spot_img
Homeజాతీయ వార్తలుJanaSena: జనసేనకు ‘గాజు గ్లాసు’ పాయే.. తెలంగాణలో గుర్తు ఏది?

JanaSena: జనసేనకు ‘గాజు గ్లాసు’ పాయే.. తెలంగాణలో గుర్తు ఏది?

JanaSena: తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన జనసేన పార్టీకి ఎన్నికల సంఘం గట్టి షాక్‌ ఇచ్చింది. జనసేన గ్లాస్‌ గుర్తును ఆ పార్టీకి కేటాయించలేదు. గ్లాస్‌ గుర్తును ఫ్రీ సింబల్‌గా ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో పవన్‌ కల్యాణ్‌ ఏం చేస్తారనేది చర్చనీయాంశమైంది. ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంది. 8 స్థానాల్లో జనసేన అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ నేపథ్యంలో జనసేన అభ్యర్థులంతా గ్లాస్‌ గుర్తుతో ప్రచారం కూడా చేసుకుంటున్నారు. అయితే ఎన్నికల సంఘం అనూహ్యంగా గ్లాస్‌ గుర్తును రిజర్వ్‌లో పెట్టడంతో జనసేన అభ్యర్థులు షాక్‌ అయ్యారు.

గుర్తింపు పొందక పోవడంతో..
తెలంగాణలో జనసేన గుర్తింపు పొందిన పార్టీ కాకపోవడంతోనే గుర్తు సమస్య తలెత్తింది. అందువల్లే ఆ పార్టీ గుర్తును తెలంగాణలో జనసేనకు మాత్రమే కేటాయిస్తూ రిజర్వ్‌ పెట్టలేదు. గ్లాస్‌ గుర్తు జనసేనకు దక్కని పరిస్థితిలో ఆ పార్టీ అభ్యర్థులను స్వతంత్రులుగా పరిగణిస్తారనే చర్చకు తెరలేచింది. దీంతో జనసేన అభ్యర్థులకు ఒక్కొక్కరికి ఒక్కో గుర్తు కేటాయిస్తారా? లేక తాత్కాలికంగా 8 మందికి ఒకటే కోరుకుంటారా? అనేది తేలాల్సి వుంది.

విపక్షాలకు ఆయుధం..
ఇదిలా ఉండగా, ఎన్నికల సంఘం నిర్ణయం ఇతర పార్టీలకు ఆయుధంగా మారింది. తెలంగాణలో జనసేనకు కనీసం ప్రాంతీయ పార్టీగా కూడా గుర్తింపు లేదని ప్రత్యర్థులు దెప్పి పొడుస్తున్నారు. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న భారతీయ జనతా పార్టీ కనీసం ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొందని జనసేనతో పొత్తు పెట్టుకుందని, దీన్ని బట్టి జాతీయ పార్టీ దుస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చని బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నేతలు దెప్పి పొడుస్తున్నారు. మరోవైపు ఆంధ్రాలో అయితే.. వైసీపీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Balakrishna Family Entertainer

Nandamuri Balakrishna : ప్రత్యేక విమానంలో బాలయ్య ని హైదరాబాద్ కి తరలిస్తున్న డాక్టర్లు.. వీడియో వైరల్..

Nandamuri Balakrishna : నందమూరి బాలకృష్ణ రీసెంట్ గానే NBK111 షూటింగ్ లో గాయాలపాలైన సంగతి అందరికీ తెలిసిందే. ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్న సమయం లో అదుపు తప్పి...
CM Vijay viral assembly video

Tamil Nadu CM Vijay : సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. దెబ్బకు మారిపోయిన రాజకీయ సమీకరణాలు..

Tamil Nadu CM Vijay : గత రెండు మూడు రోజులుగా ఢిల్లీ పార్లమెంట్ వద్ద జరుగుతున్న ఉద్రిక్త పరిణామాలను గమనిస్తూనే ఉన్నాం. నీట్ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రాలు లీక్ అవ్వడం...
Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Oktelugu Epaper