spot_img
Homeజాతీయ వార్తలుRevanth Reddy: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.. రేవంత్‌ సంచలన అడుగులు!

Revanth Reddy: కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థులపై క్లారిటీ.. రేవంత్‌ సంచలన అడుగులు!

Revanth Reddy: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో మంచి ఊపు మీద ఉన్న కాంగ్రెస్‌.. రెండు మూడు నెలల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలకు రెడీ అవుతోంది. అసెంబ్లీ ఎన్నికల జోష్‌ను లోక్‌సభ ఎన్నికల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. రెండంకెల ఎంపీ సీట్లు గెలవాలని భావిస్తోంది. ఈ క్రమంలో బలమైన అభ్యర్థులను బరిలో నింపేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి కూడా ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తోంది. లోక్‌సభ బరిలో నిలిపే వారిలో ఇతర పార్టీల నేతులు కూడా ఉన్నట్లు సమాచారం. వారితో సంప్రదింపులు పూర్తయ్యాయని, చేరిక మాత్రమే మిగిలిందని ప్రచారం జరుగుతోంది.

4న సన్నాహక సమావేశం..
ఇదిలా ఉండగా జనవరి 4న కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటు ఎన్నికల సన్నాహక కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగనుంది. ఈ సమావేశంలో తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను అధిష్టానానికి సమర్పించే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల కోసం ఇప్పటికే ఆయా పార్లమెంటు నియోజకవర్గాలకు రేవంత్‌ పలువురు మంత్రులను ఇన్‌చార్జీలుగా నియమించారు. త్వరలో ఏఐసీసీ, టీపీసీసీ నేతలకు బాధ్యతలు అప్పగించనున్నారు.

బలాబలాలపై సమీక్ష..
మరోవైపు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం, పార్టీ ఓడిపోయిన చోట్ల వచ్చిన ఓట్ల శాతాన్ని బేరీజు వేస్తున్నట్టు తెలిసింది. ఎక్కడెక్కడ కాంగ్రెస్‌కు ఓట్ల శాతం తక్కువగా వచ్చిందో, అక్కడక్కడ ఓట్ల శాతాన్ని ఎలా పెంచుకోవాలనే దానిపై పార్టీ తీవ్ర కరసత్తు చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని నాయకులకు ఎంపీ సీట్లు ఇస్తామనీ, కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులిస్తామనీ, ఎమ్మెల్సీ పదవులిస్తామంటూ పార్టీ హామీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆశావహులు కూడా రంగంలోకి దిగుతున్నారు. అటువంటి నాయకులను ఎట్లా సర్దుబాటు చేయాలనే అంశాన్ని కూడా త్వరలో చర్చించే అవకాశం ఉంది.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper