Homeఆంధ్రప్రదేశ్‌Duvvada Madhuri : 'బిగ్ బాస్ 9' ఫేమ్ దివ్వెల మాధురి ని ఈడ్చుకెళ్ళిన పోలీసులు.....

Duvvada Madhuri : ‘బిగ్ బాస్ 9’ ఫేమ్ దివ్వెల మాధురి ని ఈడ్చుకెళ్ళిన పోలీసులు.. సంచలనం రేపుతున్న వీడియో..

Duvvada Madhuri : తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి. ఈమె సినీ నటి కాకపోయినా , పాపులర్ వైసీపీ నాయకుడికి ప్రేయసి కావడం తో , ఈమె పేరు సోషల్ మీడియా లో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో మారుమోగిపోయింది. అలా వచ్చిన ఫేమ్ తో ఈమెకు గత ఏడాది ‘బిగ్ బాస్ 9’ లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా హౌస్ లోపలకు అడుగుపెట్టే […]

Duvvada Madhuri : తెలుగు రాష్ట్ర ప్రజలకు పరిచయం అక్కర్లేని పేరు దివ్వెల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి. ఈమె సినీ నటి కాకపోయినా , పాపులర్ వైసీపీ నాయకుడికి ప్రేయసి కావడం తో , ఈమె పేరు సోషల్ మీడియా లో , మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా లో మారుమోగిపోయింది. అలా వచ్చిన ఫేమ్ తో ఈమెకు గత ఏడాది ‘బిగ్ బాస్ 9’ లో వైల్డ్ కార్డు ఎంట్రీ గా హౌస్ లోపలకు అడుగుపెట్టే అవకాశం కలిగింది. హౌస్ లోకి ఎంట్రీ ఇచినప్పటి నుండి , ఎలిమినేట్ అయ్యే వరకు ఒక ఫైర్ బ్రాండ్ గా ఈమె ఇచ్చిన కంటెంట్ వేరే లెవెల్ అనే చెప్పాలి. ఉన్నది తక్కువ రోజులే అయినప్పటికీ, తన మార్క్ ని ఆడియన్స్ లో బలంగా వేయడంలో సక్సెస్ అయ్యింది. బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈమె తన భర్త దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

అయితే నేడు ఆమె పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి , తన భర్త కోసం పోరాటం చేయడం , పోలీసులు ఆమెని ఈడ్చుకొని వెళ్లడం , అందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే గతంలో దువ్వాడ శ్రీనివాస్ ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేసాడు. అందుకు జనసేన పార్టీ కార్యకర్తల నుండి కూడా చాలా బలమైన కౌంటర్ అటాక్ వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయనపై పవన్ కళ్యాణ్ అభిమానులు , మరియు కార్యకర్తలు కేసులు కూడా నమోదు చేశారు. అధికారం లోకి వచ్చిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ కచ్చితంగా పరిణామాలను ఎదురుకోవాల్సి ఉంటుందనే సంకేతాలు బలంగా కనిపించాయి.

అయితే నేడు ఈ కేసు విచారణ నిమిత్తం , దువ్వాడ శ్రీనివాస్ ని పోలీసులు తీసుకెళ్లారు. దీనిపై దివ్వెల మాధురి ఫైర్ అయ్యింది. రాష్ట్రము లో ఎన్నో అన్యాయాలు , హత్యలు , అక్రమాలు జరుగుతున్నాయి , వాళ్ళని ఏమో వదిలేస్తున్నారు , ఎప్పుడో రెండేళ్ల క్రితం నా భర్త పవన్ కళ్యాణ్ ని అన్న మాటలను పట్టుకొని ఇప్పుడు విచారిస్తున్నారు , ఇదెక్కడి న్యాయం అంటూ ఆమె పోలీస్ స్టేషన్ బయట బైఠాయించి ధర్నా చేసింది. ఆమెతో పాటు భారీ ఎత్తున దువ్వాడ శ్రీనివాస్ అనుచరులు పోలీస్ స్టేషన్ వద్దకు రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు ఆమెని ఈడ్చుకొని వెళ్లాల్సి వచ్చింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper