Homeఎంటర్టైన్మెంట్Vishnu Priya: నాకు చాలా మంది 'గర్ల్ ఫ్రెండ్స్' ఉన్నారంటూ విష్ణు ప్రియా హాట్ కామెంట్స్.....

Vishnu Priya: నాకు చాలా మంది ‘గర్ల్ ఫ్రెండ్స్’ ఉన్నారంటూ విష్ణు ప్రియా హాట్ కామెంట్స్.. వీడియో వైరల్!

Vishnu Priya: సోషల్ మీడియా నెటిజెన్స్ లో యాంకర్ విష్ణుప్రియ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె చేసే బోల్డ్ కామెంట్స్ కి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు. అదే సమయం లో ఆమె పై ఒక సెక్షన్ నుండి తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. అయితే ఎవరేమి అనుకున్నా తన మనసుకి తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది విష్ణు ప్రియ. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ […]

Vishnu Priya: సోషల్ మీడియా నెటిజెన్స్ లో యాంకర్ విష్ణుప్రియ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈమె చేసే బోల్డ్ కామెంట్స్ కి యూత్ ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుంటారు. అదే సమయం లో ఆమె పై ఒక సెక్షన్ నుండి తీవ్రమైన నెగెటివిటీ ఏర్పడింది. అయితే ఎవరేమి అనుకున్నా తన మనసుకి తోచిన విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది విష్ణు ప్రియ. ఇకపోతే రీసెంట్ గా ఆమె ఇన్ స్టాగ్రామ్ లో సబ్ స్క్రిప్షన్ అనే ఆప్షన్ పెట్టడం, దాదాపుగా 5 వేల మంది సబ్ స్క్రిప్షన్స్ తీసుకోవడం, వాళ్ళ కోసం ఆమె హాట్ వీడియోలను అప్లోడ్ చేయడం వంటివి పెద్ద దుమారమే రేపాయి. వీటిపై ఎన్నో విమర్శలు వచ్చాయి, న్యూస్ చానెల్స్ లో లైవ్ డిబేట్స్ కూడా వచ్చాయి. అయితే ఇదంతా విష్ణు ప్రియ కి మేలు చేసిందనే చెప్పాలి.

‘బిగ్ బాస్ 8’ పూర్తి అయ్యి రెండేళ్లు అయినప్పటికీ ఆమెకు సినిమాల్లో ఎలాంటి అవకాశాలు రాలేదు. ఎప్పుడైతే ఇన్ స్టాగ్రామ్ లో తన అందాలను అరబోయడంతో పాటు ,బోల్డ్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టిందో, అప్పటి నుండి ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలయ్యాయి. అందులో భాగంగా రీసెంట్ గా ఆమెకు ‘రంభ ఊర్వశి మేనకా’ మూవీ లో ఊర్వశి క్యారెక్టర్ చేసే అవకాశం దక్కింది. అల్లరి నరేష్ హీరో గా నటించిన ఈ సినిమా, సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ట్రైలర్ లకు ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అల్లరి నరేష్ వింటేజ్ కామెడీ టైమింగ్ అందరికీ నచ్చింది. మరోపక్క మూవీ టీం నాన్ స్టాప్ గా ప్రమోషనల్ కార్యక్రమాలు కూడా చేస్తోంది.

రీసెంట్ గా ప్రొమోషన్స్ లో భాగంగా విష్ణుప్రియ, రాశీ సింగ్ కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూ లో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె మాట్లాడుతూ ‘నాకు చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు తెలుసా..?, బాయ్ ఫ్రెండ్స్ కంటే నాకు గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ. నా ఇన్ స్టాగ్రామ్ షబ్ స్క్రిప్షన్స్ లో కూడా గర్ల్స్ ఉన్నారు. నా వీడియోలు చూస్తుంటారు, ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో చెప్తుంటారు’ అంటూ చెప్పుకొచ్చింది విష్ణు ప్రియ. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి.

 

View this post on Instagram

 

A post shared by privishhhhh (@vishnuulovee9)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper