Homeటాప్ స్టోరీస్Kavitha vs KCR : కేసీఆర్ ను కవిత ఎదురించిందా..అసలు ఏం జరిగిందో నిజం బయటపెట్టిన...

Kavitha vs KCR : కేసీఆర్ ను కవిత ఎదురించిందా..అసలు ఏం జరిగిందో నిజం బయటపెట్టిన కవిత

Kavitha vs KCR : తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కవిత పొలిటికల్ గా మారింత యాక్టివ్ అయిపోయారు. మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో నో ఫిల్టర్స్.. నో ఎడిట్స్.. ఉన్నది ఉన్నట్టుగానే.. కుండబద్దలు కొట్టినట్టుగానే.. మొన్న మధ్య కేటీఆర్ ఏమంటాడంటే.. కవితను మేము పంపించలేదు.. ఆమంతుట ఆమె వెళ్లిపోయింది.. ఆమెకు మేము రాజకీయంగా చాలా అవకాశాలు ఇచ్చాం. పార్టీ ఆమె కోసం చాలా చేసింది. కానీ ఆమె వేరే దారి […]

Kavitha vs KCR : తెలంగాణ రక్షణ సేన ఏర్పాటు తర్వాత కల్వకుంట్ల కవిత పొలిటికల్ గా మారింత యాక్టివ్ అయిపోయారు. మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో నో ఫిల్టర్స్.. నో ఎడిట్స్.. ఉన్నది ఉన్నట్టుగానే.. కుండబద్దలు కొట్టినట్టుగానే..

మొన్న మధ్య కేటీఆర్ ఏమంటాడంటే.. కవితను మేము పంపించలేదు.. ఆమంతుట ఆమె వెళ్లిపోయింది.. ఆమెకు మేము రాజకీయంగా చాలా అవకాశాలు ఇచ్చాం. పార్టీ ఆమె కోసం చాలా చేసింది. కానీ ఆమె వేరే దారి వెతుక్కుంది అన్నట్టుగా కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనికి కవిత కూడా ఆదే స్థాయిలో రిప్లై ఇచ్చారు.

ఏడాదిగా ఆమెకు పార్టీలో సరైన ప్రయారిటీ ఇవ్వలేదు. పైగా ఆమె సింగరేణి కార్మిక సంఘానికి గౌరవ అధ్యక్షురాలుగా ఉంది. ఆమె కుమారుడు అమెరికాలో చదువుతుంటే అక్కడికి వెళ్ళింది. అతడి గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి హాజరైంది. ఆమె అమెరికాలో ఉండగానే లేఖలు బయటికి వచ్చాయి. గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తొలగిస్తున్నట్టు పార్టీ నిర్ణయం తీసుకుంది. కనీసం ఆమెకు షోకేస్ నోటీస్ ఇవ్వకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.

ఈ పరిణామాలు మొత్తం కవితలో తీవ్రమైన బాధకు కారణమయ్యాయి. చివరికి తన తండ్రిని కూడా కలిసే అవకాశాన్ని కొంతమంది ఇవ్వకపోవడంతో కవితలో ఆగ్రహం మరింత పెరిగిపోయింది. దీంతో ఆమె కొద్ది రోజులపాటు నిశ్శబ్దంగా ఉన్నారు. జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీ ఏర్పాటు చేశారు. వాస్తవానికి ఆమె తెలంగాణ రక్షణ సేనను ఏర్పాటు చేయడం వెనక ఏం జరిగిందనేది చాలా మందికి తెలియదు. ఇటీవలి ఇంటర్వ్యూలో మాత్రం కవిత మొత్తంగా జరిగిన పరిణామాల మీద క్లారిటీ ఇచ్చేశారు. కెసిఆర్ కుమార్తె నైన తనకే ఇంత ఇబ్బంది ఉంటే.. ఇక సామాన్య కార్యకర్తల పరిస్థితి ఏంటి అని ప్రశ్నించడం చర్చకు దారితీస్తోంది. ఇక ఇదే క్రమంలో తాను కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు భారత రాష్ట్ర సమితిలో చేరేది లేదని స్పష్టం చేసింది. ఆ పార్టీని కనీస విలువలు లేవని.. ఒక విధానం అంటూ లేదని.. ఒక వ్యక్తి చేతిలో పార్టీ కట్టు బానిసలాగా మారిపోయిందని.. ఇలాంటప్పుడు పార్టీలో ఉంటే ఎంత.. వెళ్ళిపోతే ఎంత.. అన్నట్టుగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారాయి.

కవిత చెబుతున్న సంచలన విషయాలు తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితికి ఇబ్బందిగా మారే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. బయటి వాళ్లు ఇలాంటి విమర్శలు చేస్తే జనం పెద్దగా పట్టించుకోరని.. సాక్షాత్తు కేసీఆర్ కుమార్తె ఇటువంటి విమర్శలు చేయడం ప్రజలను ఆలోచింపజేస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కవిత ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికీ.. గులాబీ పార్టీ నాయకులు ఒక్కరు కూడా సరైన కౌంటర్ ఇవ్వడం లేదు. మొన్న కేటీఆర్ ఈ విషయం మీద క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ.. అదంతా సత్య దూరం లాగానే కనిపించింది. చివరికి కేటీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల కూడా కవిత సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. ప్రతి అంశాన్ని ఆమె లోతుగా చెప్పడంతో.. కవిత బాధిత పక్షమని అర్థమవుతుంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper