Homeఎంటర్టైన్మెంట్Pallaburusu Trailer: టూత్ బ్రష్ కోసం కొడుకుపై కేసు వేసిన తండ్రి.. సంచలనం రేపుతున్న ట్రైలర్..

Pallaburusu Trailer: టూత్ బ్రష్ కోసం కొడుకుపై కేసు వేసిన తండ్రి.. సంచలనం రేపుతున్న ట్రైలర్..

Pallaburusu Trailer: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో చూసినా పాన్ ఇండియన్ సినిమాల హవానే కనిపిస్తోంది. స్టార్ హీరోలు ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ పెడుతున్నారు. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమాల ద్వారా వచ్చే లాభాలకంటే ఎక్కువగా , చిన్న సినిమాల నుండి వచ్చే లాభాలే ఎక్కువగా ఉంటున్నాయి. విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు, వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అందిస్తున్నారు. రీసెంట్ గా […]

Pallaburusu Trailer: ప్రస్తుతం ఏ ఇండస్ట్రీ లో చూసినా పాన్ ఇండియన్ సినిమాల హవానే కనిపిస్తోంది. స్టార్ హీరోలు ఎక్కువగా వీటి మీదనే ఫోకస్ పెడుతున్నారు. నిర్మాతలు వందల కోట్ల బడ్జెట్లు పెడుతున్నారు. అయితే ఈ సినిమాల ద్వారా వచ్చే లాభాలకంటే ఎక్కువగా , చిన్న సినిమాల నుండి వచ్చే లాభాలే ఎక్కువగా ఉంటున్నాయి. విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తే ప్రేక్షకులు అలాంటి సినిమాలకు బ్రహ్మరథం పడుతున్నారు, వందల కోట్ల గ్రాస్ వసూళ్లను అందిస్తున్నారు. రీసెంట్ గా అలాంటి ఉదాహరణలు చాలానే చూసాము. ముఖ్యంగా మట్టివాసనను గుర్తు చేసే పల్లెటూరి కథలకు దేశవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది. అలాంటి సబ్జెక్టు తో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘పళ్ళబురుసు’. ఇదేమి టైటిల్ రా బాబోయ్ అనిపిస్తుంది కదూ, కాన్సెప్ట్ కూడా అలాగే అనిపిస్తుంది. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ని అక్కినేని నాగార్జున విడుదల్ చేశారు.

ఈ చిత్రాన్ని నాగార్జున తన అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు. ఎపిక్ స్టూడియోస్ సంస్థ కూడా నిర్మాణం లో భాగం పంచుకుంది. ఉదయ్ చౌహాన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఇక ఈ ట్రైలర్ లో చూపించిన కథని ఒకసారి గమనిస్తే, ఇది కేవలం ఒక సింపుల్ పాయింట్ తో , స్క్రీన్ ప్లే మీద నడిచే సినిమా అని అర్థం అవుతోంది. పల్లెటూరిలో ఉండే ఒక వృద్దుడికి పంటి నొప్పి సమస్యలు ఉంటాయి. దీంతో డాక్టర్ ఆ వృద్దుడికి ‘పళ్ళబురుసు’ అనగా టూత్ బ్రష్ వాడమని సలహా ఇస్తాడు. దీంతో ఆ ముసలాయన తన కొడుక్కి ఒక టూత్ బ్రష్ కొని తీసుకొని రమ్మని అడుగుతాడు. కానీ ఆ కొడుకు నిర్లక్ష్యం చేయడం తో తీవ్రమైన మనస్తాపానికి గురైన ముసలాయన , ఒక చిన్న బ్రష్ కోసం ఏకంగా కొడుకుపై కోర్టులో కేసు వేస్తాడు.

చిన్న బ్రష్ కోసం కేసు ఏంటి? అని మీకు అనిపించొచ్చు, కానీ దీని వెనుక ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఉందని ట్రైలర్ ద్వారా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేసాడు. ముఖ్యంగా ఈ చిత్రం లోని నటీనటుల గురించి మాట్లాడుకోవాలి. ‘బలగం’ వంటి సెన్సేషనల్ హిట్ చిత్రంలో తమ అద్భుతమైన నటనతో కంటతడి పెట్టించిన మురళీధర్ గౌడ్ , సుధాకర్ రెడ్డి ఈ సినిమాల్లో లీడ్ రోల్స్ ప్లే చేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి పాత్రలో ఇరగదీసినట్టు ట్రైలర్ ని చూస్తుంటే అర్థం అవుతోంది. ముఖ్యంగా ఆయన లుక్స్ , డైలాగ్ డెలివరీ నటన చాలా సహజంగా అనిపిస్తున్నాయి. ఇక మురళీ ధర్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సన్నివేశాలను రక్తికట్టించడం లో ఈయన నేటి తరం లో ది బెస్ట్ గా ఆడియన్స్ మెప్పు పొందాడు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా , కచ్చితంగా బలగం తరహాలోనే బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ని మీకోసం కింద అందిస్తున్నాము చూడండి.

 

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper