spot_img
Homeజాతీయ వార్తలుKCR: కేసీఆర్‌పై సీబీఐ?

KCR: కేసీఆర్‌పై సీబీఐ?

KCR: భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు, ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై ఎట్టకేలకు ప్రజాప్రయోజన వ్యాజ్యం హైకోర్టులో దాఖలైంది. మేడిగడ్డ కుంగుబాటుపై సీబీఐ విచారణ జరిపించాలని కాంగ్రెస్‌ నాయకుడు నిరంజన్‌రెడ్డి పిల్‌ వేశారు. అయితే ఇప్పటికే వివరాలు సమర్పించాలని ప్రభుత్వం గత ప్రభుత్వాన్నే ఆదేశించింది. అయితే కొంత మసయం కావాలని అడ్వకేట్‌ జనరల్‌ కోరారు. ఇంతలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. కొత్త కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది.

తాజాగా విచారణ..
తాజాగా మేడిగడ్డ కుంగుబాటుపై మరోమారు హైకోర్టు విచారణ జరిపింది. నివేదిక ఏమైందని ప్రభుత్వాన్ని అడిగింది. ఏం చేద్దామని ప్రశ్నించింది. మళ్లీ రెండు వారాల గడువు ఇచ్చింది. మరోవైపు విచారణకు తాము సిద్ధమని ఇప్పటికే సీబీఐ హైకోర్టుకు తెలిపింది.

రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది?
ఇప్పుడు అందరి దృష్టి కాంగ్రెస్‌ సర్కార్‌పై పడింది. ఇప్పటికే విజిలెన్స్‌ విచారణ చేపించిన సీఎం రేవంత్‌రెడ్డి ప్రాథమిక నివేదిక ఇవ్వాలని కోరింది. ఈమేరకు విజిలెన్స్‌ నివేదిక సిద్ధం చేస్తోంది. అసెంబ్లీ సమావేశాల్లోగా ఈ నివేదిక ప్రభుత్వానికి అందించే అవకాశం ఉంది. ఇందులో మేడిగడ్డలోనే రూ.3,200 కోట్ల అవినీతి జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో కోర్టు నివేదిక కావాలని కోరడంతో ఇప్పుడ రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందన్న ఆసక్తి నెలకొంది. సీబీఐ విచారణకు ఓకే చెబుతుందా.. లేక కేసీఆర్‌తో లాలూచీ పడి వెనుకడుగు వేస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అంగీకరిస్తే సీబీఐ రంగంలోకి దిగుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ తో పోటీ పడాలంటే ఆ హీరో కి ఈ క్వాలిటీ ఉండాలి…

Allu Arjun: 'ఆర్య' సినిమాతో స్టైలిష్ స్టార్ గా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 'పుష్ప' సినిమాతో ఐకాన్ స్టార్ గా అవతరించాడు. ఈ సినిమాతో 1850 కోట్లకు పైన కలెక్షన్స్...
Pakistan Economy

Pakistan Economy: బిచ్చం ఎత్తుకుంటున్న పాకిస్థాన్..

Pakistan Economy: దాయాది పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి దారుణంగా మారింది. బిచ్చం ఎత్తుకొనే స్థాయికి పతనమైంది. ఇంకా ఎక్కడిదాకా వెళ్తుందో తెలియదు.. ఇప్పుడైతే ఆ దేశం పరిస్థితి బాగోలేదు. ఇకపై బాగుపడుతుందనే నమ్మకం...
Jana Nayagan Movie

Jana Nayagan Movie: జన నాయకుడు మూవీ నుంచి తప్పించుకున్న స్టార్ డైరెక్టర్…

Jana Nayagan Movie: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకున్న నటీనటులు చాలామంది ఉన్నారు. అక్కడ హీరోలు ఎంతమంది ఉన్నప్పటికి దళపతి విజయ్ కి ఉన్న క్రేజ్ నెక్స్ట్...
Pink Diamond Conspiracy

Pink Diamond Conspiracy: తేలిపోనున్న ‘పింక్ డైమండ్’ కుట్ర!

Pink Diamond Conspiracy: 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు గట్టి ప్రయత్నాలు చేసింది. 2014 నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకు చేయని ప్రయత్నం అంటూ...
Bhogapuram International Airport

Bhogapuram International Airport: ‘భోగాపురం’లో రెండు గంటల పాటు మోడీ!

Bhogapuram International Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సంబంధించి చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీని ప్రత్యేకంగా ఆహ్వానించారు సీఎం చంద్రబాబు. విభజన హామీల్లో భాగంగా భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయ...
Oktelugu Epaper