Homeఎంటర్టైన్మెంట్Anirudh Ravichander: అనిరుధ్, కావ్య పెళ్లి ఖర్చు.. రెండు జైలర్ సినిమాలు తీయొచ్చు..

Anirudh Ravichander: అనిరుధ్, కావ్య పెళ్లి ఖర్చు.. రెండు జైలర్ సినిమాలు తీయొచ్చు..

Anirudh Ravichander: అనిరుధ్, కావ్య వివాహం గ్రీస్ లో అత్యంత వైభవంగా జరిగింది. సన్నిహితుల మధ్య.. ఈ పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. కావ్య చేతులు పట్టుకొని అనిరుద్ నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నూతన దంపతులు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దుస్తులను ధరించారు. ఇద్దరు చిరునవ్వులు ఒలకబోస్తూ.. నడుస్తూ వస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కావ్యను పెళ్లి చేసుకున్న తర్వాత అనిరుద్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పెళ్లి జీవితాంతం […]

Anirudh Ravichander: అనిరుధ్, కావ్య వివాహం గ్రీస్ లో అత్యంత వైభవంగా జరిగింది. సన్నిహితుల మధ్య.. ఈ పెళ్లి వేడుక కన్నుల పండువగా జరిగింది. కావ్య చేతులు పట్టుకొని అనిరుద్ నడుస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. నూతన దంపతులు బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దుస్తులను ధరించారు. ఇద్దరు చిరునవ్వులు ఒలకబోస్తూ.. నడుస్తూ వస్తున్న దృశ్యాలు ఆకట్టుకుంటున్నాయి. కావ్యను పెళ్లి చేసుకున్న తర్వాత అనిరుద్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ పెళ్లి జీవితాంతం గుర్తుండిపోతుందని.. ప్రత్యేకంగా నిలిచిపోతుందని.. 11వ తేదీ.. 11వ నెల లో పెళ్లి జరిగిందని.. అనిరుధ్ చెప్పుకొచ్చారు.

ఈ పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ కావడంతో.. గెస్టులను ప్రత్యేకమైన విమానాల ద్వారా గ్రీస్ తీసుకెళ్లారు. దీనికోసం భారీగానే ఖర్చుపెట్టినట్టు తెలుస్తోంది. ఇక వివాహ వేదిక.. నూతన దంపతుల దుస్తులు.. డిన్నర్.. ఇతర ఏర్పాట్లకు కూడా భారీగానే ఖర్చుపెట్టినట్టు సమాచారం. ప్రఖ్యాత సంస్థ ఈ పెళ్లి వేడుకల నిర్వహణ బాధ్యతను మొత్తం నిర్వర్తించిందని తెలుస్తోంది. దీనికోసం వందల కోట్లు ఖర్చుపెట్టినట్టు సమాచారం. అయితే ఈ పెళ్లికి పెట్టిన ఖర్చుతో జైలర్ లాంటి సినిమాలు రెండు తీయవచ్చు అని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. దానికి తగ్గట్టుగానే ఏకైక కుమార్తె పెళ్లిని కళానిధి మారన్ అత్యంత ఘనంగా చేశారు. ఆ పెళ్లి వేదిక మీద ఉన్న పూలను చూస్తేనే అర్థమవుతోంది.. ఈ వేడుక కోసం ఆయన ఎంత ఖర్చు పెట్టారో.

అనిరుద్, కావ్య పెళ్లి కంటే ముందు.. వారి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డు సోషల్ మీడియాలో సంచలనం కలిగించింది. దీనిని రంజని అయ్యంగార్ రూపొందించారు. ఆమె నిర్వహిస్తున్న పింకీ విజిల్ మాన్ సంస్థ దీనిని రూపొందించింది. ఐవరి.. పౌడర్ బ్లూ రంగుల్లో ప్రత్యేకమైన బాక్స్ రూపొందించారు. చెక్కపై చేతితో చెక్కిన డిజైన్లు.. త్రీడి అలంకరణలను రూపొందించారు. ఇక ఈ డిజైన్ విషయంలో అనిరుధ్.. కావ్య అనేకసార్లు సూచనలు చేశారు.

పెళ్లికి దగ్గరి బంధువులు మాత్రమే వచ్చారు. రజనీకాంత్ దంపతులు.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ దంపతులు.. కావ్య, అనిరుద్ తల్లిదండ్రులు ఈ వేడుక కోసం హాజరయ్యారు. ఇక ఈ వేడుకలు అనిరుద్ సంప్రదాయ తమిళ పంచ కట్టులో కనిపించారు. అందులో ఆయన అత్యంత అందంగా ఉన్నారు. పెళ్లి వేడుక కంటే ముందు మెహందీ.. సంగీత్ వంటి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయకపోయినప్పటికీ బయటికి వచ్చాయి. ఇక ఇప్పుడు పెళ్లి ఫోటోలను స్వయంగా అనిరుద్ సోషల్ మీడియా వేదిక ద్వారా బయటపెట్టారు.

 

View this post on Instagram

 

A post shared by Anirudh (@anirudhofficial)

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper