Guntur Kaaram: త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ బాబు హీరోగా వస్తున్న గుంటూరు కారం సినిమా సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని జనవరి 6వ తేదీన గ్రాండ్ గా నిర్వహించనున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈవెంట్ కి చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నాడనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా రావడం మనం చూశాం. ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. అదే బాటలో ఇప్పుడు కూడా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవిని స్పెషల్ గెస్ట్ గా మహేష్ బాబు ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది.
చిరంజీవికి మహేష్ బాబుకి మధ్య మంచి బాండింగ్ ఉందనే విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే చిరంజీవికి మొదటినుంచి కృష్ణ గారితో అయిన మహేష్ బాబుతో అయిన మంచి సానిహిత్యం ఉంది. అందుకే మహేష్ బాబు పిలవడం తో ఈ ఫంక్షన్ కి చిరంజీవి స్పెషల్ గెస్ట్ గా వస్తున్నట్టుగా తెలుస్తుంది. చిరంజీవి ఈ ఈవెంట్ కి హాజరైతే తనది లక్కీ హ్యాండ్ కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటుందనే అభిప్రాయంలో మహేష్ ఉన్నాడు.
ఇక ఇప్పటివరకు షూటింగ్ మొత్తాన్ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈ సినిమాతో మహేష్ బాబు సక్సెస్ కొట్టి రాజమౌళి డైరెక్షన్ లో వచ్చే పాన్ వరల్డ్ సినిమా షూట్ కి వెళ్లనున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చాలా మంచి అంచనాలైతే పెట్టుకున్నాడు ఇక ఈ సినిమా నుంచి వచ్చిన రెండు సాంగ్స్ ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను పెంచాయి.
ఇక ఈ ఈవెంట్ కి చిరంజీవి వస్తున్నాడనే న్యూస్ కూడా ఇప్పుడు అభిమానుల్లో మంచి అంచనాలను పెంచుతుంది…ఇక ఈ సినిమా సంక్రాంతి రేస్ లో ఉండటమే కాకుండా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇక ఈ సినిమాతో పాటు మరికొన్ని స్టార్ హీరోల సినిమాలు కూడా బరి లోకి దిగుతున్నాయి…