Homeఆంధ్రప్రదేశ్‌Priyanka Medico Death: మెడికో మృతి.. చంద్రబాబు, పవన్ సీరియస్ నిర్ణయం

Priyanka Medico Death: మెడికో మృతి.. చంద్రబాబు, పవన్ సీరియస్ నిర్ణయం

Priyanka Medico Death: ఆ అమ్మాయి పేరు ప్రియాంక. తెలంగాణలోని గద్వాల జిల్లా ఐజ ప్రాంతవాసి. చాలా కష్టపడి నీట్ ర్యాంక్ సాధించింది. విజయవంతంగా ఎంబిబిఎస్ పూర్తి చేసి.. పీజీ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజమండ్రిలో వైద్య విద్యకు సంబంధించిన పీజీ కోర్స్ చదువుతోంది. ప్రియాంక ఈనెల 3న తన స్నేహితుడితో కలిసి సినిమా చూసింది. ఆ తర్వాత స్కూటీ పై అతనితో కలిసి తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా థియేటర్ దాటిన తర్వాత […]

Priyanka Medico Death: ఆ అమ్మాయి పేరు ప్రియాంక. తెలంగాణలోని గద్వాల జిల్లా ఐజ ప్రాంతవాసి. చాలా కష్టపడి నీట్ ర్యాంక్ సాధించింది. విజయవంతంగా ఎంబిబిఎస్ పూర్తి చేసి.. పీజీ ర్యాంకు సాధించింది. ప్రస్తుతం రాజమండ్రిలో వైద్య విద్యకు సంబంధించిన పీజీ కోర్స్ చదువుతోంది.

ప్రియాంక ఈనెల 3న తన స్నేహితుడితో కలిసి సినిమా చూసింది. ఆ తర్వాత స్కూటీ పై అతనితో కలిసి తిరుగు ప్రయాణమైంది. ఈ నేపథ్యంలో ఆ సినిమా థియేటర్ దాటిన తర్వాత ఆమె రోడ్డు ప్రమాదానికి గురైంది. కొంతమంది వ్యక్తులు తాగిన మైకంలో కారును వేగంగా నడిపారు. ప్రియాంక కూర్చున్న స్కూటీని గట్టిగా ఢీకొట్టారు. ఏకంగా మూడుసార్లు ఈ దారుణానికి పాల్పడ్డారు. ప్రియాంక తీవ్రంగా గాయపడి.. చికిత్స పొందుతూ కనుమూసింది.

ఈ ఘటన నేపథ్యంలో ప్రియాంక స్నేహితుడు ఉమేష్ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ప్రియాంక తీవ్రంగా గాయపడి.. బ్రెయిన్ డెడ్ అయింది. మూడు రోజులపాటు ఆమె చావుతో పోరాటం సాగించింది. ఆమె శరీరంలో సోడియం స్థాయిలు దారుణంగా పడిపోయాయి. అందువల్లే ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు..

వాస్తవానికి ఇంతటి దారుణం జరిగినప్పటికీ.. పోలీసులు సెక్షన్లు మార్చారా.. కేసు తీవ్రతను తగ్గించారా.. అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మృతురాలు తండ్రి వెంకటేష్ రాజమండ్రి పోలీస్ అధికారులతో మాట్లాడారు. కేసులు పెట్టిన విధానం సక్రమంగా లేదని.. దోషులకు సరైన శిక్ష పడుతుందా.. అనే కోణంలో ప్రశ్నించారు. ప్రియాంకను ఆ వ్యక్తులు కావాలని ఢీకొట్టారని.. ఆమెను చంపడానికి ప్రయత్నించారని వెంకటేష్ చెబుతున్నారు.. ఈ ప్రమాదానికి కారణమైన దశవంత్.. అతని తండ్రి జోసెఫ్ మీద రాజమండ్రి పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. రిమాండ్ కు కూడా పంపించారు. అంతేకాదు, ఈ కేసులో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

ఈ ఘటన మీద ఏపీ సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రియాంక అలా చనిపోవడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి కారణమైన వారంతా జైల్లో ఉన్నారని.. వారికి కఠిన శిక్షలు పడేదాకా ఊరుకునేది లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. మృతురాలి కుటుంబానికి 20 లక్షల ఆర్థిక సహాయాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై విచారణ వ్యక్తం చేశారు. ప్రియాంక కుటుంబానికి సానుభూతి ప్రకటించారు. హోం మంత్రి అంత కూడా ఈ విషయంలో సీరియస్ గా ఉన్నారు. ఘటనకు కారణమైన వారికి కఠిన శిక్షలు పడేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆమె పేర్కొన్నారు. మృతురాలి తండ్రి వెంకటేష్ తో అనిత ఫోన్లో మాట్లాడారు మరోవైపు ఈ ఘటన జరిగిన సినిమా థియేటర్ ప్రాంతంలో.. ప్రియాంక చావు బతుకుల మధ్య ఉన్నప్పుడు సిబ్బంది గేట్లు మూసి వేయడం అనుమానాస్పదంగా కనిపిస్తోంది. మద్యం మత్తు.. విపరీతమైన డ్రైవింగ్.. ఇవన్నీ కూడా ప్రియాంక ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. ఆమె తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper