Homeజాతీయ వార్తలుMamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్...

Mamata Banerjee: మమతా బెనర్జీ.. సాటి ఆడదాని కన్నీటిని తుడవలేకపోయింది..ఇప్పుడు ఏడ్చి ఏం లాభం.. భేష్ సుబేందు అధికారి..

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. చివరికి బాధ్యత గల ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దారుణంగా ప్రవర్తించింది. ఘటన జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కూడా తుడిచివేసే ప్రయత్నం చేసింది. నాడు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ మెడికల్ పిజి స్టూడెంట్ తల్లి […]

Mamata Banerjee: సరిగ్గా దుర్గా నవరాత్రులు జరుగుతున్న సమయంలో.. బెంగాల్ రాష్ట్రంలో ఘోరం జరిగింది.. ఒక మెడికల్ పీజీ స్టూడెంట్ మీద దారుణాతీ దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశాన్ని కలవరపాటుకు గురి చేసింది. చివరికి బాధ్యత గల ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సింది పోయి.. దారుణంగా ప్రవర్తించింది. ఘటన జరిగిన ప్రదేశంలో ఆనవాళ్లు కూడా తుడిచివేసే ప్రయత్నం చేసింది. నాడు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ బెంగాల్ రాష్ట్రంలో ఉన్నారు. ఆ మెడికల్ పిజి స్టూడెంట్ తల్లి కన్నీటితో విన్నవించింది. తనకు న్యాయం చేయాలని కోరింది. సాటి ఆడదాని బాధను మమతా బెనర్జీ గుర్తించలేదు. పట్టించుకోలేదు.

ఇప్పుడు మమతా బెనర్జీ కన్నీటి పర్యంతమవుతున్నారు. తాను ఎందుకు చేయలేదా అని బాధపడుతున్నారు. ఎందుకంటే నాడు మెడికల్ పిజి స్టూడెంట్ పై జరిగిన దారుణం కేసులో బిజెపి ఒకే స్టాండ్ తో ఉంది. మమత ఏలుబడిలో ఘోరానికి గురై, చనిపోయిన విద్యార్థినికి న్యాయం చేసేందుకు బిజెపి రంగంలోకి దిగింది. ఇటీవల ఎన్నికల్లో ఆ మెడికల్ పిజి స్టూడెంట్ తల్లి రత్నకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ఎన్నికల్లో రత్న విజయం సాధించింది.

ఇది ఒక తల్లిగా ఆమెకు లభించిన మొదటి సానుకూలత. బెంగాల్ ముఖ్యమంత్రిగా సుభేందు అధికారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత.. ఈ కేసు మీద ఆయన దృష్టి పెట్టారు. అంతేకాదు న్యాయం చేస్తానని రత్నకు హామీ ఇచ్చారు. ఏకంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేశారు. నాటి ఘటన విషయంలో నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఆర్ జి కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఇల్లును నేలమట్ట చేశారు. అంతేకాదు.. ఇది శాంపిల్ మాత్రమేనని.. అసలు సినిమా ముందుందని బెంగాల్ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఆయన చెబుతున్న ఆ మాటలు విని రత్న కన్నీటి పర్యంతమయ్యారు. అసెంబ్లీలోనే కుప్పకూలిపోయారు. తన కూతుర్ని తలుచుకుంటూ రోదించారు.

ముఖ్యమంత్రిగా సుభేందు అధికారి నూటికి నూరు శాతం విజయవంతమయ్యారు. ఒక కన్నతల్లి బాధను అర్థం చేసుకొని.. ఆమెకు న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నారు. ఆడదై ఉండి కూడా.. ఆడదాని బాధను అర్థం చేసుకోక రాక్షసి లాగా మిగిలిపోయారు మమత బెనర్జీ.. ఇద్దరికీ ఎంత తేడా..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper