో , నాగవంశీ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు వెంకీ ఫ్యాన్స్. సినిమా విడుదల అవ్వదు అని తెలిసినప్పుడు , ఎందుకు అభిమానులకు ఇలాంటి భరోసా ఇవ్వడం , ఇప్పటికే వెంకటేష్ ఎట్టి పరిస్థితుల్లో ఈ చిత్రాన్ని అక్టోబర్ 9 న విడుదల చెయ్యాలంటూ త్రివిక్రమ్ కి చెప్పి లండన్ కి వెళ్లాడని , కానీ త్రివిక్రమ్ వెంకటేష్ ని నిరాశపరిచాడంటూ అభిమానులు మండిపడుతున్నారు.
ముఖ్యంగా నాగవంశీ కనిపిస్తే కొట్టే రేంజ్ కోపం లో ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే ఇప్పటి వరకు నాగవంశీ తన సినిమాలను చెప్పిన తేదికి విడుదల చేసినట్టు చరిత్రలో లేదు. ఇంత గట్టిగా చెప్తున్నాడు అంటే , కచ్చితంగా ‘ఆదర్శ కుటుంబం’ వాయిదా పడుద్ది అని నాగవంశీ గురించి అవగాహన ఉన్నోళ్లు ఇది వరకే సోషల్ మీడియా లో చెప్తూ వచ్చారు. కానీ వెంకటేష్ ఫ్యాన్స్ పెద్దగా పట్టించుకోలేదు , ఇప్పుడు బాధపడుతున్నారు. కనీసం అక్టోబర్ 30 న అయినా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందో లేదో స్పష్టమైన క్లారిటీ ఇప్పటికీ ఇవ్వలేదు మేకర్స్. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.