Astrologer Crash Prediction: బ్రహ్మంగారు చెప్పిన చాలా విషయాలు కూడా నేడు నిజం అయ్యాయి. అలాగే బాబా వంగా జ్యోతిష్యం కూడా చాలా విషయాల్లో నిజం అని నిరూపితం అయింది. ఇలా ఎవరైనా కొన్ని విషయాలను ముందుగానే ఊహించి చెబితే మాత్రం ఆలోచనలో పడుతుంటారు ప్రజలు. అయితే గతంలో కూడా ఒక పండితురాలు రీసెంట్ గా జరిగిన విమాన ప్రమాదాన్ని ముందుగానే ఊహించింది. ఇంతకీ ఆమె ఎవరు? ఏంటి అనే వివరాలు చూసేద్దామా?
జూన్ 12న సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకన్లలోనే దగ్ధమైన విషయం తెలిసిందే. ఆ విమానం అహ్మదాబాద్‌లోని మేఘనినగర్ ప్రాంతంలోని ఒక మెడికల్ హాస్టల్‌పై కూలిపోయి 241 మంది ప్రయాణికులు, హాస్టల్ విద్యార్థులు సహా 270 మంది మృతి చెందారు. ఈ సందర్బంగా ఒక జ్యోతిష్కురాలి ట్వీట్ ప్రతిచోటా వైరల్ అవుతోంది.
Also Read: ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉండాలంటే ఇలా చేయాలి..
మహారాష్ట్రకు చెందిన పండితురాలు శర్మిష్ఠ గత ఏడాది డిసెంబర్‌లో విమాన ప్రమాదం జరిగే అవకాశాన్ని అంచనా వేశారు. భారత విమానయాన రంగం వృద్ధిని సాధిస్తుందని, కానీ దానితో పాటు భద్రత, భద్రత లోపం కూడా ఉంటుందని శర్మిష్ఠ హెచ్చరించారు. ఈ ట్వీట్ ఇప్పటికే 9 లక్షలకు పైగా వీక్షణలను సంపాదించింది.
జ్యోతిష్కురాలు శర్మిష్ఠ ఇప్పుడు కరణ్ వర్మ పాడ్‌కాస్ట్‌లో కనిపించి, భారత విమాన ప్రమాద సంఘటన గురించి తన అంచనాలను వివరించారు. ఆమె భారతదేశం, ప్రపంచ భవిష్యత్తు గురించి కూడా విస్తృతమైన అంచనాలను వేసింది. ఈ అంచనాలలో భారతదేశం-పాకిస్తాన్ యుద్ధం, భారతదేశ తదుపరి ప్రధానమంత్రి, ఇరాన్-యుఎస్ వివాదం, ప్రపంచ రాజకీయాలు వంటివి కూడా ఉన్నాయి.
ఇదిలా ఉంటే జూన్ 12న అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో చాలా మంది మరణించారు. అయితే విమాన బ్లాక్ బాక్స్ నుంచి డేటాను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకారం, కూలిపోయిన విమానం నుంచి రెండు బ్లాక్ బాక్స్ సెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో ప్రమాదం జరిగిన సమయంలో పైలట్ల సంభాషణ రికార్డు, విమాన సాంకేతిక సమాచారం ఉంటాయి. మొదటి సెట్ జూన్ 13న, రెండవ సెట్ జూన్ 16న స్వాధీనం చేసుకున్నారు.
Also Read: ఇది వెడ్డింగ్ షూటా? శోభనమా? ఏంట్రా ఇదీ
జూన్ 12న, లండన్‌కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI-171 అహ్మదాబాద్‌లో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. విమానంలో ఉన్న 241 మంది మరణించగా, ఒక ప్రయాణీకుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటనలో మొత్తం 270 మంది మరణించారు. అయితే ఇప్పుడు ఏ విధమైన ప్రయాణాలు చేయాలన్నా సరే ప్రజలు భయపడే పరిస్థితి నెలకొంది. ట్రైన్ లో జర్నీ చేయాలన్నా ఆక్సిడెంట్ లు అవుతున్నాయి. ఇక విమాన ప్రయాణాలు కూడా అదే విధంగా మారాయి. అందుకే ఇప్పుడు జర్నీ చేయడం అంటే భయపడుతున్నారు ప్రజలు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాము. దీన్ని Oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోగలరు.