HomeతెలంగాణTV Anchor : వార్తలు చదువుకుంటూ.. యాంకర్ ఏడ్చేసింది.. రంజింప చేయాలంటే తప్పదు మరి..

TV Anchor : వార్తలు చదువుకుంటూ.. యాంకర్ ఏడ్చేసింది.. రంజింప చేయాలంటే తప్పదు మరి..

TV Anchor : అప్పట్లో ఒక బోరు బావిలో చిన్నారి పడిపోయింది.. చాలా రోజుల పాటు ఆ పాపను బతికించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ చిన్నారి చనిపోయింది. నాడు 24 గంటల పాటు న్యూస్ ప్రసారం చేసే ఓ ఛానల్ (తెలుగులో ఇదే ప్రథమం) యాంకర్.. నాడు లైవ్ కవరేజ్ లో ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఘోరంగా ఏడ్చేసింది. అప్పట్లో చాలామంది ఆ యాంకర్ ఏడ్చిన […]

TV Anchor : అప్పట్లో ఒక బోరు బావిలో చిన్నారి పడిపోయింది.. చాలా రోజుల పాటు ఆ పాపను బతికించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ఎన్ని రకాలుగా చేసినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. చివరికి ఆ చిన్నారి చనిపోయింది. నాడు 24 గంటల పాటు న్యూస్ ప్రసారం చేసే ఓ ఛానల్ (తెలుగులో ఇదే ప్రథమం) యాంకర్.. నాడు లైవ్ కవరేజ్ లో ఆ విషయాన్ని చెప్పుకుంటూ ఘోరంగా ఏడ్చేసింది. అప్పట్లో చాలామంది ఆ యాంకర్ ఏడ్చిన తీరును రకరకాలుగా చెప్పుకున్నారు. ఆమె లో ఉన్న మానవత్వం ఇలా పరిమళించిందని వ్యాఖ్యానించారు. అప్పట్లో టి ఆర్ పి స్టంట్ లేదు. చివరికి వైయస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పుడు.. ఓ న్యూస్ ఛానల్ పనిచేసే జర్నలిస్టు లైవ్ లోనే కన్నీరు పెట్టుకున్నాడు. అప్పట్లో ఈ సంఘటనలు సంచలనానికి నాంది పలికాయి గాని.. ఈ స్థాయిలో ట్రోలింగ్ కాలేదు.

ఇప్పుడు తెలుగు మీడియా లో ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియాలో వార్తలోనేవి కొత్త పుంతలు తొక్కుతున్నాయి. రేటింగ్స్ కోసం చానల్స్ అడ్డమైన దారులు వెతుకుతున్నాయి. ఇందులో ఒక్కో యాజమాన్యానిది ఒక్కో తీరు. వార్తలను ప్రసారం చేసే విషయంలో.. లైవ్ కవరేజ్ విషయంలో.. రకరకాల మార్గాలను యాజమాన్యాలు కొనసాగిస్తుంటాయి. కొత్తగా వచ్చిన ఈ ఛానల్ యాజమాన్యం మాత్రం చాలా విభిన్నమైన ధోరణిని అనుసరించడం మొదలుపెట్టింది. ఇటీవల పెద్ద స్టూడియో నిర్మించిన ఈ ఛానల్ యాజమాన్యం.. కంటెంట్ ప్రసారం చేసే విషయంలో మాత్రం అంతటి “బిగ్” హార్ట్ ను చూపించలేకపోయింది.

న్యూస్ ఛానల్లో వార్తలు చదవాలంటే మాడ్యులేషన్ బాగుండాలి. కానీ ఈ ఛానల్ మాత్రం రకరకాల విన్యాసాలు చేయడం మొదలుపెట్టింది.. ఇప్పుడు నటన కూడా అవసరమని.. అదే ఇప్పుడు అర్హత అని నిరూపించింది. కొత్తగా ప్రారంభించిన స్టూడియోలో తొలిరోజే ఈ ఛానల్ యాజమాన్యం తన పరువు పోగొట్టుకుంది. ప్రారంభమే బీభత్సంగా ఉండడంతో.. తమ స్థాయి గట్టిగా ఉందని.. ప్రేక్షకుల నేత్రాల నుంచి నీళ్లు రప్పిస్తామని.. ఛానల్ మేనేజ్మెంట్ గట్టిగా అనుకున్నట్టుంది. అందువల్లే యాంకర్ నుంచి కరుణా రసాన్ని పండించింది.

గర్భస్రావంతో తల్లీబిడ్డ చనిపోతే.. ఆ వార్తను చదువుతున్న యాంకర్.. లైవ్ లోనే ఏడ్చేసింది.. వాస్తవానికి ఆ యాంకర్ కు చాలా అనుభవం ఉంది. ఇటువంటి వార్తలను గతంలో చాలాసార్లు చదివి ఉంది.. అయితే అప్పుడు కన్నీళ్లు పెట్టుకోలేదు. పైగా గంభీరంగా ఉంది. ఇప్పుడు మాత్రం ఏడ్చేసింది. దీనిని బట్టి ఆమె టియర్స్ వెనక బలమైన స్టోరీ ఉందని.. మాస్టర్ ప్లాన్ ఉందని అర్థమైంది.

కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్ల ఇప్పుడు టెలివిజన్ రేటింగ్స్ అనేవి లేవు. కేవలం సోషల్ మీడియాలో వైరల్ కావాలి కాబట్టి ఇలా చేస్తున్నారు. ఇందుకోసం మీడియా బీభత్సమైన గ్రాఫిక్స్ వాడుతోంది. నిజాలకు సంబంధం లేని ఊహాతీతమైన కథనాలను ప్రసారం చేస్తోంది.. ఇక దీనికి తోడు డెస్క్ వెనుక వైపు నుంచి కాస్త గట్టిగా ఏడిస్తే బెటర్.. అని పీసీఆర్ నుంచి వచ్చిన సందేశాలకు తగ్గట్టుగా వచ్చిన నటకన్నీళ్లు అని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటి కాలంలో లైక్స్ కావాలి. వ్యూస్ కావాలి. ఇవన్నీ రావాలంటే న్యూస్ పక్కకు పోవాలి. కేవలం ఆర్టిఫిషల్ కన్నీళ్లు మాత్రమే ఇదిగో ఇలా ప్రవహించాలి.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper