ఆంధ్రప్రదేశ్‌బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

బాబుకు వయసు బెంగ పట్టుకుందట..?

tdp chandrababuవయసు అనేది పాదరసం లాంటిది. మెరుపు వేగంతో పోతూనే ఉంటుంది. దాన్ని పట్టుకోవాలనుకోవడం కాని పని. అలా.. జీవితంలో కొన్ని సాధించలేని పనులు గుర్తుకొచ్చినప్పుడల్లా వయసు కొంత ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. ఆ వయసులో ఉండగానే ఆ పని చేస్తే బాగుండేది అనే అసంతృప్తి వెంటాడుతూనే ఉంటుంది. 70 ఏళ్ల ఏజ్‌లో 25 ఏళ్ల యువకుడిలా పని చేయాలంటే ఎవరికీ సాధ్యపడదు. అందుకే..‘ ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి’ అంటారు. ఏ ‘వయసులో సాధించాల్సిన లక్ష్యాన్ని ఆ వయసులో సాధించాలి’ అని అంటుంటారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల్లో ఆ రందీనే మోపైంది. ముఖ్యంగా ఆ రందీ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పెద్ద ఎత్తున వెంటాడుతోంది.

Also Read: బీజేపీకి వైసీపీ పాహిమాం.. ఎదురించుట లేదు

తెలుగుదేశం పార్టీ స్థాపించి 40 ఏళ్లకు దగ్గరవుతోంది. ప్రస్తుతం చంద్రబాబు వయసు 70 ఏళ్లు. ఇక ఆ పార్టీలో సెకండ్‌ లీడర్‌‌ అంటూ చెప్పుకోదగ్గ వారు ఎవరూ లేరు. అందుకే అధికార పక్షమైన వైసీపీ కూడా ఆయన వయసు మీద ఎప్పటికప్పుడు సెటైర్లు వేస్తూనే ఉంటుంది. ‘తనకు వయసు అయిపోతోందని తొందరగా ఎన్నికలు పెట్టమంటే పెట్టేస్తారా’ అని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అంటున్నారు. జమిలి ఎన్నికలు అంటూ చంద్రబాబు కలవరింతల‌ వెనక వయసు బెంగ కూడా ఉందని హాట్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా చంద్రబాబుతో చెడుగుడు ఆడుతున్నారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన బాబుకు ఎన్నికలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదా అని ఎద్దేవా చేశారు. తాను అనుకున్నపుడ‌ల్లా ఎన్నికలు రావడానికి ఇది చంద్రబాబు రాసిన రాజ్యాంగం కాదనేది గుర్తుపెట్టుకోవాలని హితవు బోధించారు. జగన్ అధికారంలో ఉంటే చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు అని, అందుకే ఎన్నికలు అంటున్నారని బొత్స అభిప్రాయపడ్డారు. మళ్లీ ఎన్నికలకు పోతే ఇప్పుడు వచ్చిన ఆ 23 సీట్లు కూడా రావని, మూడో నాలుగుకో పరిమితం కావాల్సి వస్తుందని జోస్యం చెబుతున్నారు.

Also Read: హీరో కావాల్సిన లోకేష్ పొలిటీషన్ ఎలా అయ్యాడు?

మూడుసార్లు అధికారంలో ఉండిపోయిన చంద్రబాబుకు ఈసారి ప్రతిపక్షంలో ఉండడం మింగుడు పడడం లేదు. సీనియర్ మోస్ట్ లీడర్‌‌ అయిన బాబు ప్రజాస్వామిక పద్ధతులనూ గౌరవించకపోవడం ఏంటని రాజకీయాల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విపక్షంలో ఉంటూ ప్రభుత్వాన్ని నిలదీసి జనాలకు మేలు చేసేలా పనిచేద్దామన్న ధ్యాస బాబుకు ఎందుకు లేదన్నది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. బాబు ఎంత కోరుకున్నా మోడీ తలచుకోకపోతే జమిలి ఎన్నికలు జరగవు. ఒకవేళ తలచుకున్నా 2023 వరకూ ఎన్నికలు ఉండవని ఢిల్లీ నుంచి వినిపిస్తున్న మాట. అంటే చంద్రబాబు ఎంత ఆయాస‌పడినా జమిలి ఎన్నికలకు కూడా మరో నాలుగేళ్లు కచ్చితంగా ప్రతిపక్షంలో ఉండి తీరాల్సిందే. వయసు తనకు భారమనిపిస్తే కుమారుడికో లేక మరో సమర్ధుడికో పార్టీ పగ్గాలు అప్పచెప్పి మానిటరింగ్ చేసుకోవడమే బాబుకు ఉత్తమ మార్గమని విశ్లేషకులు సూచిస్తున్నారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Talliki Vandanam: తల్లికి వందనం: కొద్ది గంటల్లోనే.. రూ.13 వేలు.. పేరు ఉందో లేదో చూసుకోండి!

Talliki Vandanam: ఏపీలో మరో ప్రతిష్టాత్మక పధకం అమలుకు ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. కీలక నిర్ణయం తీసుకుంది. రేపు లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనుంది. తొలి విడత నిధుల విడుదల...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....