Homeజాతీయ వార్తలుMukesh Ambani: అంబానీ తలుచుకున్నాడు.. 1100 కోట్లు చూస్తుండగానే ఖర్చయ్యాయి..

Mukesh Ambani: అంబానీ తలుచుకున్నాడు.. 1100 కోట్లు చూస్తుండగానే ఖర్చయ్యాయి..

Mukesh Ambani: రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవ ఉండదు. అలాగే శ్రీమంతుడు అనుకుంటే పైసలకు కరువు ఉండదు. దీనిని ముఖేష్ అంబానీ మరోసారి నిరూపించాడు. ఇటీవలే తన చిన్న కొడుకు అనంత్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుకను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాడు. తన సొంత రాష్ట్రం గుజరాత్ లోని జాంనగర్ ప్రాంతంలో ఆకాశమంత పందిరి వేసి.. ప్రపంచ వ్యాప్తంగా అతిధులను పిలిచి.. అంగరంగ వైభవంగా జరిపాడు. ముందస్తు పెళ్లి వేడుకే ఆ స్థాయిలో ఉంటే.. ఇక పెళ్లి ఎలా జరుగుతుందో మీ ఊహకే వదిలేస్తున్నా అంటూ ముకేశ్ అంబానీ హింట్ ఇచ్చాడు. అనుకున్నట్టుగానే.. అంతకుమించి అనేలాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాడు..

ముకేశ్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి త్వరలో తన నెచ్చెలి రాధికతో జరగనుంది.. అన్నట్టు రాధిక కుటుంబం కూడా హెల్త్ కేర్ వ్యాపారంలో ఉంది. తన తండ్రి కి సంబంధించిన సంస్థలలో రాధిక కీలక బాధ్యతలు నిర్వహిస్తోంది.. ఈ క్రమంలో అనంత్, రాధిక పెళ్లికి సంబంధించి ఏర్పాటు చేస్తున్న కళ్యాణ మండపం, అంగరంగ వైభవంగా కనిపిస్తోంది. ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న ఓ వీడియో.. అంబానీ రిచ్ నెస్ ను కళ్ళకు కట్టినట్టు చూపిస్తోంది. వేలాది మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేసే ఆ పెళ్లి వేదికను నిర్మించారు. ఆ పెళ్లి వేడుక జరిగే వేదిక నిర్మాణం కోసం ముఖేష్ అంబానీ అక్షరాల 1100 కోట్లు ఖర్చు పెట్టాడట. అంత డబ్బులతో ఐదు ఆర్ ఆర్ ఆర్ సినిమాలు తీయొచ్చు.. ప్రభాస్ తో 8 సలార్ సినిమాలు నిర్మించవచ్చు.

ఇన్ స్టా లో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఆ పెళ్లి వేదిక కళ్ళు చెదిరేలా కనిపిస్తోంది. అద్భుతమైన దీప కాంతులతో మిరమిట్లు గొలుపుతోంది. వేలాది మంది కార్మికులు ఆ కళ్యాణ వేదిక నిర్మాణంలో పాలుపంచుకున్నారు. రిలయన్స్ కంపెనీలలో పని చేసే కీలక ఉద్యోగులు ఆ కళ్యాణ వేదిక నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు. చివరికి పనులు మొత్తం పూర్తయిన తర్వాత ముకేశ్ అంబానీ ఆ కళ్యాణ వేదికను అహరహరం పరిశీలించారు. అయితే ఈ కళ్యాణ వేదిక నిర్మాణానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.. అనంత్ వివాహానికి వచ్చే అతిథుల కోసం కరీంనగర్ నుంచి ప్రత్యేకమైన వెండి పాత్రలను ఆర్డర్ చేశారు.. కళ్యాణ వేదిక మాత్రమే కాకుండా.. పెళ్లికి సంబంధించిన విందు విషయంలోనూ అంబానీ కుటుంబ సభ్యులు వెనక్కి తగ్గడం లేదని తెలుస్తోంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular