Vishnu Priya: ఈమధ్య కాలం లో విష్ణు ప్రియ పేరు సోషల్ మీడియా లో మంచి ట్రెండింగ్ టాపిక్ అనే సంగతి అందరికీ తెలిసిందే. ‘బిగ్ బాస్ 8’ ద్వారా ఈమెకు ఏ రేంజ్ ఫేమ్ వచ్చిందో తెలియదు కానీ , రీసెంట్ గా జరిగిన కొన్ని సంఘటన కారణంగా ఎవ్వరూ ఊహించనంత ఫేమ్ వచ్చేసింది. అందుకే ‘రంభ ఊర్వశి మేనకా’ చిత్రం లో ఊర్వశి పాత్ర పోషించే అరుదైన అవకాశం ఈమెకు దక్కింది. అల్లరి నరేష్ హీరో గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని నిన్న విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ కామెడీ జానర్ సినిమా చేయడం తో , ఆడియన్స్ లో ఈ చిత్రం పై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.
అయితే ఈ సినిమాలో మేనకా లాంటి దేవత పాత్రకు విష్ణు ప్రియ ని ఎంచుకోవడం పై సోషల్ మీడియా లో విమర్శలు వినిపిస్తున్నాయి. విష్ణు ప్రియ చూసేందుకు చాలా అందంగా ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఆమె చేసిన కొన్ని బోల్డ్ అడల్ట్ రేటెడ్ వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని కూడా దేవత పాత్ర ఎలా ఇచ్చారంటూ సోషల్ మీడియా లో విమర్శలు చేస్తున్నారు నెటిజెన్స్. ఇకపోతే నిన్న జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్ కి విష్ణు ఊర్వశి గెటప్ లోనే పాల్గొన్నది. అయితే మీడియా రిపోర్టర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘విష్ణు ప్రియ అంటే వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోతుంది ఈమధ్య కొన్ని విషయాల్లో, దాని గురించి మీరేమి అంటారు’ అని అడగ్గా, అందుకు విష్ణు ప్రియ సమాధానం చెప్తూ ‘మనం సినిమా గురించి మాట్లాడుదాం అండీ’ అంటూ చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చింది.
అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఇక ఈ చిత్రం లో రంభ పాత్రలో రాశీ సింగ్ నటించగా, మేనకగా ప్రిషా సింగ్ నటించింది. ఇక ఈ చిత్రం లో హీరోయిన్ గా సురభి నటించగా , అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించాడు. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబర్ 4 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరీ చాలా కాలం నుండి సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అల్లరి నరేష్ కి , ఈ సినిమా రూపం లో సక్సెస్ లభిస్తుందా?, విష్ణు ప్రియ కి సినిమాల పరంగా మంచి బ్రేక్ దొరుకుతుందా లేదా అనేది చూడాలి.
రిపోర్టర్: Vishnu Priya అంటే కొన్ని విషయాల్లో controversiesకి కేరాఫ్ అడ్రస్ అయిపోతుంది? #VishnuPriya: మనం ప్రస్తుతం ‘రంభ ఊర్వశి మేనక’ సినిమా గురించి మాట్లాడుకుందాం. pic.twitter.com/pbuiyIn7B9
— BigTV APP (@BigtvApp) August 12, 2026