Homeఎంటర్టైన్మెంట్Vijay: విజయ్ ని స్టార్ ను చేసింది...ఆయన్ని గెలిపించింది ఈ నలుగురేనా...

Vijay: విజయ్ ని స్టార్ ను చేసింది…ఆయన్ని గెలిపించింది ఈ నలుగురేనా…

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించిన నటుడు విజయ్…రజినీకాంత్ తర్వాత ఆ రెంజ్ సక్సెస్ ను సంపాదించుకున్న హీరో తనే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక గత సంవత్సరం ఆయన టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీని పెట్టినందుకు గాను అతని మీద కొన్ని విమర్శలైతే వచ్చాయి. అయినప్పటికి ఆయన 108 […]

Vijay: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాలను సృష్టించిన నటుడు విజయ్…రజినీకాంత్ తర్వాత ఆ రెంజ్ సక్సెస్ ను సంపాదించుకున్న హీరో తనే కావడం విశేషం… ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక గత సంవత్సరం ఆయన టీవీకే అనే ఒక రాజకీయ పార్టీని పెట్టి రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో పాల్గొన్నారు. అయితే ఈ పార్టీని పెట్టినందుకు గాను అతని మీద కొన్ని విమర్శలైతే వచ్చాయి. అయినప్పటికి ఆయన 108 సీట్లు కైవసం చేసుకోవడం అనేది మామూలు విషయం కాదు. మొదటి ఎలక్షన్స్ లోనే ఈ రేంజ్ లో సెట్లు గెలుచుకొని గవర్నమెంట్ ను ఫామ్ చేస్తున్నాడంటే విజయ్ మామూలు వ్యక్తి కాదని చాలామంది అతన్ని కొనియాడుతున్నారు. ఇక ఏది ఏమైనా కూడా విజయ్ హీరోగా నిలదొక్కుకోవడానికి కానీ రాజకీయ రంగంలో రాణించడానికి కానీ ఒక నలుగురు కారణమయ్యారు అంటూ కొంతమంది సోషల్ మీడియాలో కొన్ని కామెంట్లు చేస్తున్నారు.

ఇంతకీ వాళ్ళు ఎవరు అంటే అందులో ఒకరు మహేష్ బాబు, రెండు మురుగదాస్, మూడు అజిత్ ,నాలుగు రజినీకాంత్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఆయన స్టార్ హీరో అవ్వడానికి ఆయన ఎలక్షన్లో పోటీ చేసి గెలువడానికి వీళ్ళు నలుగురు ఎలా కారణమని మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి మహేష్ బాబు సినిమాలను రీమేక్ చేసి ఆయన స్టార్ హీరోగా మారాడు… అలాగే మురుగదాస్ తను చేసిన సినిమాలతో విజయ్ ని టాప్ హీరోగా నిలబెట్టడానికి చాలా వరకు కృషి చేశాడు. ఇక రజనీకాంత్ స్టైల్ ని ఫాలో అవుతూ ఆయన రజనీకాంత్ తర్వాత అంత గొప్ప క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇక ఇదిలా ఉంటే అజిత్ లాంటి హీరోతో పోటీపడుతూ ఆయన అభిమానులకు విజయ్ అభిమానులకు మధ్య ఎప్పుడు వైరమైతే ఉండేది. దానివల్ల విజయ్ అజిత్ ని డామినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు టాప్ లోకి రావాలనే ప్రయత్నం చేశాడు. ఇక వీళ్ళ నలుగురి కారణంగానే విజయ్ స్టార్ హీరోగా మారడమే కాకుండా ఎలక్షన్స్ లో కూడా రాణించాడు అంటూ పలువురు సోషల్ మీడియా వేదిక గా కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper